మెయన్ ఫీచర్

మహారాష్టల్రో ‘కమలం’ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొద్ది రోజులలో మహారాష్టల్రో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు దాదాపుగా ఏకపక్షంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొన సాగుతున్న ఈ రాష్ట్రంలో భాజపా ఇటీవల తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలు భాజపా ఎత్తుగడల ముందు చిత్తవుతున్నాయి. స్పష్టమైన ఆధిక్యతతో భాజ పా-శివసేన కూటమి తిరిగి అధికారంలోకి రాగలమనే ధీమాతో ఉంది. బహుశా మహారాష్ట్ర ఏర్పడినప్పటి నుండి ఇంతకు ముందెప్పుడూ ఒక పార్టీకి ఏకపక్షంగా ఎన్నికల వాతావరణం ఇంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. సాధారణంగా కుల సమీకరణలు ఎన్నికలను ప్రభావితం చేసే మహారాష్టల్రో సాంప్రదాయ అంచనాలు తల కిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎల్లప్పుడూ జనాభాలో 31 శాతంగా ఉన్న మరాఠాలు మద్దతుతో ఎన్నికలలో ఆధిపత్యం వహిస్తూ వస్తున్నది. మరాఠాలు జనాభా రీత్యానే కాకుండా అర్థబలం, అంగ బలంతో కూడా ఆధిపత్యం వహిస్తున్నారు. విలక్షణమైన మహారాష్ట్ర సహకార ఉద్యమం దాదాపు మరాఠాల ఆధిపత్యంలో ఉన్నది. భారీ చక్కెర కర్మాగారాలు, పాల ఫ్యాక్టరీలు, సహకార బ్యాంకులు వారి ఆధిపత్యంలో ఉన్నాయి. దాంతో వారే మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆధిపత్యానికి భాజపా వ్యూహాత్మకంగా గండి కొట్టింది. రాష్ట్ర జనాభాలో కేవలం 3.5 శాతం మాత్రంగానే ఉన్న బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా భాజపా నాయకత్వం గత ఐదేళ్లుగా సామాజిక సమీకరణల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే ప్రయత్నం చేసింది.
మండల్ రాజకీయాలకు పూర్వం పరిపాలనలో బ్రాహ్మణుల ఆధిపత్యం సాగినా వారెన్నడు రాజకీయ శక్తిగా ఎదగలేదు. 1960లో మహారాష్ట్ర ఏర్పడిన తర్వాత కేవలం ఇద్దరు బ్రాహ్మణులు మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. వారిలో శివసేనకు చెందిన మనోహర్ జోషి ఒకరు కాగా, రెండోవారు ఫడ్నవిస్. గత ఐదేళ్లల్లో ఒకవంక మరాఠాలలో కాంగ్రెస్ పట్టుకు గండి కొడుతూ, మరోవంక ఓబిసిలపై పట్టు సాధించే ప్రయత్నం భాజపా చేస్తూ వచ్చింది. ఓబీసీలు సహితం రాష్ట్ర జనాభాలో 30 శాతం వరకు ఉన్నారు. ఇక బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాల మడ్దతు ఎట్లాగూ భాజపాకు ఉండనే ఉంది. ఆ విధంగా తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందని చెప్పవచ్చు.
మరాఠాల రాజకీయ ఆధిపత్యానికి గండి కొట్టడం కోసం భాజపా ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. మరాఠాలకు రిజర్వేషన్ల ద్వారా వారిలో కొద్దిపాటి చీలిక తీసుకు వచ్చింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ, రాజకీయంగా భాజపా తగు ప్రయోజనం పొందగలుగుతున్నది. మరోవంక, మరా ఠాలకు చెందిన కీలక నేతలు పలువురిని పార్టీలో చేరేటట్లు చేసుకోగలిగింది. ముఖ్యంగా ఆర్థిక అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు భాజపాలో చేరక తప్పలేదు. మొన్నటి వరకు అవినీతి నేతలుగా విమర్శిస్తూ వస్తున్నా వారికే ఇప్పుడు తమ పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వక తప్పని పరిస్థితి భాజపా నాయకత్వానికి ఎదురైంది. దాంతో రాష్ట్రంలో మరాఠా నాయకత్వం చిన్నాభిన్నమైనదని చెప్పవచ్చు.
ముఖ్యంగా భాజపా ఎన్నికలలో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. వారు తొలినుండి పార్టీలో ఉన్నవారా? వేరే పార్టీల నుండి వచ్చిన వారా? అని చూడనే లేదు. దాంతో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీలు కోలుకోలేక పోయాయ. మరోవంక దీర్ఘకాలంగా భాగస్వామ్య పార్టీగా ఉంటున్నప్పటికీ తరచూ వివాదాస్పద ప్రకటనలతో ఇరకా టంలోకి నెట్టివేస్తున్న శివసేనను దారికి తెచ్చుకోవడంలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వ్యూహాత్మకంగా వ్యవహరిం చారు. వాస్తవానికి భాజపా-శివసేన కూటమిలో దీర్ఘకాలం శివసేన పెద్దన్నగా వ్యవహరిస్తూ వచ్చింది. సీట్ల విషయంలో అంగీకారానికి రాలేక పోవడంతో 2014లో ఎవరికి వారుగా పోటీ చేశారు. దాంతో భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు కొద్దిపాటి సీట్లు అవసరం కావడంతో గత్యంతరం లేక శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది. ఇప్పుడు సగం సీట్లు కావాలని పట్టుబడినా 124 సీట్లకు శివసేనను పరిమితం చేసి, 150 సీట్లలో భాజపా పోటీ చేయగలుగుతున్నది.
తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయాలని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఎత్తుగడ వేసినా, చివరకు అప్పుడే అలాంటి ఆలోచనలు లేవని వివరణ ఇచ్చుకొనేటట్లు భాజపా నేతలు చేయగలిగారు. శివసేనకు చెందిన పలువురు శాసనసభ్యులను ఫడ్నవిస్ తన దగ్గరకు చేర్చుకోగలిగారు. భాజపాతో తెగతెంపులు చేసుకొంటే వారిలో ఎంతమంది తమతో మిగులుతారో? అనే అనుమానం థాకరేలకు కలిగేటట్లు చేయగలిగారు. దాంతో భాజపా ఇవ్వజూపిన సీట్లకు శివసేన సర్దుకోవలసి వచ్చింది. సంప్రదాయం ప్రకారం రెండు పార్టీల అధి నేతలు ఉమ్మడిగా పోటీ చేసే సీట్లను ప్రకటించక పోవడం గమనార్హం. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన ప్రాధాన్యత మహారాష్ట్ర రాజకీయాలలో మ రింతగా తగ్గే అవకాశం ఉంది.
ఇక ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో ఒక విధంగా భాజపాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే శివసేనతో పొ త్తుకు ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. అయితే కాంగ్రెస్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఎన్నికల వ్యూహం ఆ పార్టీలో కనబడటం లేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తమకు రక్షణగా ఉండాలని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండగా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన పట్ల అనుమానంగా చూస్తున్నారు. పవర్ తమతో పొత్తు ఏర్పాటు చేసుకున్నా అవసరమైనప్పుడు భాజపాతో చేతులు కలపరని విశ్వసింపలేమని భావి స్తున్నారు. ప్రతిపక్ష కూటమికి పవర్ కీలక సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని కాంగ్రెస్ వారు అనుమానాలతో ఉన్నారు. ఈ అనుమానాల మధ్య ఆ రెండు పార్టీల పొత్తు సరిగ్గా సాగడం లేదు. అయితే తన పార్టీ కూడా తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కొంటు ఉండటం పవార్‌కు ఆందోళన కలిగిస్తున్నది. పలువురు కీలక నేతలు భాజపా వైపు చుస్తూండటం, ముఖ్యంగా పట్టణ ప్రాం తాలలో చెప్పుకోదగిన బలం సంపాదించలేక పోవడం ఎన్‌సీపీకి తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. 60 అసెంబ్లీ సీట్లు గల ముంబయ, థానే నగరాలలో ఎన్సీపీ ఉనికి లేదని చెప్పవచ్చు.
ఇక భాజపా-శివసేన కూటమి ఓట్లు చీల్చగలరని అనుకొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే రానురానూ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పో తున్నారు. మొదట్లో మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించినా స్పష్టమైన రాజకీయ విధానం లేక ఆయన వెనుకబడి పోతున్నారు. మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సానుకూలత వ్యక్తం చేయడం, ఆ తర్వాత ద్వేషం పెంచుకోవడంతో తన ఉనికి కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు.
మరోవంక గత ఐదేళ్ల పాలనను చూసి కాకుండా, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ద్వారా నెలకొన్న పరి స్థితులను ప్రస్తావిస్తూ భావోద్వేగాలకు గురిచేసి ఓటర్లను ప్రభా వితం చేసే ప్రయత్నం భాజపా చేస్తున్నది. ఈ ప రిస్థితులలో తిరిగి అధికారంలోకి రావడానికి చెప్పు కోదగిన ఆటంకాలేవీ ఆ పార్టీ ముందు లేదని చెప్పవచ్చు. అయితే భాజపా నాయకత్వాన్ని ఇప్పుడు ఎక్కువగా వేధిస్తున్నది తిరుగుబాటు అభ్యర్థులు. భాజపా-శివసేన కూటమి పోటీ చేస్తున్న 50కి పైగా నియోజకవర్గాలలో 100 మందికి పైగా తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూడా తిరుగుబాటు అభ్యర్థుల బెడదకు గురవుతున్నా, అది సుమారు 20 నియోజకవర్గాలకు పరిమితం కావడంతో అంతగా ప్రభావం ఉండకపోవచ్చు.

-చలసాని నరేంద్ర 98495 69050