మెయిన్ ఫీచర్

మత సామరస్యానికి ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహర్రం పండుగను ముస్లింలు, ముస్లిమేతరులు ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ముస్లింలకు ‘మొహర్రం’ సంవత్సర ఆరంభంలో మొదటి మాసం. ఇస్లామీయ క్యాలెండర్‌లో గల పనె్నండు మాసాలలో తొలిమాసంగా మొర్రంను పేర్కొంటారు.
మొహర్రం మాసానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళిన సందర్భాన (హిజ్)్ర అంటారు. నాటినుండి ఓ నవశకం ఆరంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలోనే ‘యామె ఆషురా’ కూడా వుంది. ఈ పండగ జరుపుకునేందుకు గల నేపథ్యంలో ఒక విషాద ఘటన జరిగింది. చరిత్ర ప్రకారం...
అదే కర్బలా మైదానంలో జరిగిన యుద్ధం. కర్బలా మైదానంలో ‘యజీద్’ రాజుకు ఇమామ్ హసన్ నడుమ జరిగిన ధర్మా ధర్మాల పోరాటంలో వారు అసువులుబాయటం వంటి అత్యంత విషాద ఘటనలు జరిగాయి. మొహర్రం అనగానే హసన్(ర) హుసేన్‌ల ప్రాణత్యాగాలు గుర్తుకు వస్తాయి. మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రియమైన మనమలు హసన్(ర) హుసేన్(ర)లు. ఆలీ (రజీ) తనయులు వారు. ఆలీ(రజీ) తరువాత ప్రజలు హజరత్ హసన్ (రజి)ని పరిపాలనాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కాని కొంతకాలానికి కొన్ని అనివార్య కారణాలవలన ఆయన స్వచ్ఛందంగా అధికారాన్ని వదులుకున్నారు. తరువాత ‘యజీద్’ తనను తాను రాజుగా ప్రకటించుకుని గద్దెనెక్కాడు. అతనిని ఎదిరించడానికి ఎవరూ సాహసించలేకపోయారు. కాని కొంతమంది ప్రజాస్వామ్య ప్రియులు ఈ బలవంతపు రాచరికాన్ని సహించలేకపోయి ఎదురుతిరిగారు.
ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత హజరత్ ఇమామె హుసేన్ (రజీ)పై పడింది. శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కార మార్గాలు సూచించాలన్న ఇమామె హుసేన్ (రజీ) ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారిపై హింసాకాండలు జరిగాయి. ‘కర్బలా’ అనే మైదానంలో ఇమామె హుసేన్ పరివారాన్ని యజీద్ సైన్యం అడ్డగించి కయ్యానికి కాలుదువ్వారు. ‘యజీద్’ను రాజుగా స్వీకరించి గుర్తించాలని బలవంతం చెయ్యసాగారు. కాని ఇమామె హుసేన్ అన్యాయానికి, దౌర్జన్యానికి తలవంచని- ప్రజాస్వామ్య పరిరక్షణే తన ధ్యేయమని తేల్చి చెప్పేశారు. ఆయన యుద్ధ సంకల్పంతో రాకపోవటంతో తగినంత బలగం లేకపోయింది. అయినా పోరు తప్పలేదు. కర్బలా మైదానం రక్తపుటేరులుతో ఎర్రబారింది. ఆయన అనుచరులందరూ శత్రుసైన్యం చేతుల్లో నేలకొరిగారు.
అయినా ఒక్కరే ఆ సైన్యంతో తలపడుతున్నారు. ఆ రోజు శుక్రవారం. మొహర్రం మాసం. నమాజు వేళ అయింది. యుద్ధం నియమం ప్రకారం నమాజు వేళ యుద్ధాన్ని ఆపాలి. కాని భీకర పోరాటం సాగుతోంది. నమాజు సమయం మించిపోతుండడంతో ఆయన యుద్ధ నియమ నిబంధనల ప్రకారం సైన్యాధ్యక్షుడి అనుమతితో ప్రార్థనలు చెయ్యసాగారు.
నమాజ్ పూర్తిచేసిన తరువాత ఆయన తిరిగి యుద్ధంలో పాల్గొంటే తమ అంతు చూస్తారని గ్రహించిన ఆ దుష్టులు నమాజ్‌లో ‘సిజ్దా’ చేస్తుండగా వెనుకబాటుగా వెళ్లి బరిసెలతో పొడిచి చంపేశారు. అలా దొంగ దెబ్బ తీసి ఇమామె హుసేన్ ప్రాణాలు తీశారు. తరువాత ఆనందంతో విజయోత్సవాలు జరుపుకున్నారు శతృవులు. ఇదీ క్లుప్తంగా చెప్పిన కథ.
ఆనాటి విషాదకరమైన సంఘటనను పురస్కరించుకొని ఈనాటికీ ‘షియా’ తెగకు చెందినవారు మొహర్రం ‘ఆషురా’ రోజున గుండెలు బాదుకుంటూ రక్తాన్ని చిమ్మిస్తూ తమ శోకాన్ని ప్రకటించుకుంటారు.
గ్రామీణ ప్రాంతాలలో పానకాలు తయారుచేసి పంచిపెడతారు. అన్నదానాలు చేస్తారు. అగ్నిగుండాలు తయారుచేసి అందులో భక్తిపారవశ్యంతో ప్రవేశిస్తుంటారు.
మొహర్రంను ‘పీర్ల పండగ’ అని కూడా అంటారు. నెల పొడువునా పెద్ద మొహర్రం - చిన్న మొహర్రం అని కూడా జరుపుకుంటారు. అనంతపురం జిల్లాలోని గూగూడులో వేలాదిమంది భక్తులు చేరి పెద్ద పెట్టున జరుపుకోవటం విశేషం. అక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తుంది.

-పి.షహనాజ్ 9849229786