మెయిన్ ఫీచర్

బధిరుల కోసమే స్టార్టప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మాట్లాడలేదు..
వినలేదు.. కానీ కష్టపడి డిగ్రీ పూర్తిచేసింది. ఉద్యోగం చేయాలనుకుంది. అలా అందరిలా ఉదయం పదింటికి వెళ్లి సాయంత్రం ఐదింటికి వచ్చే ఉద్యోగం చేయడం కాకుండా.. తనలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం ఏకంగా ఒక స్టార్టప్ సంస్థను ప్రారంభించింది ఆమె. ఇది దేశంలోనే మొట్టమొదటి బధిర స్టార్టప్ సంస్థ. ఇంతకూ ఆమె పేరు చెప్పలేదు కదూ.. రెమ్యారాజ్. వివరాల్లోకి వెళితే..
కేరళలోని తిరువనంతరపురం రెమ్య స్వస్థలం. పుట్టుకతోనే రెమ్య వినలేదు, మాట్లాడలేదు. వెలకోమ్ అనే చిన్న ఊర్లో తల్లిదండ్రుల సాయంతో బధిరుల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసింది. తరువాత ఈమె ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చదివింది. తరువాత ఐటీ రంగంలో బిజినెస్ అనలిస్ట్‌గా చేరింది. కానీ మనసులో ఏదో అసంతృప్తి.. తనలాంటివారికోసం ఏదైనా చేయాలన్న తపన. అనుకున్నదే తడవుగా తనకు వచ్చిన ఆలోచనను కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ పంచుకునేది.. కానీ ఒకరోజు ఇద్దరితో కలిసి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఒక సంస్థను ఏర్పాటుచేసింది. ఆమె ఆలోచనను కేరళ స్టార్టప్ మిషన్ ఆమోదించింది. ఆ సంస్థ పేరే డిజిటల్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ ద డెఫ్(డీఏఏడీ). ఇందులో భాగంగా దేశంలోని బధిరులందరికీ సంజ్ఞల ద్వారా సాంకేతిక విద్యను అందిస్తోంది.
ఈ సంస్థ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో బధిరులకు కొన్ని కోర్సులను నేర్పిస్తుంది. వీటిల్లో ఐఎస్‌ఎల్, సైన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో తర్జుమా చేసిన అంశాలుంటాయి. వీటిలో కొన్నింటిని ఉచితంగా, మరికొన్నింటిని నామమాత్రపు రుసుముతో అందిస్తున్నారు. ఈ సంస్థ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరిస్తోంది. కొన్ని సందర్భాల్లో అనుకున్నంత డబ్బు సమకూర్చుకోలేకపోయినా కూడా ఈ సంస్థ తన సేవల్ని కొనసాగిస్తోంది. దేశంలో మొదటి బధిర స్టార్టప్ కూడా ఇదే.. వీలైనంతమంది బధిరులకు సేవచేస్తూ ముందుకు సాగడమే తమ లక్ష్యమని చెబుతుంది రెమ్యా. ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయ బ్రాండ్ యూనిటీ గేమింగ్ టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అలా రెమ్యా బధిర అమ్మాయిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మద్దతుదారులు, కేఎస్‌యూఎమ్ సాయంతో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళుతోంది. భారతదేశంలోని మహిళా వ్యాపారవేత్తగా ఎదగడం కష్టమైనా.. నాకేం తక్కువ అంటూ ముందుకు సాగుతోంది రెమ్యా రాజ్. తమ సంస్థ ద్వారా మరికొంతమంది దివ్యాంగులు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరుకుంటోంది.