మెయన్ ఫీచర్

జీడీపీపై ఇంత ఆందోళన అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది జూన్ త్రైమాసికానికి మన దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) వృద్ధి రేటు 5 శాతానికి తగ్గింది. దాంతో ‘ఆర్థిక మందగమనం’ పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. గత 70 ఏళ్ళల్లో ఆర్థిక వృద్ధి రేటు ఇంత మందగమనంగా లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఒక సందర్భంలో పేర్కొనడంతో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అభిప్రాయం పెంపొందటం ప్రారంభమైనది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధి కారంలోకి వచ్చినప్పటి నుండి జీడీపీ వృద్ధి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతూనే వస్తున్నది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎందుకోగాని ఈ ప్రభుత్వం తగు సామర్ధం చూపలేకపోతున్నది. కీలకమైన వ్యక్తులు అర్ధాంతరంగా ఈ వ్యవహారాల నుండి అదృశ్యం అవుతున్నారు. రెం డోసారి ప్రధాని పదవి చేపట్టగానే మోదీ చేసిన మొదటి పని రెండు ప్రత్యేక మంత్రివర్గ కమిటీలను ఏర్పాటు చేయడం. ఒక కమిటీ ఆర్థిక వ్యవహారాలు, వౌలిక సదుపాయాల గురించి చూస్తుంటే, మరొకటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి చూస్తుంటుంది. అయితే, ఈ కమిటీలు ఈ దిశలో చెప్పుకొదగిన కృషి చేసిన్నట్లు కనబడటం లేదు.
జనసంఘ్ రోజుల నుండి కూడా ఆర్థిక, గ్రామీణ, వ్యవసాయ వ్యవహారాలపై తగు నైపుణ్యం గల నేతలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మొదట్లో ఆచార్య ఎన్జీ రంగాను జనసంఘ్‌లో చేర్చుకొని పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అందుకోసం విజయదశమి ఉత్సవానికి ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను ముఖ్యఅతిధిగా నా గపూర్‌కు ఆహ్వానించగా, నానాజీ దేశముఖ్ ప్రత్యేకంగా నిడుబ్రోలు వెళ్లి, ఆయనతో రెండు రోజులు గడిపి పార్టీలో చేరమని కోరారు. అయితే ఆయన విముఖత వ్యక్తం చేశారు. అప్పుడే హార్వార్డ్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ ఐఐటిలో చేరి, ఆర్థిక వ్యవహారాలపై ఢిల్లీ యూనివర్సిటీలో చేసిన ప్రసంగాలు చూసి ముగ్ధుడైన నానాజీ దేశ్ ముఖ్ సుబ్రమణ్య స్వామిని జనసంఘ్ లో చేర్చుకొని, 28 ఏళ్లకే రాజ్యసభ సభ్యునిగా చేశారు. అయితే స్వామి ఉనికి పట్ల వాజపేయి, ఎల్‌కె అద్వానీ మొదటి నుండి అసహనంతో ఉంటూ వచ్చారు. ఆయనను ఆర్థిక మంత్రిగా చేయాలనీ మొరార్జీ దేశాయ్ అనుకొంటే తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి వాజపేయి ప్రధాని పదవి చేపట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తింది. జస్వంత్‌సింగ్‌ను చేయాలని అనుకొంటే లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందిన ఆయనను ఎట్లా చేస్తారనే అభ్యంతరాలు వెల్లడి అయ్యాయి. అద్వానీకి ఆ పదవి అప్పజెప్పే ప్రయత్నం చేస్తే ఆయన భయపడ్డారు. దాంతో ఒకప్పుడు చంద్రశేఖర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖను చేపట్టిన యశ్వంత్ సిన్హాను ఆర్థిక మంత్రిగా చేయవలసి వచ్చింది.
అయితే నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదార ఆర్థిక విధానాల పట్ల వాటిని ఆచరణలో ప్రారంభించిన పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, చిదంబరంలకు ఎటువంటి విశ్వాసం లేదని గమనించాలి. వారంతా నెహ్రూ, ఇందిరాగాంధీల హయాంలో అమలు చేసిన సామ్యవాద తరహా ఆర్థిక విధానాలలో పెరిగిన వారే. గత్యంతరం లేక ఉదారవాద విధానాలు చేపట్టారు. కానీ, జనసంఘ్ రోజుల నుండే బీజేపీ నేతలు ఉదారవాద విధానాల పట్ల ఆసక్తి చూపేవారు. కానీ ఆ దిశలో బలమైన సైద్ధాంతిక పునాదులు ఏర్పాటు చేసుకోలేక పోయారు.
ఏది ఏమైనా ఇప్పుడు రూపాయి విలువ పడిపోతూ ఉండటం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, తయారీ రంగంలో వృద్ధి సాధ్యం కాకపోవడం, వ్యవసా య-గ్రామీణ రంగాలలో వృద్ధి మందగించడంతో ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనడంలో సందే హం లేదు. మన ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై ఉండడంతో అమెరికా, ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంలోకి మనదేశం కూడా నెట్టివేయ బడుతుందని ఆందోళన చెందనవసరం లేదు.
తయారీ, సేవల రంగాలలో మందగమనం నెలకొన్నా విద్యుత్, విద్యుత్ ఉత్పాదన రంగాలలో అత్యద్భుతంగా 8.6 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. మార్చ్, 2019 త్రైమాసికంలో కూడా ఒకమాదిరిగా 4.3 శాతం వృద్ధి రేట్ నమోదైనది. అట్లాగే, వాణిజ్యం, హోటళలు, కమ్యూనికేషన్ రంగాలలో సహితం గణనీయంగా 7.1 శాతం నమోదైనది. అంతకు ముందు త్రైమాసికంలో వృద్ధి రేటు 6 శాతంగా ఉంది. మూగబోయిన ప్రైవేట్ రంగం వినియోగం ఖర్చులు జీడీపీలో 3.1 శాతం మాత్రమే ఉండగా, ప్రభుత్వం విశేషంగా ఖర్చు పెట్టి జీడీపీ పెరుగుదలకు తోడ్పడింది. ప్రభుత్వ పరంగా అసాధారణంగా 8.8 శాతం మేరకు వృద్ధికి దోహదపడటం జరిగింది.
ఆటో రంగంలో అమ్మకాలు పడిపోవడాన్ని ఈ సం దర్భంగా అంతా ప్రస్తావిస్తున్నారు. ఈ అమ్మకాలు తగ్గడం ఒక విధంగా మంచి పరిణామమని భావించాలి. మన నగరాలలో కాలుష్యానికి ఆటో రంగం ఒక కారణం. పైగా అదుపుతప్పిన ట్రాఫిక్ సమస్యలు, ఆధునిక జీవన వైపరీత్యాలను కూడా గుర్తు తెచ్చుకోవాలి. ప్రజారవాణాపై చూపుతున్న నిర్లక్ష్య ధోరణులను కట్టడి చేయడానికి ఈ పరిణామం ఉపయోగ పడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గొప్ప సూచిక అయిన సిమెంట్ అమ్మకాలు గత 18 నెలలుగా గణనీయంగా పెరుగుతూ ఉండడాన్ని ఈ సందర్భంగా ఎవరూ గమనించడం లేదు. ఉదాహరణకు జూన్, 2019 త్రైమా సికంలో అంబుజా సిమెంట్స్ ఆదాయంలో 51 శాతం పెరుగుదల చూపింది. గత సంవత్సరకాలంలో వడ్డీలు, పన్నులు, తరుగుదలను మినహాయిస్తే 12 శాతం ఆదాయం పెరిగింది. మరో పెద్ద సిమెంట్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ నిర్వహణ లాభం 25 శాతం పెరిగింది. అమ్మకాలలో 7.8 శాతం పెరుగుదల చూపారు.
ప్రస్తుత ఆర్థిక మందగమనానికి చాలామంది పెద్దనోట్ల రద్దు, వస్తు- సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా చెబుతున్నారు. ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ ఈ రెండింటినీ- దుర్భరమైన విపత్తులని అంటూ అభివర్ణించారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ 2 శాతం తగ్గి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే వార్షిక వృద్ధి రేటు 2 శాతం తగ్గక పోవడం గమనార్హం. గణనీయంగా మెరుగు పడినా తాత్కాలికంగా వృద్ధిరేటు తగ్గుముఖం పట్టింది. 2016లో రెండో త్రైమాసికం నుండే వృద్ధి తగ్గుముఖం పడుతోంది. నోట్లరద్దు ప్రభావం ఉహించినదాని కన్నా తక్కువగానే ఉన్నట్లు చెప్పవచ్చు. జీఎస్టీ ప్రభావానికి సంబంధించి 2018లోని రెండో త్రైమాసికంలో తప్ప జీఎస్టీ వసూళలు పెరుగుతూనే ఉన్నాయి. వృద్ధి రేటు మందగిస్తున్నా జీఎస్టీ వసూళలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
2017లో రెండో త్రైమాసికమైన ఆగస్టు 2017 నుండి జీఎస్టీ అమలులోకి వచ్చింది. తాజా ఆర్థిక మందగమనం 2018-19లోని రెండో త్రైమాసికం నుండి ప్రారంభమైంది. కాబట్టి వృద్ధి రేటు పై జీఎస్టీ వ్యవస్థాగత ప్రభావం ఉండే అవకాశం లేదు. జీఎస్టీలోకి మారినప్పుడు చాలా పరిశ్రమలు అమలులో సమస్యలు ఎదుర్కోవడం వాస్తవం. కానీ, భారత్ వంటి సువిశాల దేశంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను మార్పు చేసినప్పుడు అటువంటి ప్రారంభ సమస్యలు తలెత్తడం సహజం. ప్రారంభంలో పలు సమస్యలు ఎదురైనా, జీఎస్టీ స్లాబ్‌లను తరచూ మారుస్తూ వచ్చినా మన వృద్ధి రేటు గౌరవప్రదంగానే ఉన్నదన్నది సుస్పష్టం. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గమనించాలి. అభివృద్ధి, వృద్ధిరేటు రెండూ భిన్నమైన అం శాలు. మనం ఎటువంటి అభివృద్ధిని కోరుకొంటున్నాము? ప్రభుత్వం నేడు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నది. అందుకోసం అనేక రాయితీలను ప్రకటిస్తుంది. అయితే మన మొత్తం జీడీపీలో ఇటువంటి పెట్టుబడులు 3 శాతం కన్నా తక్కువే. మన పెట్టుబడులతో అత్యధికంగా మన సొంత వనరుల నుండే సమకూ రుతున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించి, పెట్టుబ డులను తగ్గించుకోవడం పట్ల దృష్టి సారించాలి. అప్పుడే మన రూపాయి బలపడుతుంది. వ్యవసాయ రంగానికి మంచి ఆసరా దొరుకుతుంది.

-చలసాని నరేంద్ర 98495 69050