మెయన్ ఫీచర్

చట్టంలో లొసుగులు.. రక్షణ లేని హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టాల్లో ఉన్న గందరగోళానికి మినహాయింపులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించదగిన కేసుల్లోనూ- బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో (జువైనల్ హోం) గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం (లా కమిషన్) అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి 16కు తగ్గించాలని సిఫార్సు చేసింది. లా కమిషన్ సిఫార్సును సుప్రీం కోర్టు త్రోసిపుచ్చింది. దీనిపై 2012 నుండి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. అప్పటి స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సైతం బాలలుగా నిర్వచించే వయస్సును 16 ఏళ్లకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఓటు వేయాలంటే స్ర్తి, పురుషులకు 18 ఏళ్లు దాటాలి. పెళ్లి చేసుకోవాలంటే స్ర్తిలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు నిండాలి. జువైనల్ కేసుల్లో మినహాయింపు పొందాలంటే అమ్మాయిలకు 18 ఏళ్లలోపు, అబ్బాయిలకు 16 ఏళ్లలోపు వయస్సుండాలి. బాల కార్మికులుగా నిర్థారించాలంటే 5 నుండి 14 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
మానసిక శాస్తవ్రేత్తల నిర్వచనాల ప్రకారం ముఖ్యంగా ఉడ్‌వర్త్ అభిప్రాయం మేరకు చూస్తే అనువంశికత పరిసరాల సమష్టి ఉత్పన్నమే వ్యక్తి. వ్యక్తి సమర్ధతలు, సామర్ధ్యాలు అనువంశికతంగా సంక్రమిస్తే వాటిని అభివృద్ధి పరిచే అవకాశాలను పరిసరాలు కల్పిస్తాయి. మానవ జీవితంలో నిరంతరం కొనసాగే వికాసాలను అధ్యయనం చేయడానికి ఎలిజిబెత్ హార్లాక్ అనే శాస్తవ్రేత్త మానవ జీవితాన్ని వయోపరిమితుల ఆధారంగా 10 దశలుగా వర్గీకరించారు. నవజాత శిశువు అంటే 0-2 వారాలు, రెండు వారాలు మొదలు రెండేళ్ల వరకూ శైశవ దశ , 2 నుండి 6 ఏళ్ల ప్రాయం పూర్వ బాల్య దశ, 6 నుండి 10 ఏళ్ల ప్రాయం ఉత్తర బాల్యదశ, 11 నుండి 12 ఏళ్ల వరకూ యవ్వనారంభ దశ, 13 నుండి 17 ఏళ్లవరకూ పూర్వ కౌమార దశ, 17 నుండి 21 ఏళ్ల వరకూ ఉత్తర కౌమారం, 21 నుండి 40 ఏళ్ల వరకూ వయోజన దశ, 40 నుండి 60 ఏళ్ల వరకూ మధ్య వయస్సు, 60 ఏళ్లు దాటితే వృద్ధాప్యంగా వర్గీకరించాడు. చట్టాలకు, మానసిక శాస్తవ్రేత్తల నిర్వచనాలకు, అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు, ప్రపంచదేశాల ఒడంబడికలకు మధ్య ఉన్న వైరుధ్యం మనకు తారసపడుతుంది. భారత క్రైస్తవుల వివాహ చట్టం 1872 సెక్షన్ 60(1), పార్శీల వివాహాలు, విడాకుల చట్టం 1936 సెక్షన్ 3(1)(సీ), ప్రత్యేక వివాహాల చట్టం 1954, హిందూ వివాహాల చట్టం 1955, బాల్య వివాహాల నిరోధక చట్టం 2001 సెక్షన్ 2(ఏ) ప్రకారం లింగవివక్ష ఏ మాత్రం తగదు. అబ్బాయిలు 21 ఏళ్ల వరకూ వివాహం చేసుకోరాదనే నిబంధన ఉన్నా, అమ్మాయిలకు మాత్రం 18 ఏళ్లకే వివాహం చేయవచ్చనే మినహాయింపు కారణంగా మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఎదుగుదల లేని పిల్లలకు చిన్నతనంలోనే బలవంతపు పెళ్ళిళ్లు జరుగుతున్నాయి. ఇది వారి హక్కులను భంగపరచడమే. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు సహా ఇతర ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది.
ప్రపంచంలో 125కు పైగా దేశాల్లో యువతీ యువకుల వివాహానికి ఒకే వయోపరిమితిని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ వయోపరిమతి 21 కాగా, కొన్ని దేశాల్లో 18 ఏళ్లకే వివాహం చేసుకునే చట్టపరమైన అనుమతి ఉంది. అమెరికాలో 23 రాష్ట్రాల్లో 16 ఏళ్ల కంటే పిన్నవయస్సు వారు కూడా వివాహాలు చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. నాలుగు రాష్ట్రాల్లో కనీసం 15 ఏళ్లు, 20 రాష్ట్రాల్లో కనీసం 16 ఏళ్లు, 8 రాష్ట్రాల్లో కనీసం 17 ఏళ్ల వయస్సుండాలి. అమెరికాలో సాధారణ వివాహ వయస్సు 18 నుండి 21 ఏళ్లు. బెహ్రయిన్‌లో అమ్మాయిలకు 15 ఏళ్లు వస్తే చాలు వివాహం చేయవచ్చు. బెలారస్‌లో 14 ఏళ్లకే తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు. బొలివియాలో 14 ఏళ్లకు కామెరూన్‌లో 15 ఏళ్లకు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కెనడాలో 16 ఏళ్లకు, మకావోలో 16ఏళ్లకు కొలంబియాలో 14 ఏళ్లకు, ఇరాన్‌లో 9 ఏళ్లకు, ఇరాక్‌లో 15 ఏళ్లకు, జపాన్‌లో 16 ఏళ్లకు, కువైట్‌లో 15 ఏళ్లకు అమ్మాయిలు వివాహం చేసుకోవచ్చు.
పలు సందర్భాల్లో ఢిల్లీ హైకోర్టు, ఏపీ హైకోర్టు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇచ్చిన తీర్పులు సైతం వయోపరిమితికి సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తెలంగాణలో గత పక్షం జరిగిన మూడు తీవ్రమైన నేరాలలో బాల ల ప్రమేయం గుర్తించారు. ఓ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంలో 14 ఏళ్ల సహ విద్యార్థుల ప్రమేయం ఉంది. ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జువైనల్ పేరుతో కేసుల నుండి ఇట్టే బయటపడొచ్చనే భావన కూడా బలపడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ 2015 చట్టం’లో ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం 18ఏళ్లలోపు బాలలు తీవ్ర నేరాలకు పాల్పడితే వారిని మాత్రం సాధారణ పౌరులు మాదిరే విచారణ జరపాలని నిర్ణయించింది. అంటే 16 నుండి 18 ఏళ్లలోపు బాలలు ఘోరాలకు పాల్పడితే విచారణ ఎదుర్కోక తప్పదు.
బాలల హక్కుల పరిరక్షణ గురించి ఇపుడు మనం మాట్లాడుకుంటున్నా ఇందుకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు 169 ఏళ్ల క్రితమే మొదలైంది. 1850లో ది అప్రెంటీస్ యాక్టు అమలులోకి వచ్చింది. అంటే 18 ఏళ్ల లోపు బాలలు నేరస్థులైతే వారిని అలా వదిలేయకుండా ఏదో ఒక అంశంలో నైపుణ్యాన్ని వికాసాన్ని పెంచాలని ఈ చట్టం చెబుతోంది. 1887లో రిఫార్మెటరీ స్కూల్ యాక్టు అమలులోకి వచ్చింది. 2 రెండు 7 ఏళ్లలోపు బాలలు చట్టపరమైన శిక్షకు అర్హులైతే వారికి ఆయా గృహాల్లోనే ఉంచి విద్యావకాశాలు కల్పించాలి. 1920లో మద్రాస్ చిల్ట్రన్ యాక్టు, తర్వాత కలకత్తా చిల్ట్రన్ యాక్టు అమలులోకి వచ్చాయి. వీటికి అనుగుణంగా 1923లో సీపీసీలో సవరణలు చేశారు. 1960లో ది చిల్ట్రన్ యాక్టు, తద్వారా బాలల సంక్షేమ బోర్డులు అమలులోకి వచ్చాయి. 1986లో ద జువైనల్ జస్టిస్ చట్టం, 2000లో దీనికి సవరణ చట్టం అమలులోకి వచ్చాయి. తద్వారా బాలలకు ప్రత్యేక హక్కులు సంతరించాయి. ఈ హక్కులు వారి వికాసానికి , విజ్ఞానానికి, విద్యాభ్యాసానికి దోహదపడాలి.
బ్రిటిష్ పాలనలోనూ దేశవ్యాప్తంగా బాల్యవివాహాలకు సంబంధించి కఠినమైన చట్టాలు అమలులో ఉండటంతో బాల్య వివాహాలు చేయాలనుకున్న వారంతా యానాం వెళ్లి అక్కడ ఆ కార్యక్రమం పూర్తి చేసేవారు. తర్వాత కొంతకాలానికి యానాం భారత్‌లో విలీనమైంది. ఫలితంగా బ్రిటిష్ చట్టాలు అమలులోకి వచ్చాయి. నిజానికి చాలా కాలం పాటు మైనర్, మేజర్ అనేదానికి స్పష్టత లేదు. 1860లో వివాహానికి 10 ఏళ్ల వయస్సు చాలు, 1891లో దానిని 12 ఏళ్లకు పెంచారు. 1925లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత 14 ఏళ్లకు వివాహ వయస్సు పెంచారు. అదే నిబంధన 1929లో చేసిన బాల్య వివాహాల నియంత్రణ చట్టంలోనూ చేర్చారు. ఐపీసీ, పీసీఎంఏ చట్టాల్లో నిబంధనల్లో వ్యత్యాసాలు పొడసూపడంతో 1949లో వివాహ కనిష్ట వయస్సు 15 ఏళ్లయింది. స్వాతంత్య్రానంతరం 1955 నాటికి భారతీయ చట్టాల ప్రకారం అమ్మాయిలకు 15 ఏళ్లు, అబ్బాయిలకు 18ఏళ్లుగా వివాహ వయస్సు నిర్ణయించారు. 1982లో వధువుకు 16 ఏళ్లు అని పెంచి, దానిని 2013లో తిరిగి 18 ఏళ్లుగా ఖరారు చేశారు.
2012 నాటి పోస్కో చట్టం ప్రకారం 18ఏళ్లలోపు ఆడపిల్లను బాలికగా నిర్వచించారు. దేశంలో వధూవరుల వివాహ వయస్సును 21 ఏళ్లకు ఎందుకు మార్చరాదనే వాదన మొదలైంది. కొంత మంది దానిని 18 ఏళ్లకు తగ్గించాలని, మరికొంత మంది 25 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. వోటు వేసుకునే హక్కు, ఉద్యోగం చేసుకునే హక్కు 18 ఏళ్లకే కల్పిస్తున్నపుడు వివాహం చేసుకునే హక్కు ఇరువురికీ 18 ఏళ్లకే ఎందుకు ఉండరాదనే వాదన ఉంది. సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో 18ఏళ్లలోపు భార్యతో సంగమం సైతం అత్యాచారం కిందకే వస్తుందని చెప్పడం ద్వారా అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని తేల్చి చెప్పింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులోనూ, ప్రవాసి భలై సంఘటన్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జీజా ఘోష్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనూ, జోసఫ్ షైనీ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనూ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి చాలా స్పష్టమైన వివరణలను సుప్రీం నిర్వచించింది. వివాహం అనేది సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కుల హక్కులు, బాధ్యతలను స్థాపించే సంప్రదాయం, సాంస్కృతిక పరమైన సార్వజనీన కార్యం, చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం ఆయా సంస్కృతుల ఆధారంగా మారిపోతోంది. వ్యక్తుల మధ్య సంబంధాల్లో సన్నిహితంగా మెలగడం, లైంగిక సంబంధాలను సంతరించుకునే వ్యవస్థ వివాహం. వివాహం అనేది క్రీస్తుపూర్వం 1250 నుండి అమలులో ఉన్నదే. ఇన్నాళ్లకు వివాహ వయస్సుపై జరుగుతున్న చర్చకు లా కమిషన్, సర్వోన్నత న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం చెబుతాయో వేచి చూడాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090