మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋతుపర్ణుడికోసం అనేక విధాలైన భోజన పదార్థాలను తయారుచేస్తుంటాడు. బాహుకుడు కుండలవైపు చూడగానే అవన్నీ నీటితో నిండిపోతాయి. తరువాత అతడు ఆ నీటితో మాంసాన్ని కడుగుతాడు.
అతడు గడ్డితోకూడిన పిడికిలిని సూర్యునివైపు చూపి వీచితే అచట నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తయ్యేవరకు కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అట్లే మండుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపడ్డాను.
అతడి చేతుల రాపిడికి నలిగిపోయిన పువ్వుల గుత్తులు కందిపోయినప్పటికీ మునుపటి పరిమళాలనే వెదజల్లుతూనే ఉన్నాయి. మరింత వాసనలు సంతరించుకొన్నాయి. మరొక అద్భుతాన్ని చూచాను వినవమ్మా!
దమయంతీ! అతడు అగ్నిని తాకినప్పటికీ అది అతడిని దహించటం లేదు.
కోరగానే నీరు అతని చెంతకే వస్తుంది. అతడి తేజస్సు చాలా గొప్పది.
ఈ అద్భుతాలను చూచి అవి మీకు చెప్పటానికై ఇక్కడకు పరుగున వచ్చాను’’ అని నివేదించింది.
కేశిని చెప్పిన బాహుకుని అద్భుత విషయాలను విని ఆ బాహుకుడు తన భర్తగానే అనుమానించి విలపిస్తూ.
‘‘కేశినీ! నీవు మరొకసారి అక్కడికి వెళ్ళుము. పాకశాలలో బాహుకుడు వండిన మాంసాన్ని తెమ్ము’’అని చెప్పి మరలా పంపించింది దమయంతి.
కేశిని వెంటనే వెళ్ళి పాకశాలలో ఉడికి వేడిగానున్న మాంసాన్ని బాహుకుని ఎదుటనే తీసికొని దమయంతి దగ్గరకు వచ్చింది. దమయంతి చేతికిచ్చింది. ఇదివరలో అనేక పర్యాయాలు నలుడు వండిన మాంసాన్ని దమయంతి రుచి చూచినదేగదా! దమయంతి ఆ మాంసాన్ని రుచి చూచింది. బాహుకునిలో నలుని లక్షణాలుండటం గమనించింది. అంతటితో తృప్తిచెందక ఎంతో బాధపడుతూ వెళ్ళి ముఖాన్ని కడుక్కొన్నది. తన పుత్రుడైన ఇంద్రసేనుడిని, కుమార్తె అయిన ఇంద్రసేనను శీఘ్రంగా పిలిపించింది. కేశినితో పిల్లలను బాహుకుని వద్దకు పంపించింది.
తన వశం తప్పి కన్నీరు కారుతుండగా నలుడు కొడుకునూ, కూతురునీ వాత్సల్యంతో ఎత్తుకొన్నాడు. సంతోషంతో గగురుపాటు పొందిన తన ఒడులలో వారిని ఉంచుకొని ఆదరించాడు. చెప్పలేనంత దుఃఖం పొంగి కన్నుల వెంట పారింది. అంతలోనే ముఖ కవళికలను మార్చి కేశినిని చూచి
‘‘నా బిడ్డలు కూడా వీరివలెనే ఉండేవారు. ఆ కారణంచేతనే ఈ బిడ్డలను చూడగానే కన్నీరు పెట్టుకొన్నాను.
మేము ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాము. ఇక నీవు ఏ పనిమీదనైనా నావద్దకు రాకుము. నీవు ఇచటికి పలుమార్లు వస్తూపోతూ ఉంటే చూచేవారు మనసులో నన్ను వేరే విధంగా భావించవచ్చును సుమా! నీకు మాతో ఏమిపని? ఇక పొమ్ము!’’ అని బాహుకుడు
కసరుకొనగా కేశిని పిల్లలతో తిరిగివచ్చి జరిగిన సంగతి దమయంతికి వివరించింది. దమయంతి సంతోషించి తన తల్లివద్దకు వెళ్ళింది. నలుని చూడాలనే తపనతో తల్లితో
‘‘అమ్మా! బాహుకుడే నలుడై ఉంటాడనే అనుమానంతో అనేకవిధాల పరీక్షించాను. అయితే రూపాన్ని గురించే సందేహం కలుగుచున్నది. అయినా సందేహించవలసిన అగత్యంలేదు. సమస్త సద్గుణ సంపదలో పరిశీలించి చూస్తే బాహుకుడే తప్పనిసరిగా భూజనులచేత నమస్కారాలందుకొనే ‘నిషధేశ్వరుడైన నలుడే’ నా మనసు మిక్కిలి ఆనందంతో తన్మయమైంది. అయితే అతడు ఇక్కడికి రావడమా? నేనే అతడివద్దకు వెళ్ళడమా? సత్వరమే ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి సుమా? నేను స్వయంగా ఆ సందేహాన్ని తీర్చుకొనదలిచాను’’ అని అన్నది.
***
బాహుకుడే నలుడని నిర్ణయించటం అంత సులభంకాదు.
- ఇంకాఉంది