మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నామంటే, నలుడు నిషధ దేశరాజు. ఈ రాజ్యానికి ప్రారంభకుడు నిషాదుడు. ఇతడు వేనచక్రవర్తి ఎడమ భుజంలోంచి జన్మించిన అల్పసారుడు- అని భాగవతం చెపుతోంది. దాన్నిబట్టి ఈ కాలనిర్ణయం చేయగలుగుతున్నాం.
కనుక, మనమిప్పుడు కృతయుగంనాటి నలచరిత్రలోని దేవరహస్యాలను తెలుసుకునే ప్రయత్నంచేయాలి. ఇందుకోసం మనకు తోచిన విధానాలను కాకుండా, వ్యాసమహర్షి సూచించిన విధానాలనే అనుసరించటం ఎక్కువ ఉపయోగకరం.
శ్రీమద్భాగవతంలో, పురంజనోపాఖ్యానం వంటి ఘట్టాలలో, పురాణ గాథల అంతరార్థాలను, చరిత్రాంశాలను, కథాసౌందర్యంకోసం జతచేసిన ఉపాంశాలను, గుర్తించే విధానాలను వ్యాస భగవానుడే స్వయంగా ఉపదేశించి వున్నాడు. ఆ సూచికలలో-ఉపక్రమోపసంహారాలు, యుగ లక్షణాలు, పాత్రల నామాలకుగల వ్యుత్పత్యర్థాలు, నిరుక్త శాస్తన్రిర్వచనాలు, ఉపనిషత్పరిభాషలు- ముఖ్యమైనవి.
వీటిలో ఉపక్రమోపసంహారాల గురించి మనం ఇప్పటికే ప్రస్తావించుకొని వున్నాం. యుగలక్షణాలలో కొన్నిటిని మనం స్మరించాం. అంతేకాక, కృతయుగంలోని కల్యంశకాలంలో ఈ చరిత్ర జరిగిందని చెప్పుకొన్నాం గనుక, ఆనాటి మానవజీవులకు దేవలోక నాగలోక జీవులతో తాత్కాలిక ప్రత్యక్ష సాంగత్యం వుండేదని మనం గుర్తించాలి. దీనికోసం వారికి ప్రత్యేక దివ్యశక్తుల అవసరంలేదు. అందులోనూ కల్యంశగల కాలం గనుక, పుష్కరుడి వంటి దుష్టజీవులకు కూడా ఆరోజుల్లో స్థానం వుండేదని మనం ఊహించవచ్చు.
అందుకోసమే, ఈ కథలో, మానవ కాంతాస్వయంవరంకోసమై అటు దేవలోక జీవులేకాక, ఇటు నాగలోక జీవులుకూడా తరలిరావటం మనకు కనిపిస్తుంది.
ఇంద్రాది దేవలోక జీవులకుగానీ, కర్కోటకాది నాగలోక జీవులకు గానీ, తేజఃప్రధానమైన దేహాలు వుంటాయిగానీ, వాళ్ళు కావాలనుకున్నప్పుడు మానవులలాగా పృథివీ ప్రధానమైన పాంచభౌతిక దేహాలను ధరించగలరు. ఈ విషయం పురాణాలలో ప్రసిద్ధమే.
దేవతలు అలాంటి సంకల్పాలను ఎప్పుడు చేస్తారంటే, మానవులలో ఉత్తమార్హతగల జీవులను పరీక్షించి, వారిని మరింత సమున్నతాధ్యాత్మిక స్థాయికి తీసుకుపోదలచుకున్నప్పుడే చేస్తారు. నలచరిత్రలో కూడా ఆ పనే జరిగింది.
ఈ విషయం స్పష్టంకావాలంటే నలచరిత్రలోని ప్రధాన పాత్రధారుల యొక్క నామ నిర్వచనాలను పరిశీలించాలి.
నలనామ నిర్వచనం:
వీరిలో సర్వప్రధానుడు నలుడు. ‘‘నల’’శబ్దానికి అనేక రకాలైన నిర్వచనాలు వున్నాయి. విచిత్రం ఏమిటంటే, అవన్నీ నలచరిత్రలో అన్వయిస్తున్నాయి. ఉదాహరణకు-
1. నలుడంటే ఎవరోకాదు. నరుడే.
‘‘రలయోరభేదః’’ (‘‘ర’’కు ‘‘ల’’కు తేడా లేదు)-అని వ్యాకరణ మర్యాద. నరుడంటే- ‘‘నృణాతి నయతి సర్వం స్వవశమితి నరః’’ (అన్నిటినీ తన వశంలోకి తెచ్చుకొనేవాడే నరుడు) అని అమరకోశ వాఖ్యలోని నిర్వచనం.
ఇక ‘‘నల’’శబ్దానికి ‘‘నలతి-అర్దయతీతి నలః, నల్యతే అర్ద్యతే బధ్యతే ఇతి నలః’’

- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి