మెయన్ ఫీచర్

‘విలీనం’తో ఆర్థిక స్వస్థత సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత 70 ఏళ్ళలో దేశం ఎదుర్కొనని విధంగా నేడు ఆర్థిక వృద్ధి మందగిస్తున్నట్లు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఆ మధ్య ఒక సంద ర్భంలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, ఆరేళ్లలో కనిష్టానికి - 5 శాతానికి జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. దేశం 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటి నుండి అత్యంత కీల కమైన ఆర్థిక సూచికలు నిరాశ కలిగిస్తున్నాయి. ప్రధాని పేర్కొన్న లక్ష్యం వైపు చేరుకోవాలంటే రెండంకెల వృద్ధి రేటు సత్వరం సాధించవలసిందే. అయితే ఆ దిశగా ఆర్థిక పరిణామాలు కనిపించడం లేదు. దేశంలో ద్రవ్యం అం దుబాటులో ఉండటం లేదు. అందుకు ప్రధాన కారణం కొనుగోలు శక్తి సన్నగిల్లడమే. ఉత్పాదక రంగాలకు పె ట్టుబడులు లభించడం లేదు. అందుకనే ప్రభుత్వం దృష్టి ప్రధానంగా బ్యాంకుల వైపు, మరోవంక కార్పొరేట్ సంస్థల వైపు మళ్లింది. బ్యాంకులకు లక్ష కోట్ల మేరకు నిధులు సమకూర్చడంతో పాటు, కార్పొరేట్ సంస్థలను ప్రసన్నం చేసుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను సడలింపులు ప్రకటించారు. మరోవంక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రమాదాల అంచున ఉన్నాయి. వాటిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ఓ వైపు నిధులను సమకూర్చడంతో పాటు, మరోవంక బ్యాంకుల విలీనాన్ని చేబడుతోంది. బ్యాంకులను వేధిస్తున్న మొండి బకాయిలకు బదులు ప్రభుత్వం నిధులు సమకూర్చడం పరిష్కారం కాబోదు. బ్యాంకులలో జవాబుదారీతనం కోసం ఎటువంటి ప్రయత్నం జరగడం లేదు. భారీగా రుణాలను ఎగ్గొట్టిన వారిని చట్టం ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, అవకతవకల్లో భాగస్వామ్యం వహించిన బ్యాంకు ఉన్నతాధికారులపై చర్యకు మాత్రం ప్రభుత్వం సాహసించడం లేదు. ఉదాహరణకు లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం- అధికారుల అభ్యంతరాలను తోసివేసి రుణాలను మంజూ రు చేసిన స్టేట్ బ్యాంకులోని ఉన్నతాధికారిపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. కనీసం సీబీఐ విచారించిన దాఖలాలు లేవు. పైగా, మాల్యాకు రాజ కీయంగా సహాయ సహకారాలు లభించాయి. ప్రభుత్వం ఈ రాజకీయ కోణాన్ని పట్టించుకోవడం లేదు.
బ్యాంకులకు సుమారు రూ. 10 లక్షల కోట్ల మేరకు మొండి బకాయిలు ఉన్నట్లు చెబుతున్నా ఆర్థిక మంత్రి మాత్రం రూ 7.9 లక్షల కోట్లు మాత్రమే అని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులకు ప్రభుత్వం లక్ష కోట్లను సమకూర్చడం గమనార్హం. దివా లాస్థితిలో ఉన్న బ్యాంకులను ఆదుకోవడానికి- ద్రవ్య లోటును నింపుకోవాలని రిజర్వు బ్యాంకు రిజర్వు నిధులపై ప్రభుత్వం కన్ను వేసింది. ప్రభుత్వం వౌలిక సమస్యలను వదలివేసి తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నం చేస్తున్నందున ఆర్థిక వృద్ధి అదుపు తప్పుతున్నట్లు గమనించాలి. ఉదాహరణకు సరళీకృత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పరిపాలనవైపు దృష్టి సారించాలి. కానీ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పాలనా బాధ్యతలు చేపట్టి చేతులు కాల్చుకొంటున్నది. బ్యాంకుల పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోమని అంటూ గత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. అయితే, పాలనతీరు తెన్నులు సమర్ధవంతంగా ఉండటం లేదు. కీలక స్థాయిలలో రాజకీయ జోక్యాలు వాటి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజాగా 10 బ్యాంకుల విలీనంపై ఉపక్రమించిన ప్రభుత్వం విలీనం కారణంగా వాటి పాలనా సామర్థ్యం మెరుగవుతందని, వాటి మొండి బకాయిలు తగ్గిపోతాయని ఎలాంటి భరోసా ఇవ్వలేక పోతున్నది.
భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను భారత్ ఒక వరంగా భావిస్తుంది. దేశంలో ప్రతి బ్యాంకు ఆవిర్భావం వెనుక స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంది. బ్యాంకుల జాతీయకరణ పేరుతో వాటి యాజమాన్యాలను ప్రభుత్వం కైవసం చేసుకున్న తర్వాత అవి వౌలిక లక్ష్యాలకు దూరమవుతూ వస్తున్నాయి. ఆర్థికంగా చితికి పోతు న్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులలో తలెత్తుతున్న పలు పాలనా రుగ్మతలు ప్రైవేట్ బ్యాంకులలో లేకపోవడం గమనార్హం. బ్యాంకింగ్ నుండి ప్రభుత్వం వైదొలిగి, బ్యాంకుల నియంత్రణపై దృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక సంస్కరణలు అని చెప్పుకొంటున్నా కీలక రంగాలపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడాని ప్రభు త్వంలోని కీలక వర్గాలు సిద్ధపడడం లేదు. అందుకనే ఉదాత్త ఆశయాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘్భరత్‌లో తయారీ’ వంటి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో నిపుణత లేని అధికారులు, రాజకీయ నాయకులు పెత్తనం చేస్తున్నంత కాలం ప్రభుత్వ బ్యాంకులు గాని, ప్రభుత్వ రంగ సంస్థలు గాని దేశానికి మేలు చేకూర్చలేవు. ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు నాలుగోవంతు సంస్థలు అసలు పనిచేసే స్థితిలో లేవు. వాటి నిర్వహణ ప్రభుత్వానికి తలకు మించి భారంగా మారుతున్నది.
జవాబుదారీతనం, బాధ్యత లేని రాజకీయ నాయకులు, ఉన్నత అధికారుల ప్రమేయం లేకుండా విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, మేహూల్ చోక్సి వంటి వారు బ్యాంకులను ఘరానాగా మోసం చేసి దేశం వదిలి పారిపోయే ప్రయత్నం చేసేవారా? ఇటువంటి భారీ ఆర్థిక నేరాలు ప్రైవేట్ బ్యాంకులలో అంతగా జరగడం లేదే? మోదీ ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్ర మణియన్, రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ఆచార్య వంటి వారు ప్రభుత్వరంగ బ్యాంకులను క్రమంగా ప్రైవేట్ పరం చెయడమే మార్గంగా స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 50 శాతం దిగువకు తీసుకు వస్తే, బ్యాంకింగ్ రంగం ఎదు ర్కొంటున్న అనేక రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని యాక్సిస్ బ్యాంకు మాజీ చైర్మన్ పీజే నాయక్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఎదురయ్యే వత్తిడుల నుండి వాటికి విముక్తి లభిస్తుందని తెలిపారు. ఆ విధంగా చేయడం ద్వారా బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతూనే వాటి రోజువారీ వ్యవహా రాలలో మితిమీరిన జోక్యానికి ఆస్కారం లేకుండా చేయవచ్చు. 1998లో ఎం. నరసింహన్ అధ్యక్షతన రిజర్వు బ్యాంకు ఏర్పర్చిన కమిటీ సహితం ఇటువంటి సిఫార్సు చేసింది. అయితే నిపుణుల అభిప్రాయాలను కాకుండా ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలకు పాలకులు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న బ్యాంకుల విలీన ప్రక్రియలో ఎటువంటి పార దర్శకత, జవాబుదారీతనం కనిపించడం లేదు. తీవ్రమైన యజ మాన్య సంబంధ అక్రమాలకు పేరొందిన బ్యాంకులను వదిలి వేసి, సమర్థవంతంగా నడుస్తున్న బ్యాంకుల ఉనికిని ప్రశ్నించే రీతిలో విలీనం జరుగుతున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రా బ్యాంక్ విలీనం అని చెప్పవచ్చు. గతంలో జరిపిన బ్యాంకుల విలీనం కారణంగా వాటి యాజమాన్యంలో గుణాత్మకమైన మార్పులు ఏమైనా జరిగాయా? ఈ విషయమై లోతైన అధ్యయనం జరుపకుండా మెగా బ్యాంకులను సృష్టించే దిశలో పయనించడం ప్రమాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.
బ్యాంకుల విలీన ప్రక్రియకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత అనుభవాల్ని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్‌ఎస్) విమర్శించింది. ఎలాంటి అధ్యయనం లేకుండానే బ్యాం కుల విలీన ప్రణాళిక చేపట్టారని, ఇది కార్పొరేట్లకు మాత్రమే ఉప యోగపడుతుందని బీఎమ్‌ఎస్ నిప్పులు చెరిగింది. ‘బ్యాంకుల విలీనంపై సరైన అధ్యయనం జరగలేదు. గతంలోని తప్పుడు అనుభవాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని అర్థమవుతోంది. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు, ఉపసంహరణ లాంటివి ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడే చర్యలు మినహాయిస్తే సాధారణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు’- అని బీఎంఎస్ అధ్యక్షుడు సాజి నారాయణన్ తీవ్రంగా విమర్శించారు.
ఆర్థిక వృద్ధి కుదేలు కావడానికి- ముందస్తు కసరత్తు లేకుండా జరిపిన నోట్ల రద్దు, తగిన ప్రణాళిక లేకుండా అమలులోకి తెచ్చిన జీఎస్టీ విధానాన్ని ప్రధాన కా రణాలుగా కొందరు చూపుతున్నారు. బ్యాంకుల అస మర్ధతను విలీనంతో కప్పిపుచ్చే ప్రయత్నాలు సహితం విషమ ఫలితాలకు దారితీసే అవకాశం ఉందని గ్రహించాలి. బ్యాంకుల పాలక వర్గాలను ప్రభుత్వం నియ మిస్తున్నంతకాలం, వాటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నంతకాలం, రిజర్వు బ్యాంకు స్వ తంత్రంగా వ్యవహరించలేనంత కాలం బ్యాంకుల పనితీరును గాడిలో పెట్టడం సాధ్యం కాబోదు. ఆ దిశగా నిర్దిష్టంగా ఎటువంటి చర్యలు కనబడటం లేదు.
బ్యాంకుల జాతీయకరణకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ చెప్పిన ప్రధాన కారణం కార్పొరేట్ రంగానికి, భారీ పరిశ్రమలకు మాత్రమే కాకుండా ప్రాధాన్యత రంగాలకు - వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, చేతి వృత్తులు వంటి వాటికి రుణాలు లభించేటట్లు చేయడం. ఆ దిశగా కొద్దిమేరకు కృషి జరిగినా, క్రమంగా వివిధ సాకులతో ఆయా రంగాల నుండి బ్యాంకులు తప్పించుకొం టున్నాయి. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రైవేట్ రంగం వ్యవసాయమే. ఈ రంగంపైనే దేశంలో సగం జనాభా ఆధారపడి ఉంది. తగు పెట్టుబడులు లేక, తగిన ఆదాయం లేక రుణభారంతో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు వ్యవసాయ రంగంలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఆర్థిక సంస్కరణలు ఈ రంగాన్ని చేరుకోవడం లేదు. వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే దేశంలో ఇతర రంగాలు పుంజుకోగలవు. మూలసమస్యను పట్టిం చుకోకుండా బ్యాంకులకు, కార్పొరేట్‌లకు ప్రభుత్వం ఉదారంగా వరాలు ప్రకటించడం వల్ల వృద్ధిరేటు పుంజుకోదని గ్రహించాలి.

-చలసాని నరేంద్ర 98495 69050