మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ రాకకోసమే నిన్ను వెదకటానికై ప్రీతితో అన్ని దిక్కులకూ బ్రాహ్మణులను పంపించడమూ, నా కథను ఎన్నోచోట్ల చెప్పించడమూ జరిగింది. ఆ బ్రాహ్మణులలో ‘పర్ణాదుడు’అనే బ్రాహ్మణ పండితుడు కోసల రాజ్యానికి వచ్చి ఋతుపర్ణ మహారాజును కలిశాడు. సభలో నా కథను వినిపించాడు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరంగా వచ్చిన మాటనుబట్టి నిన్ను గుర్తించాను. మిమ్ములను రక్షించుటకై నాకు తోచినదే ఈ ఊహ! ఈ ఉపాయం!
మహారాజా! ఆ పర్ణాదుడివలన నీ ఉనికి పట్టును తెలిసికొన్న దానినై నిన్ను ఇక్కడికి రప్పించే నెరవును ఆలోచించి రేపే దమయంతి రెండవ స్వయంవరమని ఒక్క ఋతుపర్ణుడికి మాత్రమే వార్తను తెలియజేయటానికి సుదేవుడు అనే బ్రాహ్మణుని నియమించాను?
‘‘రాజా! నీవు తప్ప మరొకరెవ్వరూ నూరుయోజనాల దూరం గుర్రాలతో ప్రయాణం చెయ్యగల సమర్ధుడులేడని ఆలోచించి, ఈ విధమైన నేర్పాటుచేశాను.
‘‘మహారాజా! మిమ్మును అగౌరవపరచాలనే భావం మనస్సులోగూడా లేదని మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. నాలో ఎటువంటి చెడుతలంపు ఉన్నట్లైతే ఈ సూర్యుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ చంద్రుడు, ఈ దిక్పాలకులు నన్ను ఈ క్షణంలోనే దహించేటట్లు చేయరా? నా మాటలు సత్యాలయితే ఆ దేవతలే చెప్తారు. లేదా విడిచిపెడతారు’’అని అన్నది.
ఈ విధంగా దమయంతి అనగానే సమస్త భూతాల లోపల ఉండే ‘వాయు భట్టారకుడు’ అందరూ వినేటట్లుగా ఆకాశంనుండి అన్నాడు.
‘‘నలమహారాజా! ఈ దమయంతి ఏ పాపమూ చేయలేదు. నీకు సత్యమే చెపుతున్నాను. రాజా! లోకవ్యాప్తమైన దమయంతి సౌశీల్యం సురక్షితంగా ఉంది. ఈమె పవిత్ర శిరోమణి. సూర్యుడు, చంద్రుడు నేను కలసికట్టుగా ఈమెను మూడు సంవత్సరాలు కాపాడాము. ఒకరోజు నూరు యోజనాలు పయనింపగలవాడు. నీవు తప్ప మరొకడు లేడని భావించి దమయంతి నిన్ను పిలిపించటానికి ఉపాయాన్ని ఆలోచించింది. రాజా! నీకు దమయంతి లభించింది. దమయంతికి నీవు లభించావు. ఈ విషయంలో నీవు ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవడం తగదు. భార్యతో కలిసి సుఖంగా చరించుము’’ అని అనగా పైనుండి పుష్ఫవర్షం కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. మంగళకరమైన వాయువు వీచింది.
ఆ అద్భుతాన్ని చూచిన నలుడు, దమయంతిపై ఉన్న అనుమానాన్ని విడిచాడు.
వెంటనే నలమహారాజు నూతన వస్త్రాన్ని కప్పుకొని నాగరాజైన కర్కోటకుడిని స్మరించాడు. దానితో నలుడు తన నిజరూపాన్ని పొందాడు.
నిజరూపం పొందిన తన భర్తను చూచి దమయంతి నలుని హృదయంమీద తన శిరస్సును ఉంచి గాఢాలింగనం చేసికొని బిగ్గరగా విలపించింది. అదే విధంగా మలినదేహంతో ఉన్నప్పటికీ, తెలినవ్వుల దమయంతిని నలుడు ఆలింగనం చేసికొని శోకంలో అలాగే నిలిచిపోయాడు.
దమయంతి తల్లి భీమరాజుకు నలదమయంతుల గురించి జరిగిందంతా ప్రీతితో వివరంగా చెప్పింది. మర్నాడు ఉదయం మంగళస్నానం ఆచరించి తేజస్సుతో ప్రకాశిస్తూ దమయంతీ సహితుడై సుఖంగాఉన్న నలమహారాజును చూస్తానని భీమరాజు అన్నాడు.
ఆరోజు రాత్రి నలదమయంతులిద్దరూ కలసి జరిగిపోయిన అరణ్యవాస విశేషాలన్నీ సంతోషంతో చెప్పుకొని కాలం గడిపారు.
***
నలదమయంతులకు తిరిగి సమాగమనం జరిగింది. ఇరువురికి విరహతాపం పోయింది. ఇరువురికి శరీరమాలిన్యం తొలిగిపోయింది. పరస్పరానురాగం ఏర్పడింది. ఆభరణ శోభలు, చందనాదులతో మైపూతలు ఇరువురికి సంక్రమించాయి. అజ్ఞాతవాసంలో ఉన్న తన భర్త తనకు లభించినందులకు దమయంతి మహదానంద పరవశురాలైంది.

- ఇంకాఉంది