మెయన్ ఫీచర్

అనర్థాలు మిగిల్చే ‘అనే్వషణ’ అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడున్నర దశాబ్దాల క్రితం నిర్ధారించిన యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎట్టకేలకు జనంలో మేల్కొలుపు వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘యురేనియం’ సెగలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా విపక్ష రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు కదం తొక్కుతున్నాయి. యరేనియం వినాశనం కళ్లారా చూసిన పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళనతో బెంబేలెత్తుతున్నారు. కాలుష్యం విషయంలో యురేనియం మిగిలిన గనుల తవ్వకాలకు ‘తాతలకి తాత’ అని చెప్పాల్సిందే. తరతరాలు నాశనమైపోయే విపత్తును యురేనియం మన చేతికిచ్చి వెళ్లిపోతుంది. ప్రజలు తమ ప్రాణాలనే కాదు, రాబోయే తరాలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఆధునిక సాంకేతికత పుణ్యమాని గుట్టుచప్పుడు కాకుండా యురేనియం పరీక్షలను నాలుగు దశాబ్దాల క్రితమే పూర్తి చేశారు. ప్రాథమిక అనే్వషణలు 1983- 84లోనే ప్రారంభమయ్యాయి. వాయుమార్గ సర్వేను అదే ఏడాది పూర్తి చేశారు. కడప-నల్గొండలను కలుపుతూ ఉన్న నల్లమల అటవీప్రాంతం ఒకే పొరతో అనుసంధానమైనట్టు గుర్తించారు. గామా కిరణాల వర్ణపటమితి, 2009లో విద్యుత్ అయస్కాంత పరీక్షలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలోనూ, తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దగట్టు, లాంబాపురం, చిట్యాల, నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌లలో యురేనియం నిక్షేపాలను రెండు దశాబ్దాల క్రితమే గుర్తించిన ‘యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ అనుమతితో తన పని తాను చేసుకుపోతోంది. 2,240 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ వేముల ప్లాంట్‌ను 1100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు 2007లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. 2012 ఏప్రిల్ 20 నుండి తొలిదశ యురేనియం తవ్వకాలను కార్పొరేషన్ ప్రారంభించింది. తొలిదశలో 30వేల టన్నుల యురేనియం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ తవ్వకాలు 2050 వరకూ కొనసాగుతాయి.
తెలంగాణ విషయానికి వస్తే 2015 మార్చి 19న అప్పటి ఎంపీ దేవేందర్ గౌడ్ లోక్‌సభలో వేసిన ప్రశ్నకు అప్పటి ప్రధానమంత్రి స్వయంగా సమాధానం చెబుతూ అణువిద్యుత్ నిక్షేపాల అనే్వషణలో భాగంగా డిపార్టుమెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలోని అనుబంధ సంస్థ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చి (ఏఎండీ) నల్గొండ జిల్లాలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు తేల్చిందని చెప్పారు. 2014 డిసెంబర్‌లో తాజా నివేదిక రూపొందించగా, దాని ప్రకారం లాంబాపూర్‌లో ట్రై యురేనియం ఆక్ట్రాక్సైడ్ నిల్వలు 1450 టన్నులు, యురేనియం 1230 టన్నులు ఉన్నట్టు, పెద్దగట్టులో ఆక్ట్రాక్సైడ్ నిల్వలు 7585 టన్నులు, యురేనియం 6432 టన్నులు ఉన్నట్టు, చిట్యాలలో 9515 టన్నుల ఆక్ట్రాక్సైడ్ నిల్వలు, 8069 టన్నుల యురేనియం ఉన్నట్టు నిర్ధారించామని ప్రధాని సమాధానం చెప్పారు. ఈ తవ్వకాల బాధ్యతను జాదుగుడ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించింది. ముడి సరకును హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్లూయిల్ కాంప్లెక్స్ శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసిన యురేనియంను న్యూక్లియ ర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుందని ప్ర ధాని చెప్పారు. స్థానిక ఎన్‌జీవోల, ప్రజల వ్యతిరేకతను కేంద్రం అప్పటి నుం డి అధ్యయనం చేస్తోంది.
మూడు దశాబ్దాల పాటు ఎవరికీ పట్టని యురేనియం వ్యవహారం అకస్మాత్తుగా ఇపుడు అందరి దృష్టినీ ఆకర్షించడానికి రాజకీయ పార్టీ లు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఒక కారణమైతే సెలబ్రిటీలు నడుం బిగించడమే మరో కారణం. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు స్పష్టంగా చేయడంతో- వివాదం ఇంకెందుకు? అనే అనుమానాలు ఉండొచ్చు. వాస్తవానికి ప్రస్తుత దశలో రాష్ట్రప్రభుత్వ అనుమతితో యురేనియం కార్పొరేషన్‌కు పని లేదు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేది కూడా ఏమీ లేదు.
యురేనియం తవ్వకాలు జరిగితే నల్లమల అటవీ ప్రాంతం సర్వనాశనం కావడమేగాక, పచ్చని అటవీ ప్రాంతం పారిశ్రామిక వాడగా మారిపోతుంది. పులులు సహా అరుదైన జంతుజాలానికి ముప్పు వస్తుంది. నాగార్జున సాగర్ సహా తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతింటాయి, నదీ జలాలు విషతుల్యం అవుతాయి. నదీ జలాలపై ఆధారపడిన పంటలకు, ప్రజలకు ఇబ్బందులు తప్పవు. యురేనియం మూలకాలు భూగర్భంలోకి ఇంకిపోయి రసాయన చర్యలకు గురై, అది అణుధార్మిక కాలుష్యంగా మారి వేల ఏళ్ల పాటు మానవజాతికి శాపంగా మారుతుంది. యురేనియం నుండి వెలువడే ఫ్లూటోనియం అత్యంత ప్రమాదకరమైనది, అత్యధిక పరమాణు భారం ఉన్నదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. యురేనియం సాంద్రత సీసం కంటే 70 శాతం ఎక్కువ. యూరనైట్ ఖనిజం నుండి యురేనియంను వేరుచేసే క్రమంలో అనేక ఇతర మూలకాలు కూడా లభిస్తాయి. నల్గొండ జిల్లాలో జరిగే తవ్వకాల వల్ల మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్ కర్నూలు,ప్రకాశం, గుంటూరు, కర్నూలుతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై కూడా వ్యతిరేక ప్రభావం పడుతుంది.
యురేనియం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఖరీదైన వ్యవహారం. ప్రభు త్వం విద్యుత్ ఉత్పత్తి కోస మే యురేనియం తవ్వకాలను నిర్వహించనున్నట్టు చెబుతున్నా, భారత్ అణుయుద్ధానికి సిద్ధమవుతున్న క్రమంలోనే గోప్యంగా యురేనియం తవ్వకాలు జరుగుతాయన్నది విమర్శకుల మాట. అణుబాంబుల తయారీకి ఫ్లూటోనియం వంటి మూలకాలు అవసరమవుతాయి. ఇప్పటికే యు రేనియం కార్పొరేషన్ ఝా ర్ఖండ్‌లోని జాదుగుడ, భటి న్, నర్వపర, తురందీ , బందుహురాంగ్ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టింది. 1967లో కార్పొరేషన్ సింగ్‌భమ్‌లో ప్రారంభం కాగానే జాదుగుడలో తవ్వకాలు ప్రారంభించింది. ఇంతవరకూ వెలువడిన యురేనియం నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా నల్గొండ జిల్లాలో అనే్వషణే ఉత్తమమైనదని తేల్చారు. మేఘాలయ కాసీ హిల్స్‌లో కూడా తవ్వకాలు మొదలయ్యాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా మరో 13 చోట్ల యురేనియం తవ్వకాలు చేపట్టాలని కార్పొరేషన్ సిద్ధపడింది. ఒకసారి తవ్వకాలు మొదలుపెడితే కీలక మూలకాల లభ్యతకు ఏడేళ్ల సమయం పడుతుంది. అణు ఇంధన కమిషన్ అనుమతి లభించినా, పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాక అనేక కమిటీలకు దానిని పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణం అడవులు, వాతావరణ మార్పుల శాఖ తుది అనుమతికి పంపిస్తారు. అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక అసలు కథ మొదలవుతుంది. రానున్న అవసరాల దృష్ట్యా ఇప్పటికే హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్‌లో సదుపాయాలను విస్తృతం చేశారు. అవసరమైతే రాజస్థాన్‌లోని కోట కాంప్లెక్ సేవలను సైతం వినియోగించుకుంటారు. విశాఖలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన అధిక విచ్ఛిత్తి సామర్ధ్యం ఉన్న అణు కేంద్రాన్ని నెలకొల్పారు.
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు వీలులేని గట్టి చట్టాలు దేశంలో ఉన్నా వాటిని కాదని ప్రభుత్వాలు తమ పని తాము కానిస్తున్నాయి. భూ సేకరణ మొదలు, గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వరకూ అనేక వైరుధ్యాలున్నా- నిలదీసే శక్తిలేని సామాన్యులు వౌనంగా ఉంటున్నారు. పర్యావరణ వేత్తలు ముందుకొచ్చినపుడే న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వినాశకర చేష్టలను అడ్డుకుంటున్నాయి. గనులు, ఖనిజాల నియంత్రణ అభివృద్ధి చట్టం-1957 గనుల తవ్వకాలను నియంత్రించే సమగ్ర చట్టం. దీనిని 1957 డిసెంబర్ 28న రూపొందించినా, 1958, 1960, 1972, 1978, 1986, 1994, 1999, 2010, 2014ల్లో అనేక సవరణలు చేశారు. 2015 జనవరి 12న ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం జారీ చేసింది. సంబంధిత బిల్లును 2015 ఫిబ్రవరి 23న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2015 మార్చి 3న, రాజ్యసభలో మార్చి 20న ఆమోదం పొందింది.
2014 మే 16న సుప్రీం కోర్టు ఒడిశాలోని 26 గనుల అనుమతులను రద్దు చేయడం, అది వివాదాస్పదం కావడంతో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో గనుల తవ్వకాలు జరుగుతున్న పరిసరాల అభివృద్ధికి జిల్లా స్థాయి గనుల ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని, కొంత మొత్తం స్థానికంగా వెచ్చించాలని నిర్బంధం చేసింది. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టును 500 కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన మినరల్ కన్జర్వేషన్ డెవలప్‌మెంట్ రూల్స్ -2017ను రూపొందించారు. మినరల్స్ కన్జర్వేషన్ రూల్స్ -2016, మినరల్స్ ఆక్షన్ రూల్స్ 2015, నేషనల్ మినరల్ పాలసీ, మైన్స్- మినరల్స్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ రూల్స్ -1988, ఆఫ్‌షోర్ మినరల్ కనె్సషన్ రూల్స్- 2006లో గనులు, ఖనిజాల తవ్వకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. చెర్నోబిల్, జపాన్‌లోని ఫుకుషిమా వినాశనాల తర్వాత వీటి నిర్వహణ, భద్రత తలకు మించిన భారం కావడంతో అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు న్యూక్లియర్ రియాక్టర్లను మూసివేస్తున్నాయి. ఇపుడు భారత్ అణు ఇంధనంపై దృష్టి పెట్టడం దురాశకు పోవడమా? లేక మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడమా? అనర్థాలను, అంతులేని విషాదాన్ని మిగిల్చే ఈ అనే్వషణ అవసరమా?

-బీవీ ప్రసాద్ 98499 98090