మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనిలో వైరుధ్యం ఏమి వుందంటారా?
కలియుగం ఇంకా ప్రవేశించనే ప్రవేశించక ముందు, ఒక మహర్షి వచ్చి ధర్మరాజుకు ఈ కథ చెప్పవలసిన పని ఏమివచ్చింది? అందుకే ఇది వైరుధ్యం అంటున్నాను. దీన్ని తరువాత పరిశీలిద్దాం.
ఈ కథకు నాయికానాయకులు దమయంతీ నలులు. ప్రతినాయకుడు (విలన్) కలిపురుషుడు. నలుడికి కొద్దిగా సహాయం చేసినవాడు కర్కోటకుడనే నాగుడు. ఆ నలుడికే కొద్దిరోజులపాటు ఆశ్రయమిచ్చినవాడు ఋతుపర్ణ మహారాజు. వీరిలో అత్యంత ప్రధానులైన నలదమయంతుల్ని త్రోసిరాజని, కర్కోటకుడికి కలి సంహారకులలో ప్రథమస్థానం ఇవ్వటమేమిటి? పైగా, కర్కోటకుడనే పేరే క్రూరత్వానికి ప్రతినిధి. అదీగాక, శ్రీమద్భాగవతంలో కలిపురుషుడికి సహాయం చేసింది ఇతడే. ఇలాంటి వాణ్ణి ‘‘కలిసంహారకుడు’’ అనవచ్చునా? అందులోనూ ప్రథమస్థానం ఇవ్వవచ్చునా? ఇదొక వైరుధ్యం!
ఇక కథలో ఎంతమాత్రమూ ప్రాధాన్యం కనుపించనివాడు ఋతుపర్ణ మహారాజు. ఈ విషయం అర్థంకావాలంటే రేఖామాత్రంగానైనా నలకథను చెప్పుకోక తప్పదు.
కథాసంగ్రహం:
నలుడు నిషధ దేశపురాజు. ఇతడు వీరుడు, ధర్మాత్ముడు, అశ్వహృదయ విద్యావేత్త. కానీ జూదమంటే వ్యసనం అధికం. ఇతనికి అనుకోకుండా ఒక దేవలోక హంసతో స్నేహం కుదిరింది. ఆ హంస ఇతనికి ‘‘దమయంతి’’ అనే సుందరాంగి గురించి పరిచయం చేసింది.
దమయంతి విదర్భ రాజపుత్రి. ఈమె తండ్రియైన భీమమహారాజు ఈమెకోసం స్వయంవరం ఏర్పాటుచేశాడు. దాని కోసమై నలచక్రవర్తి వెళుతూ వుండగా, దారిలో ఇంద్రాది దిక్పాలక దేవతలు కనిపించి, ‘‘మేముగూడా దమయంతీ స్వయంవరానికే వెళుతున్నాము. మేము నీకు ‘‘తిరస్కరణి’’అనే రహస్య విద్యను ఉపదేశిస్తాము. దీనివల్ల నువ్వు ఇతరులకు కనపడకుండా ఎక్కడికైనా పోగలుగుతావు. దీని సహాయంతో నువ్వు దమయంతి అంతఃపురంలోకి వెళ్ళి, ఆమెతో మాట్లాడి, స్వయంవర సమయంలో ఆమె మాలో ఒకరిని వరించేటట్లుగా ఒప్పించు’’ అని ఆజ్ఞాపించారు.
నలుడు తన గోడు చెప్పుకున్నా దేవతలు వినలేదు. నలుడు వారి ఆజ్ఞను తిరస్కరించలేక, వారు చెప్పినట్లే చేశాడు గానీ, దమయంతి మాత్రం ‘‘నాకు దేవహంస చెప్పింది. నేను నలుడ్ణే వరిస్తాను’’అని ఖరాఖండీగా చెప్పేసింది. నలుడు వచ్చి దేవతలకు ఆ విషయం చెప్పాడు.
స్వయంవరం ప్రారంభమైంది. ఆ సభలో అసలు నలుడితోపాటు మరో నలుగురు నలచక్రవర్తులు కనిపించారు. ఇది దేవతల మాయేనని గుర్తించిన దమయంతి దేవతలను ప్రార్థించగా, వారు ప్రసన్నులై తమ నిజ రూపాలను ధరించి, నలదమయంతుల్ని ఆశీర్వదించి, వెళ్ళిపోయారు.
వారు స్వర్గలోకాన్ని సమీపిస్తూ వుండగా, కలిపురుషుడు ఎదురు పడ్డాడు. ‘‘ఎక్కడికి వెళుతున్నావయ్యా?’’అంటే ‘‘దమయంతీ స్వయంవరానికి’’అన్నాడు. అప్పుడు దేవతలు నవ్వి ‘‘ఆ వివాహం జరిపించి, ఆశీర్వదించి, వస్తున్నామయ్యా’’అన్నారు. దానికి కలిపురుషుడు మండిపడి, ‘‘ఆ నలదమయంతుల్ని విడదీస్తాను, నలుడ్ణి భ్రష్టుపట్టిస్తాను’’అని పలికాడు.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి