మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునస్సమాగమం చెందిన నలదమంతులు చంద్రుడు రోహిణీ కలిసినట్లు ఉండటం చూచి తల్లిదండ్రులు, సఖులూ, అందరూ ఆనందాన్ని పొందారు.
భీమమహారాజు కుండిన నగరంలో అష్టశోభనాలు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశాడు.
దమయంతీ సహితుడై నలుడు తగిన సమయంలో భీమరాజును సందర్శించాడు. మామగారైన భీమరాజుకు నమస్కరించాడు. శుభలక్షణ అయిన దమయంతికూడా తన తండ్రిగారికి నమస్కరించింది. భీమరాజు అల్లుడైన నలుని అక్కున చేర్చుకొని పుత్ర సమానంగా సంతోషించి తగిన విధంగా గౌరవించి ఊరడించాడు. సత్కారాలను పొందిన నలుడు మామగారికి కృతజ్ఞతలు తెలిపాడు.
నగరమంతా హర్షధ్వానాలతో నిండింది. ప్రజలంతా నలమహారాజును చూచి సంతోషంతో జయజయధ్వానాలు చేశారు.
ఋతుపర్ణమహారాజు ‘బాహుకుడి’రూపంలో ఉన్నవాడు నలమహారాజేనని విన్నాడు. నలదమయంతుల సమాగమానికి ఋతుపర్ణుడు ఎంతగానో సంతోషించాడు. నలమహారాజును రావించి
‘‘నలమహారాజా! నీవు జగత్‌పూజ్యుడవు. అదృష్టంతో భార్యతో కలిశావు. నీవు నాదగ్గర బాహుకుడు అనే పేరుతో అజ్ఞాతవాసంలో ఉన్నావు. కావున నీవెవరివో తెలియక నిన్ను అల్పకార్యాలకు నియోగించాను.
‘‘నిషధరాజా! నేను బుద్ధిపూర్వకంగా గాని, తెలియకగాని ఏవయినా తగని పనులు చేసివుంటే వాటిని క్షమించుము.’’
అని ఋతుపర్ణుడు అనగా
‘రాజా! మీరు నాకు ఏ కొంచెం అపరాధాన్ని కూడా చేయలేదు. ఒకవేళ చేసి వున్నా నాకు కోపం లేదు. మహారాజా! చిరకాలం నుండి మీరు నాకు మిత్రులు. పైగా మనకు బంధుత్వంగూడా ఉన్నది. మీరు ఇకముందు కూడా మా ప్రేమను పొందదగినవారు. మీ గృహంలో ఉన్నప్పుడు నా కోరికలన్నీ తీరే అవకాశం కలిగింది. మీ గృహంలో జరిగినట్లుగా నా గృహంలో కూడా జరుగలేదేమో?
‘‘అశ్వహృదయమనే విజ్ఞాన సంపద నాదగ్గరే ఉన్నది. మీరు కోరినట్లయితే ఆ ‘అశ్వహృదయ విద్యను’ మీకు ఉపదేశించాలనుకొంటున్నాను’’అని నలుడు అన్నాడు.
తదుపరి నలమహారాజు తనవద్దనున్న అశ్వహృదయ విద్యను ఋతుపర్ణ మహారాజుకు ఉపదేశించాడు. దానిని ఋతుపర్ణుడు యధావిథిగా గ్రహించాడు. నలుడు ఋతుపర్ణ మహారాజును సగౌరవంగా సత్కరించాడు.
అనంతరం ఋతుపర్ణ మహారాజు మరొక సారథిని గైకొని విదర్భనుండి అయోధ్యా నగరానికి పయనమైవెళ్ళాడు.
ఋతుపర్ణుడు అయోధ్యకు పయనమై వెళ్ళిపోయిన తరువాత నల మహారాజు కుండిన నగరంలో ఒక మాసం నివసించి కాలం గడిపాడు. దమయంతిని అక్కడే ఉంచి తాను ఒక రథం, పదారు ఏనుగులు, ఏబది గుర్రాలు, ఆరువందల మంది కాలిభటులు తోడురాగా బయలుదేరి ‘నిషధ’ రాజధానికి వెళ్ళాడు. అతిశీఘ్రంగా నగరంలో ప్రవేశించాడు. వీరసేనుడి కుమారుడైన నలుడు పుష్కరుని చెంతకు వచ్చాడు.
‘‘పుష్కరా! నేను చాలా ధనాన్ని సంపాదించాను. దమయంతి కూడా ఉన్నది. నీకు జూదమాడటం ఇష్టమైతే నేను దమయంతిని ఫణంగాపెట్టి నీతో జూదమాడటానికి సిగ్గుపడదు. నీవు నీ రాజ్యాన్ని పందెంగావొడ్డి నాతో జూదమాడటానికి సిద్ధుడవుగమ్ము.!
రాజ్యాన్ని అనుభవించవలసినది వీరులే సుమా! అదే సుభాషితం అని విన్నావుగదా? కాబట్టి నీవూనేనూ రథాలను అధివసించి వ్యర్థంగాని పరాక్రమంతో గొప్ప వీరయుద్ధం సల్పుదాంరమ్ము. - ఇంకాఉంది