Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్టివారిని గుర్తుపట్టటం కష్టంగాదా?’’అని మనసులో తర్కించుకొనుచుండగా, అదే సమయంలో ఋతుపర్ణుడు తన భుజంనుండి ‘ఉత్తరీయం’ జారి క్రిందపడినట్లు చూచాడు. వెనువెంటనే ఋతుపర్ణుడు
‘‘బాహుకా! రథం ఇంచుక ఆపుము! వార్‌ష్ణేయుడు దిగి నేలపైబడ్డ నా ఉత్తరీయం తెస్తాడు’’ అని అన్నాడు. అందుకు
‘‘మహారాజా! మీ ఉత్తరీయం పడిపోయినచోటు ఇచటికి ఇప్పుడు ఒక యోజన దూరంలో ఉన్నది. ఇక వార్‌ష్ణేయుడు అంతదూరం పాదచారియై వెళ్ళి వస్త్రాన్ని ఎలా తేగలడు’’అని బదులుపలికి రథంపోతున్న వేగం యొక్క మహిమను నిరూపించి చెప్పాడు.
అంతటి వేగంతో పయనించిన రథం పెక్కు దేశాలను దాటి వెళ్ళింది. ఇంతలో రథం ఒక అరణ్యంలో సాగిపోతున్నది. ఋతుపర్ణుడు ఆ అడవిలో ఒక పెద్ద ‘విభీతిక’ వృక్షం (తాండ్ర చెట్టు) దట్టమైన పెక్కు ఆకులతో, లెక్కింప అలవిగాని రెమ్మలతో, కొమ్మలతో, పండ్లతో కనిపించింది. ఫల సమృద్ధమైన ఆ చెట్టును చూపి బాహుకునితో
‘‘సారథీ! బాహుకా! అందరికీ అన్ని విషయాలు తెలియవుగదా? జ్ఞాన నైపుణ్యాలలో అందరూ వేరువేరు విషయాలలో గొప్పవారు అవుతారు, ‘‘ముఖే ముఖే సరస్వతి’’అనే లోకోక్తి కలదుగదా! నాకు సంఖ్యా శాస్త్రంలో విశిష్టమైన శక్తి ఉన్నది.
ఇది నీవు చూడాల్సిన విషయం. ఏ ఒక్కడూ సర్వజ్ఞుడు కాడు. చూడుము ఈ వృక్షానికి ఆకులూ పండ్లూ ఉన్నాయి.
‘‘బాహుకా! ఈ తాండ్ర చెట్టునుండి రాలిపడిన ఆకులు నూట ఒక్కటి పండు ఒక్కటి, ఈ వృక్షానికి ఉన్న రెండు రెమ్మలకు ఐదు కోట్ల ఆకులున్నాయి. ఆ శాఖలకు కొన్ని ప్రశాఖలున్నాయి. ఆ రెండు శాఖలకు రెండు వేల తొంభై అయిదు ఫలాలున్నాయి’’ అని అన్నాడు.
అందుకు బాహుకుడు ‘‘మహారాజా! మీరు చెప్పింది నాకు పరోక్షంగానే ఉన్నది. వీటిని లెక్కపెడితే గాని చెప్పినది నిజమని నిశ్చయించజాలను. ఫలాలను లెక్కించి చూస్తాను. రాజా! ఒక్క ముహూర్త కాలం ఈ కళ్ళాలను వార్‌ష్ణేయుడు పట్టుకొంటాడు’’ అని అనగా అందుకు రాజు
‘‘ఆలస్యం చేయటానికి తగిన సమయం గాదు’’ అని అన్నాడు.
‘‘రాజా! ఉతృష్టమైన ప్రయత్నం జరుగుచున్నది. ముహూర్తకాలం వేచి చూడండి. కాదని త్వరపడితే మీరు వార్‌ష్ణేయుని సారథిగా తీసికొని వెళ్ళండి. మీకు శుభమగుగాక’’అని బాహుకుడు సమాధానమిచ్చాడు.
‘‘లేదు! బాహుకా! నీవే సారథ్యం వహించాలి. ఈ భూతలంలో సారథ్యం చేసే విషయంలో నీకు సాటి ఎవ్వరూ లేరు. నీ సారథ్యంలోనే నేను విదర్భ దేశానికి చేరాలి. విఘ్నాన్ని కలుగజేయవద్దు బాహుకా! నీవు చెప్పినట్లే చేస్తాను. తెల్లవారేసరికి విదర్భచేరాలి. సూర్యుని నాకు చూపించాలి’’అని ఋతుపర్ణుడు బాహుకుని అనునయించాడు.
‘‘తాండ్ర పండ్లను లెక్కించిన వెంటనే విదర్భకు చేరగలం. నా మాటను మన్నించండి’’అని బాహుకుడు నమ్మబలికాడు.
‘‘కొమ్మలో కొంత భాగం లెక్కించి ప్రీతి చెందుము’’అని ఋతుపర్ణుడు అన్నాడు.
అందుకు ఇష్టంలేనట్లుగా బాహుకుడు వెంటనే రథంనుండి క్రిందికి దూకి చెట్టును నరికాడు. ఆయా కొమ్మలో ఉండే ఆకును, పండ్లను లెక్కబెట్టాడు. ఋతుపర్ణుడు చెప్పినట్లుగానే పండ్లు ఉండటాన్ని చూచి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. రాజును చూచి
‘‘మహారాజా! ఇది అత్యద్భుతమైంది. మీ విద్యాబలాన్ని ప్రత్యక్షంగా చూచాను. తమరు ఏ విద్యతో సంఖ్యను చెప్పగలుగుతున్నారో ఆ విద్యను గూర్చి వినగోరుచున్నాను’’అని అన్నాడు బాహుకుడు.
ప్రయాణాన్ని తొందరపెడుతూనే ఋతుపర్ణుడు

- ఇంకాఉంది