మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధంలో గెలిచినవాడే ఈ సమస్త భూమండలాన్ని వీరపురుషుడిగా ఏలుకొంటాడు.
పుష్కరా! నీవు పాచికలతో జూదానికిగానీ, ధనుస్సును వంచి యుద్ధానికి గానీ, సిద్ధపడుము’’ అని అన్నాడు.
లోగడ పుష్కరుడు నలుని చేతిలో యుద్ధంలో ఓడిపోయాడు. అయితే జూదంలోమాత్రం నలుని ఓడించాడు పుష్కరుడు. అందుచేత పుష్కరుడికి నలుడితో జూదమాడి దమయంతిని గెలుచుకోవాలని ఆశ అంకురించింది. అందువల్ల
‘‘నైషధా! మళ్ళీ పందెం వేయటానికి తగిన ధనం సంపాదించావు... అది నీ అదృష్టం. ఆ అదృష్టం కారణంతోనే దమయంతి కష్టాలు తీరిపోయాయి.
నలమహారాజా! నీ అదృష్టంకొద్ది దమయంతితో కలిసి బ్రతుకుతున్నావు! నీ ధనాన్నంతా నేనే గెలిస్తే దమయంతి అలంకరించుకొని, స్వర్గంలో అప్సరసలు ఇంద్రుని సేవించినట్లుగా దమయంతి నన్ను సేవిస్తుంది. ప్రతి దినం నిన్ను తలచుకొంటూ నీకై ఎదురుచూస్తున్నాను. శత్రువులతో జూదమాడితే నాకు తృప్తికలగటం లేదు. ఇపుడు నేను నిన్ను జయించి దమయంతిని స్వీకరిస్తాను. సర్వదా ఆమె నాయొక్క హృదయమందున్నది. ఆమెయే నాకు దక్కితే నా అంత అదృష్టవంతుడు మరొకుండడు’’ అని అన్నాడు పుష్కరుడు.
అసత్య ప్రలాపాలు విన్న నలునకు అతడి శిరస్సు నరికివేయాలన్నంత కోపం వచ్చింది. కోపంతో కనులు ఎర్రబడ్డాయి. పుష్కరుని చూచి
‘‘పుష్కరా! ఏమి మాట్లాడుచున్నావు? ఓడిపోయిన తరువాత నీవు మాట్లాడలేవు. రమ్ము జూదాన్ని మొదలుపెడదాము! నీ ప్రగల్భాలేమిటో తెలియనగును’’అని జవాబిచ్చాడు నలుడు.
జూదం ప్రారంభమైంది. మొదటి పందెంలోనే వీరుడైన నలునిచే పుష్కరుడు పరాజయం పొందాడు. కోపంతో పుష్కరుడు తన సమస్త రత్నధనాగారాలతోసహా ప్రాణాన్ని సయితం పందెంగా పెట్టాడు. అయితే పరాభవం తప్పలేదు. పుష్కరుడు సమస్తం ఓడిపోయాడు. విజయం నలుని వరించింది. పుష్కరుని జయించిన నలమహారాజు పరిహాసంతో పుష్కరుడిని చూచి
‘‘పుష్కరా! నిష్కంటకమైన ఈ రాజ్యమంతా నాది. నీవిక దమయంతిని చూడలేవు. మూఢుడా! సపరివారంగా నీవిపుడు దమయంతికి దాసుడవయ్యావు! పూర్వం నీవు నన్ను జయించావన్నది నీ పని కాదు.
‘‘మూర్ఖుడా! మునుపు నేను’’ కలిచేత ఆవహింపబడినవాడనై బలం నశించి, నీచేత బలవంతపుజూదంలో ఓడిపోయాను. అటువంటి నా ఓటమి నీ బలంచేత లభించిన విజయంగా భావించి విర్రవీగావు. బలవంతుడిని అనుకొని విర్రవీగవద్దు.
‘‘పుష్కరా! ఇతరులు చేసిన తప్పును నేను నీపై వేయను. నీవు నా పినతండ్రి కుమారుడవు. కావున నీకు ఎటువంటి కీడును నేను చేయలేను. నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. సుఖంగా జీవించుము.
నా సంపదలో నీకుగూడా కొంత భాగం ఇస్తున్నాను. నీపై నాకు ప్రేమ ఉన్నది. ఈ విషయంలో ఏమాత్రం సందేహంలేదు. నేను సహృదయం గలవాడను. కావున నిన్ను ఎప్పుడూ పరిహసించను’’అని అన్నాడు.
ఆ విధంగా నలమహారాజు సోదరుడైన పుష్కరుని అనునయించి, అనేక పర్యాయాలు ఆలింగనం చేసికొని, తన పురానికి పంపాడు. పుష్కరుడు పుణ్యశ్లోకుడైన నలచక్రవర్తికి నమస్కరించి
‘‘మహారాజా! నాకు ప్రాణదానంచేసి, నిలువ నీడ చూపిన నీవు తరుగని సత్కీర్తితో నూరేండ్లు సుఖసంతోషాలతో జీవించుము. గతాన్ని ఒక కలగా భావించుము’’ అని వినయంతో పలికాడు.
- ఇంకాఉంది