మెయిన్ ఫీచర్

అద్భుత సాహిత్యానికి నోబెల్ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలెండ్ నవలా రచయిత్రి ఓల్గా టోకార్‌జుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 2018 సంవత్సరానికిగాను ఆమెకు నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన 15వ మహిళగా ఓల్గా గుర్తింపు పొందింది. 1901 నుంచి ఇప్పటివరకు సాహిత్యంలో 116 మందిని ఈ అవార్డు వరించింది. లైంగిక వేధింపుల కుంభకోణం నేపథ్యంలో గత సంవత్సరం ఆగిపోయిన ఈ అవార్డును పోలెండ్ రచయిత్రి ఓల్గా గెలుచుకున్నారు. ఆమె రచనల్లోని పాత్రల తీరుతెన్నుల్లో కచ్చితత్వం, కవితాత్మకత, విభిన్నత, నిత్య జీవనం.. ఇలాంటివన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆమె రచనలు నిత్య చలనం కలిగిన వర్ణరంజిత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. అద్భుత ఊహాత్మక వర్ణనలు, విషయ సమగ్రత, కళ్లకు కట్టినట్లు చూపే సాదాసీదా జీవనవిధానం ఆమె రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అకాడమీ కొనియాడింది.
ఓల్గా 1962 జనవరి 29న జన్మించింది. వార్సా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ పట్టాను అందుకుంది. కొంతకాలం పాటు సైకాలజిస్టుగా ప్రాక్టీసు చేసిన తర్వాత ఆమె మనస్సు రచనలవైపు మళ్లింది. అలా నిజజీవితంలో తాను చూసిన అనేక సంఘటనల్ని అద్భుతంగా అక్షరీకరించింది. శాకాహారిగా, పర్యావరణవేత్తగా, జంతుప్రేమికురాలిగా కూడా ఓల్గా గుర్తింపు పొందింది. పోలెండ్ దేశంలో స్వేచ్ఛ, సహనశీలత ఒట్టి మిథ్యేనని ఒకానొక సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీని గురించి ఓల్గాకు అనేక బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. అయినా ఆమె వాటిని లెక్కచేయలేదు. ఆమె రాసిన అనేక పుస్తకాలు ‘బెస్ట్ సెల్లర్స్’ జాబితాలో చేరాయి. ఆమె రచనలు హిందీతో సహా అనేక ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. వాటిద్వారా అనేక సినిమాలు నిర్మితమయ్యాయి. 1993లో ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ పేరిట తొలి నవల విడుదల చేసింది ఓల్గా. ఒక అంతుచిక్కని పుస్తకం కోసం సాగిన విఫల అనే్వషణ యాత్రను అంశంగా తీసుకుని ఈ అద్భుత నవలను రాశారు ఆమె. ఓల్గా రాసిన ‘ఫ్లైట్స్’ నవలకు ‘బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘బుక్స్ ఆఫ్ జాకొబ్’ పేరుతో ఆమె రాసిన పుస్తకం ఏడు దేశాలు, ఐదు భాషల్లో అనువాదమైంది. అందులో 18వ శతాబ్దంలో పోలెండ్‌లో వెలుగుచూసిన ‘ప్రాంకిజం’ అనే ఒక యూదు ఆధ్యాత్మిక ఉద్యమ చరిత్రకు అక్షర రూపం ఇచ్చారు. ఐరోపా చరిత్రలో దాదాపుగా నిర్లక్ష్యానికి గురైన ఒక అధ్యాయాన్ని ఈ పుస్తకం సవివరంగా ఆవిష్కరించింది. పోలెండ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక నైకీ లిటరరీ అవార్డుతో పాటు అనేక సాహిత్య పురస్కారాలను కూడా గెలుచుకుంది ఓల్గా.