మెయిన్ ఫీచర్

అమ్మ ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వసృష్టికి హేతువు జగన్మాత. జగన్మాతనే అమ్మఅని నోరారా పిలుస్తారు. అమ్మ లేని లోకాలు లేవు. అమ్మ ఈశ్వరుడిని సృష్టించి తానుఈశ్వరిగా మారింది. ఉన్న విశ్వాత్మ, పరమాత్మ ఒక్కరే. కానీ ఆ ఒక్కరూపమే సృష్టి సజావుగా సాగడానికి స్ర్తి పురుషరూపాలను పొందింది. ఆ జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు- పగలు, జగముల నేలే తల్లి ఆరాధనే - రాత్రి వ్రతము. అదే శరన్నవరాత్రవ్రతము.
మహావిష్ణువు దగ్గర నుంచి ఇంద్రాదులు, సిద్దులూ, సాధ్యులు, మునులు, మానవులు, అంతెందుకు సర్వులూ జగన్మాతను కొలిచిన వారే. అమ్మను ఆరాధించడానికి కులమతాలుకానీ, జాతివైషమ్యాలు లేవు. రాక్షసులు సైతం అమ్మను ఆరాధించినవారే.
కానీ వారిలోని బుద్ధి పెడదారి పట్టి అజ్ఞానపు పొరలు కమ్మి అహంకారం విజృభించి అంతా నాదే అని హుంకరిస్తే సాధువులను హింసిస్తే ఆ సృష్టికి కారణమైన తల్లే లయానికి కారకురాలు అవుతుంది.
ఆ అజ్ఞాన అహంకారమత్తులో కూరుకుపోయన వారిని సంహరించి తిరిగి పునఃసృష్టి యడానికి తానే అనేక అవతారాలు దాల్చింది. ఆ తల్లి అవతారాలను , ఆమె సంహరించిన అహంకారమదోన్మత్తులను గురించి స్మరిస్తూ తల్లిని ఆరాధించడమే శరన్నవరాత్రి పూజ.
మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూప నామములతో ఈ జగన్మాతనే పూజిస్తారు. దుష్ట రాక్షస సంహారం చేసి తన భక్తులను రక్షిస్తుంది. దానివల్లనే ఆ తల్లి జగన్మాతను కాలరాత్రి అని పిలిచారు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు, తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే అర్థాన్ని బట్టి, రాత్రి అనగా ‘తిథి’ అని అర్థం వస్తుంది. పాడ్యమి మొదలు నవమి తిథివరకు శ్రీదేవి పూజ, శరదృతువులో చేస్తారు. ఈ పూజనే శరన్నవరాత్రవ్రతం.
‘కాలరాత్య్రది శక్త్యాది వృతా స్నిగ్దేదన ప్రియా’ అనే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ‘కాలరాత్రి’ అనే నామం జగన్మాత గురించి చెబుతున్నది. ‘శబ్దాతిగః శబ్ద సహః శిశిరః శర్వరీకరః’ అన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో ‘శర్వరి’ అంటే ‘రాత్రి’ అని అర్థం. రాత్రి రూపమే తల్లి రూపం.
కన్యారాశిలోని చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో కలశస్థాపన చేసి శ్రీదేవీ శరన్నవరాత్రి వ్రత మహోత్సవమును ప్రారంభించి తొమ్మిది రోజులు నవరాత్రోత్సవం చేస్తారు.
మొదటి రోజు బాలాత్రిపుర సుందరిదేవి
ఈ అమ్మవారు ‘బాలా’గా కదంబవనంలో అగ్నినుండి ఆవిర్భవించింది. ఈ అమ్మవారి మంత్రోపదేశం తీసుకొని దేవీ నవరాత్రులు చేసేటప్పటి మొదటి రోజు బాలస్థితి. ఈ రోజు బాలాస్త్రోత్ర పారాయణ చేయటం మంచిది.
రెండవ రోజు మహాలక్ష్మి లేదా మహేశ్వరి
ఈ రోజు అమ్మవారు 42 ఆభరణాలు ధరించి ఉంటుంది. పాల సముద్రంలో పుట్టింది. శివుడు ఇచ్చిన అస్త్రంతో అసురులను సంహరించినందుకు ‘మహేశ్వరి’ అంటారు. ఈ తల్లి మంత్రసాధన చేసేవారందరూ వృద్ధిలోకి వస్తుంది. మంత్రోపాసన చేయలేని వారు లక్ష్మీ సోత్ర పారాయణైనా చేయాలి.
మూడవ రోజు అన్నపూర్ణాదేవి
ఒకానొకప్పుడు ఆకలి తట్టుకోలేని వ్యాసుని అనుగ్రహించిన తల్లి అన్నపూర్ణ. ఈ తల్లిని నేడు ఎవరు స్తుతించినా వారికి అన్నపానాలకు కొదువ ఉండదు. అన్నపూర్ణాష్ట పారాయణం మంచిది.
నాల్గవ రోజు గాయత్రీదేవి
ఈ రోజు అమ్మవారి అలంకారం గాయత్రిమాత 5 తలలతో ఉంటుంది. దశభుజియై ఉంటుంది. అమ్మనే స్వయంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పంచభూతాలకి సాక్షిగా అమ్మ ఐదు ముఖాలు ధరించి సాక్షాత్కరిస్తుంది.
ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి
చతుర్భుజాలతో చిరునవ్వును చిందిస్తూ సింహాసనంపై ఆసీనురాలై దర్శనమిస్తుంది అమ్మ. కుడివైపు వినాయకుడు, ఎడమవైపు కుమారస్వామి, కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మీదేవి వింజామర వీస్తూ వుంటే శంకరుని తో కలసిఅమ్మకూర్చుంటుంది. ఈ రోజు అమ్మవారిని ‘ప్రాతర్నమామి లలితే’ అని స్తుతిస్తారు.
ఆరవ రోజు కాళిక
రౌద్రరూపం దాల్చి నాలికను బయటపెట్టి చేతిలో రక్తపాత్రతో దర్శనం ఇస్తుంది అమ్మ. నల్లని రూపాన్ని, నల్లని వస్త్రాన్ని ధరించి ఉంటుంది. ఈ అమ్మని ధ్యానిస్తే శుభం. అన్నింటా మంగళం కలిగిస్తుంది.
ఏడవరోజు సరస్వతీదేవి
తెల్లని వస్త్రాలు ధరించి, వీణ చేత పట్టుకొని అక్షమాల పుస్తకంతో తెల్లని హంసపై కూర్చుని ఉంటుంది. వీణలో 24 మెట్లు గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలకి సంకేతం. జ్ఞానానికి మూలమైన అమ్మవారిని మూలానక్షత్రం రోజు సరస్వతి రూపం లో పూజిస్తాం.
ఎనిమిదవ రోజు దుర్గ
అమ్మ దుర్గమాతగా దుర్గమాలను చేధిస్తుంది. సాధకుడు ఈ ఎనిమిది రోజులు ఉపాసన చేసిన దృష్ట్యా సిద్ధ్ధిత్రి అయి సిద్ధిని అమ్మప్రసాదిస్తుంది. దుర్గాస్తోత్రం చేసిన వారికి కూడా దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది.
తొమ్మిదవరోజు మహిషాసుర మర్దని
మహిషాసుర మర్దిని యై మహిషుడిని సంహరించిన అమ్మ మహిషాసుర మర్దిని. అమ్మను ఆరాధిస్తే మనిషిలోని పశు లక్షణాలు పోయ మానవత్వం ద్విగుణీకృతం అవుతుంది.
ఇక దసరా. పదవ రోజు రాజరాజేశ్వరి
రాజరాజేశ్వరీ పూజ. అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేసిన వారికెల్లా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అందుకే సంతోషంతో అమ్మ అసుర సంహారం చేసినందుకు ‘విజయదశమి’ జరుపుకొంటారు అదే దసరా.

-దామరాజు నాగలక్ష్మి