మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరశక్తి- దమశక్తి స్వరూపలైన నలదమయంతులు శివానుగ్రహంతో కలువబోతున్నారు. కనుకనే, వీరిద్దరినీ పరీక్షించి చూడవలసిన బాధ్యత దేవేంద్రుడి మీద పడ్డది. దేవేంద్రుడి ఉద్యోగమే అది. ఈ రహస్యం గ్రహించమని కువిమర్శకులు ఆయనను అసూయాపరుడిగా చిత్రీకరిస్తూ వుంటారు. ఆ చిత్రణకు ఈ కథలో అవకాశం లేదు. ఎందుకంటే, దేవేంద్రుడు నాయికా నాయకులను పరీక్షించినాక, తృప్తిపడి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కదా!
ఇంద్ర శబ్దానికి కూడా రెండు నిర్వచనాలు- ఐశ్వర్యాధిపతి అని ఒకటి, ఇంద్రియాధిపతి అని ఒకటి. ఇవి నిరుక్తశాస్త్ర ప్రసిద్ధాలు. ఈ రెండు లక్షణాలూ ఈ కథలోని ఇంద్రుడికి అన్వయిస్తాయి.
కథలోని తిరస్కరణీ విద్యాదులు ఇంద్ర పరీక్షలోని భాగాలే. ఇంద్రుడు ఇతర దిక్పాలకులనుతోడు తెచ్చుకోవటం కథా సౌందర్యంకోసమే.
దమయంతీ స్వయంవర సమయంలో నాగలోక జీవులు కూడా వచ్చారని చెప్పడం రాబోయే కర్కోటక పాత్ర ప్రవేశానికి నాందీ వచనప్రాయమే.
‘‘ఇక నరులకు శివానుగ్రహం లభించే విధానమేమిటి?’’-అనే విషయాన్ని మనం పరిశీలించాలి.
‘‘ఆచార్య వాన్ పురుషో వేద’’(గురువు వున్నవాడికే జ్ఞానం లభిస్తుంది) అని ఛాందోగ్యోపనిషత్తు శాసిస్తోంది. ఈ విషయాన్ని స్కాంద పురాణంలోని గురుగీత బాగా వివరించి చెపుతోంది. ఆ గీత ‘‘శ్రీగురు శ్శివ ఏవ సః’’ (ఆ శివుడే ఈ గురువు. ఈ గురువే ఆ శివుడు) అని సూత్రీకరిస్తోంది. ఇక్కడ శివుడంటే, ఇష్టదేవతే.
మన కథలో దమయంతికి సూటిగా గురువులేకపోయినా, ఆమె తండ్రి యొక్క గురువైన దమమహర్షే ఆమెకు ప్రథమ గురువుగా పనిచేశాడు. అదీగాక, స్ర్తిలకు భర్తే ప్రధాన గురువని శాస్త్రం నిర్దేశిస్తోంది. దమయంతి ఈ సూత్రాన్ని తన జీవితంలో నూటికి నూరుపాళ్ళూ ఆచరణలో పెట్టింది.
కర్కోటక పద నిర్వచనం:
మరి నరుడైన నలుడికి గురువు ఎవరు?
ఈ ప్రశ్నకు కథలో సూటిగా సమాధానం దొరకదు. కానీ, ‘‘శిష్యుడ్ణి విషమ పరీక్షకు గురిచేసి, చివరికి తత్త్వ విద్యాప్రదానంచేసేవాడే గురువు’’ అనే లక్షణాన్ని తీసుకొంటే, నలుడికి గురుస్థానీయుడు కర్కోటకుడే- అనక తప్పదు.
ఈ మాట మింగుడు పడటం చాలామందికి కష్టంగా వుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే, కర్కోటక శబ్దం క్రూరత్వానికి ప్రతినిధి అనీ, కర్కోటకుడు కలిప్రోత్సాహకుడనీ, ఈ వ్యాస ప్రారంభంలోనే మనం చెప్పుకొని వున్నాం. కానీ, పురాణాలలోని రహస్యం ఏమిటంటే, కద్రువ పుత్రులైన కాద్రవేయులు (నాగజాతివారు) అందరూ దుర్మార్గులు కారు. అనంతుడు, శేషుడు, వాసుకి, కర్కోటకుడు వంటి సన్మార్గులు కూడా వున్నారు. కాకపోతే, శమీక పుత్రుడి శాపబలంవల్ల కర్కోటక నాగేంద్రుడు పరవశుడై, కలిపురుషుడికి దోహదం చేయవలసి వచ్చింది. దానివల్లే క్రూరుడనే నీలాపనింద కర్కోటకుడి నెత్తిమీద పడింది. అది ఎప్పుడో ద్వాపరయుగాంతంలో జరగబోతున్న కథ. మనం ప్రస్తుతం కృతయుగంలోని నల చరిత్రలో వున్నామని మనం మరచిపోకూడదు.
- ఇంకాఉంది

- కుప్పా వేంకటకృష్ణమూర్తి