మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమయంతి చెప్పగానే విన్న తల్లి భీమరాజు అనుమతితో దమయంతి దగ్గరకే బాహుకుని రప్పించింది.
దమయంతిని చూడగానే నలునకు దుఃఖం శోకాలు ఆవరించాయి. కుల స్ర్తియైన దమయంతి అప్పుడు ఆ స్థితిలోఉన్న నలుని చూచి తీవ్రమైన శోకాన్ని పొందింది.
అచటికి చేరిన నలుడు ధైర్యం ఉట్టిపడే ముఖంగలదీ, ఎప్పుడూ దుమ్ముతో మాసి క్రుంగిన దేహం కలిగినదీ, జాలిగొలిపేదీ, చిక్కి కృశించినదీ, జారే కన్నీటి బొట్టులతోకూడిన మొగంకలదీ అయిన దమయంతిని చూచాడు.
నలుని దేహం వికారంగా కనిపించినప్పటికినీ, అతడిని వరుసగా ఎంచక స్నేహంతోనూ, సిగ్గుతోనూ, మిక్కుటమైన తత్తరపాటుతోనూ, తనను తాను అదుపులో పెట్టుకొనలేకుండా భర్త అనుకుంటున్న బాహుకునితో
‘‘బాహుకా! పూర్వం అడవిలో నిద్రిస్తున్న భార్యను విడిచి వెళ్ళిన ఒకానొక ధర్మజ్ఞుడైన పురుషుని నీవు చూచావా? ఏ తప్పూ చేయని భార్యను జనసంచారం లేని, మార్గయాసంతో ఒడలు తెలియక నిద్రించే సమయంలో, నలుడు తప్ప మరెవడైనా విడిచివెళ్ళగలడా? ఆ మహారాజుకు నేనేమైనా అపరాధం చేశానా? అరణ్యంలో నిద్రిస్తున్న నన్ను, బలహీనురాలను, సహధర్మచారిణిని, తనవెంట అడవికి వచ్చిన దానిని, సత్ప్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా పెండ్లియాడిని దానిని,విడిచిపెట్టి వెళ్ళడం తగునా? దేవతా శ్రేష్ఠులను విడిచిపెట్టి తననే భర్తగా ఎన్నుకొన్నానుగదా? అలాంటి నన్ను, సంతానవతియైన దానిని, శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు?’’ అని అన్నది దమయంతి.
అంతవరకు బాహుకుడే నలుడని దమయంతి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ప్రత్యక్షంగా ఇప్పుడు బాహుకుడిని చూచింది. ఇక తానే నలుడని ప్రకటించుకొనవలసిన వంతు బాహుకుడిదే.
‘‘నిన్ను నేను ఎన్నటికినీ విడిచిపెట్టజాలను. భయపడకుము’’ అని నాతో పలుమారులు చెప్పాడుకదా? ఆ మాటలు ఎట్లా మరచిపోయాడోగదా? అని దమయంతి కన్నీరుకారుస్తూ విలపించింది. ఆమె కార్చిన కన్నీరు స్తనాలపై ప్రవహించటం చూచిన నలుడు దమయంతితో
‘‘రాజ్యం పోయింది. నిన్ను విడచిపెట్టటం జరిగింది. ఈ సంఘటనలన్నీ నా స్వయంకృతంగావు! నన్ను ‘‘కలిపురుషుడు’ ఆవహించటం చేత ఆ విధంగా బుద్ధిచెడి అన్ని కష్టలపాలు కావలసి వచ్చింది.
కష్టంలో వనంలో ఉండి దుఃఖించే నన్ను గురించి రాత్రింబవళ్ళు ఆలోచించే నీవు ఆ ‘‘కలి’ని శపించావు. ఆ అగచాట్లు అన్నీ భరించాను. నీ శాపాగ్నిచేత దహింపబడుతూనే నా శరీరంలోచేరి, నా శరీరాన్నికూడా దహింపజేశాడు. కష్టాలన్నీ నా తపఃశక్తిచేతను, నీ పరితాపమనే నిప్పువలన తొలగిపోయాయి. ‘కలి పురుషుడు’ జయింపబడినాడు. మన దుఃఖానికి అంతం కలిగింది. ఇప్పుడు కలిపురుషుడు నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కలి ‘వెళ్ళిపోయిన తరువాతనే నేనిచటికి వచ్చింది. నీ విషయం తెలిసికొనటంకొరకే.
‘‘దమయంతీ నేను నీకొరకు వచ్చాను! మరొక ప్రయోజనం ఏమీలేదు! నేను నీకు కూర్చేవాడిని, సహధర్మచారివి, నన్ను విస్మరించి పరపురుష వాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచటం అంటే అది కులపాలికకు తగిన న్యాయంగాదు! ఏ స్ర్తిఅయినా సరే నీవలె మరొకని వరించునా? విదర్భ రాజశాసనంతో దూతలు భూమండలమంతా సంచరిస్తున్నారు. రాజులందరినీ ఆహ్వానించటం చేతనేకదా ఋతుపర్ణ మహారాజు దమయంతి స్వేచ్ఛగా అభిరుచిననుసరించి తగినవానిని ఎన్నుకొనబోతున్నదని ఇప్పుడు విదర్భకు విచ్చేసింది? అని నలుడు అధిక్షేపింపగా భయపడిన దమయంతి నలునికి అంజలి ఘటించి వణికిపోతూ
‘‘నిషధ రాజా! దేవతలనుకాదని నినే్న వరించానుకదా! దోషారోపణచేసి నన్ను అవమానించడం తగదు.

- ఇంకాఉంది