మెయిన్ ఫీచర్

బుజ్జాయి బొజ్జ నిండుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసి పిల్లలకు అన్నం ముట్టించిన తరువాత వారికి

ఎలాంటి ఆహారం పెడితే తింటారోనని ప్రతి తల్లికి

నిత్యం దిగులే. పళ్లు రావు. మెత్తగా, జావ వలే నోట్లో

పెడితే జారిపోయోలా ఉండే ఆహారాన్ని తయారుచేసి

పెట్టాలి. వారికి త్వరగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి.

రవ్వతో మెత్తగా చేసిన పదార్థాలను ఎక్కువ మంది

తల్లిలు పెడుతుంటారు. దీంతో పాటు సగ్గుబియ్యంతో

చేసిన ఆహార పదార్థాలను పెడితే పసి పిల్లలకు

త్వరగా జీర్ణమవుతుందని న్యూట్రీషియన్లు

చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు,

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయని,

త్వరగా జీర్ణమవుతుందని న్యూఢిల్లీకి చెందిన శ్రీ

బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు

ప్రియా బర్మా అంటున్నారు. పిల్లల ఎదుగుదలకు

అవసరమైన ఐరన్ కూడా ఇందులో

లభ్యమవుతుంది. పిల్లల్లో ఎముకల పటుత్వానికి

అవసరమైన ఆహారపదార్థాలతో పాటు అదనపు

ఆహార పదార్థంగా సగ్గుబియ్యంతో చేసినవి పెడితే

మంచిదని వారు సూచిస్తున్నారు.
త్వరగా జీర్ణమవుతుంది : పిల్లలకు రుచిగా ఉందని

ఏది పడితే అది పెడితే త్వరగా జీర్ణమవ్వదు. వారు

నోరు తెరిచి చెప్పలేరు. ఎందు కు ఏడుస్తున్నారో

అర్థకాదు. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం

కాకుండా ఉండేందుకు తేలికగా జీర్ణమయ్యే

సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలను వారి నోటికి

రుచిగా ఉండేలా తయారుచేసి పెడితే ఇష్టంగా

తింటారు.
కాల్షియం : కర్రపెండలం వేర్లు నుంచి తయారుచేసే

ఈ సగ్గుబియ్యం వల్ల పాలు లేని తల్లులకు వరంగా

పనిచేస్తుంది. పసి బిడ్డలకు ఎదుగుదలకు

అవసరమైన పోటాషియం, ఐరన్, కాల్షియం,

విటమిన్ కే ఉన్నాయి.
సంపూర్ణ శక్తి: రోజంతా ఎనర్జిటిక్‌గా పిల్లలు

ఆడుకోవాలంటే సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలే

మేలని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. బరువు

పెరుగుతారు. కర్రపెండలం వేర్లు బరువు

పెరుగుదలకు దోహదం చేస్తుంది. బరువుతోపాటు

ఎత్తు కూడా పెరగటానికి తోడ్పడుతుంది.
శరీరాన్ని చల్లగా: చిన్నారుల దేహాన్ని చల్లగా

ఉంచుతుంది. వేసవి కాలంలో పిల్లలకు పెడితే

శారీరక ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుందని

ఆయుర్వేద వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు.
అంతేకాదు కీళ్లు ఎదుగుదలకు, కణజాలం

సమర్థవంతంగా పనిచేయటానికి టానిక్ వలే

సహకరిస్తుంది. పిల్ల్లలకు సరిపడా పెడితే

కడుపునిండినట్లు ఉంటుంది. సగ్గు బియ్యంతో ఖీర్,

కిచిడిలాంటివి చేసి రుచిగా చేసి పెడితే పిల్లలు కూడా

ఇష్టంగా తింటారు.