మెయిన్ ఫీచర్

మెరపు దాడులు కాదు మెడలు వంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తిలేని దైవభక్తి నిష్ఫలం!
దైవభక్తి లేని దేశభక్తి నిరర్థకం!!
దేశభక్తిగల దైవభక్తే పరమార్థకం!!
అని నినదిస్తున్న విశాఖపట్నం మహిళలు పాకిస్తాన్ దుశ్చర్యలపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రపంచ పటంలో ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారతదేశం లోకానికి అత్యద్భుతమైన యోగాను అందించి మానవాళి మనుగడకు ఇతోధికంగా సహాయం అందిస్తుంటే, పాకిస్తాన్ విషజీవులను పెంచి పోషిస్తోందని మండిపడుతున్నారు. తన ఇంటినే చక్కదిద్దుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్న ఆ దేశం, భారత గడ్డపై కాలుమోపేందుకు ఎంత ధైర్యం? అని కళ్ళెర్ర జేస్తున్నారు. ‘సర్జికల్’ దాడులంటూ గిల్లకుండా, అదను చూసి పాకిస్తాన్ గుండెల్లో గునపాలు దింపాల్సిందేనని గొంతెత్తుతున్నారు. పలువురు నారీమణులతో ‘ఆంధ్రభూమి’ పాత్రికేయులు కృష్ణమూర్తి జరిపిన అభిప్రాయ సేకరణ ఇది.

‘్భరతమాత’ను రక్షించుకోవాలి
మనదేశంపైకి పాకిస్తాన్ నిత్యం ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. దొంగ దెబ్బలతో మన జవాన్‌లను మట్టుబెడుతోంది. ఇటువంటి దుర్ఘటనలు కొనే్నళ్లుగా జరుగుతూ దేశానికి నష్టం సంభవిస్తున్నా గత పాలకులు సహించారు. అయితే ‘శాంతి.. శాంతి..’ అని అనేవాడు చేతకానివాడులా పాకిస్తాన్‌కి కనిపిస్తున్నాడు. అందుకే భారత్ దెబ్బ ఎలాంటిదో మరోసారి రుచి చూపాల్సిందే. శాంతిని విస్మరిస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియాలి. అంతర్జాతీయంగా ఆ దేశాన్ని అన్ని విధాలా ఏకాకి చేసి ఉక్కిరిబిక్కిరి చేయాలి.
- డాక్టర్ కె.వి.ఎల్.సంధ్యారాణి

ఇదే సరైన సమయం
ఉగ్రవాదంతో కోరలు చాస్తున్న పాకిస్తాన్ వెన్ను విరచాల్సిందే. ‘ఉగ్ర’ రూపాలను సృష్టిస్తూ ప్రజల ఉసురు తీస్తున్న పాకిస్తాన్‌కు దెబ్బకొట్టాలి. హింసతో పేట్రేగిపోతున్న ఆ దేశ పాలకులకు, వారి కనుసన్నల్లోని ముష్కరులకు గుణపాఠం చెప్పాల్సిందే. భారతదేశం అంటే ఏమిటో తెలియచేయాల్సిన అవసరం ఉంది. అందుకు మన పాలకులు పగడ్బందీ వ్యూహం రచించాలి.
- కె.మారుతి

నాటి చెంపదెబ్బలను గుర్తుచేయాలి
1965, 1971లో భారతదేశం చేత చెంపదెబ్బలు తిని ప్రపంచ వ్యాప్తంగా సిగ్గుమాలిన దేశంగా ముద్రపడిన పాకిస్తాన్‌కు ఆ సంఘటనలను మరోసారి గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. చెంపదెబ్బలు కాకుండా ఆ దేశంలో ఉగ్రవాదులను ఏరిపారేయాలి.నడ్డివిరిచేసే విధంగా సైనిక చర్యకు ఉపక్రమించాలి. అపుడే మన సత్తా తెలుస్తుంది. లోకమంతటా హర్షధ్వానాలు మారుమోగుతాయి.
- జి.దుర్గ

ఆక్రమిత కాశ్మీర్ మనపరం కావాలి
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను మనపరం చేసుకోవాలి. ఈ భూభాగం నిజానికి ఎవ్వరిదో, ఎవరు ఆక్రమించుకున్నారో అంతర్జాతీయ వేదికకు తెలియంది కాదు. ముష్కరులకు అండదండలు అందజేస్తూ భారత్ వంటి దేశాలపై దాడు లు చేయిస్తోందన్న సంగతీ తెలియంది కాదు. దేశంలో రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా, దేశంమీదకు దండెత్తుతున్న పాకిస్తాన్ ను మట్టికరిపించాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా అందరిపై ఉంది.కలిసికట్టుగా పాకిస్తాన్‌పై సమర శంఖం పూరించాలి. కార్గిల్‌లా విజయబావుటా ఎగురవేయాలి. - టి.లక్ష్మి

‘సర్జికల్’ మంచిదే.. కానీ..
కొనే్నళ్లుగా మనపై బుసకొడుతున్న పాకిస్తాన్‌కు సర్జికల్ షాక్ ఇవ్వడం ఆనందాన్నిచ్చింది. కానీ, ఈ ట్రీట్‌మెంట్ ఆ దేశానికి సరిపోదు. నిలువెల్లా ఉగ్రరక్తంతో ఉడుకుతున్న ఆ దేశానికి యుద్ధం అనే ఆయుధంతో చికిత్స చేస్తే లోకానికి మేలు కలుగుతుంది.
- కె.జయశ్రీ

పాక్‌వల్ల నష్టపోయాం
దినదిన ప్రవర్థమానవవుతు న్న భారతదేశంపై మ్కురులతో కాలు దు వ్వుతున్న పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ అంటే వెన్నులో వణుకుపుట్టా లి. ఇప్పటికే పాకిస్తాన్‌వల్ల జరిగిన నష్టానికి దేశంలో ప్రతిఒక్కరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
- ఎం.రూప

దెబ్బకు దెబ్బ తీయాల్సిందే..
మనదేశాన్ని పాకిస్తాన్ దాడులనుంచి రక్షించుకోవడానికి యుద్ధం అవసరమే. ఆంగ్లేయుల పాలనలో ఉన్న దేశాన్ని తిరుగుబాటుతో స్వాతంత్య్రాన్ని సాధించలేదా? ఎంతోమంది అమరులు కాలేదా? ఇప్పుడూ అంతే.. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాల్సిందే. అగ్రరాజ్యాలకు భయపడి ఎన్నాళ్లిలా పిరికివారిగా ఉంటాం. ఇప్పటికే ఎందరో భారతదేశ పౌరులు ముష్కరుల ఘాతుకాలకు ప్రాణాలు వొదిలారు. వారి కుటుంబాలకు గుండెకోత మిగిలింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. - డి.్భను

వెన్నులో వణుకు పుట్టించాలి
పాకిస్తాన్‌ది దుష్టబుద్ధి. దుష్టశిక్షణ తక్షణ అవసరం. కాశ్మీర్ బూచిని చూపిస్తూ కుక్కలా మొరుగుతోంది. భారత్‌పై దొంగదెబ్బ కొడుతోంది. ఇక సహించే శక్తి భారతమాతకు లేదన్న సంగతి పాకిస్తాన్‌కు తెలపాలి. అందు కు అవసరమైన సైనిక చర్యను చేపట్టాలి. లేనిపక్షంలో ముప్పు తప్పదు. జైహింద్!
- వి.సుప్రియ

సత్తా చాటాల్సిందే
పాకిస్తాన్‌కు మనం స్నేహహస్తం చూపిస్తుంటే, వారు మనకు ఉగ్రవాదాన్ని కానుకగా ఇస్తున్నారు. ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. సిమ్లా ఒప్పందం ప్రకారం సరిహద్దు రేఖ వివాదం శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని ఐరాస వంటి సంస్థలు చెబుతున్నా పాకిస్తాన్ పెడచెవిన పెడుతోంది. ‘సర్జికల్’ దాడులు పెంచి, పూర్తిస్థాయిలో మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. మనమూ దెబ్బకొట్టడమే మేలు.
- ఆర్.అరుణ