మెయిన్ ఫీచర్

రుగ్మతల నుంచి రక్షణకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, వ్యాయామమూ అంతే అవసరం. ఈ విషయం అందరికీ తెలుసు.. కానీ సమయం లేదంటూ ఉంటారు. వ్యాయామం కోసం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ‘యోగా’ను అనుసరించవచ్చు. బిజీ బిజీ జీవితాల్లో, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం అందించే యోగాసనాలు ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలంగా వచ్చే రుగ్మతల నుంచి రక్షణ పొందాలంటే కొన్ని యోగాసనాలను సాధన చేయాలి.
థైరాయిడ్ సమస్యలకు..
థైరాయిడ్ సమస్యలు పోవాలంటే శరీర జీవక్రియలు క్రమబద్ధంగా నడవాలంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా పనిచేయాలి. లేదంటే శరీరం శక్తిని ఖర్చు చేసే వేగంలో అవకతవకలు ఏర్పడి నాణ్యమైన జీవితాన్ని గడపలేం.. చర్మం పొడిబారడం, నిస్సత్తువ, మానసిక వ్యాకులత, అకారణంగా బరువు పెరగడం, గొంతువాపు, జుట్టు రాలడం వంటివి థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులకు సూచనలు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచే ఆసనాలు వేయాలి.
హలాసనం
హలాసనం మెడ దగ్గరున్న థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి అది సక్రమంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇది వేసేటప్పుడు ముందుగా వెల్లకిలా నేలపై పడుకోవాలి. విశ్రాంతిగా ఉంటూ కాళ్లను దగ్గరకు చేర్చి, చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి. ఊపిరి బిగబట్టి రెండు కాళ్లనూ నిలువుగా పైకి లేపుతూ తల వెనక్కి తీసుకెళ్లి నేలకు ఆనించాలి. ఈ భంగిమలో ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే గ్రంథికి అంత ఎక్కువ మేలు జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా కాళ్లను పైకి లేపుతూ నేలపైకి చేర్చి, వెల్లకిలా పడుకున్న భంగిమలోకి రావాలి.
మత్స్యాసనం
ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా వెనక్కి వంగుతూ శరీరాన్ని విల్లులా వంచి తలను నేలకు తాకించాలి. ఇలా చేస్తున్నప్పుడు మోచేతులను నేలపై ఉంచి వాటి ఆధారంగా వెనక్కి వంగాలి. తల నేలకు తాకిన తర్వాత చేతులతో కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయం ఉండాలి.
మధుమేహం తగ్గాలంటే..
యోగాసనాల వల్ల గ్రంథుల పనితీరు మెరుగవుతుంది. పిత్తాశయం, కాలేయం నుంచి స్రావాల విడుదల క్రమబద్ధమవుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్, చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. చక్కెర వ్యాధికి మందులను వాడుతూ యోగాసనాలు వేయగలిగితే ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగై మధుమేహం అదుపులోకి వస్తుంది. ఈ రుగ్మతకు తగిన ఆసనాలు ఇవే..
త్రికోణాసనం
నిటారుగా నిలబడి చేతులను శరీరానికి పక్కన ఆనించి ఉంచాలి. తర్వాత రెండు కాళ్ల మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం ఉండేలా కాళ్లను జరపాలి. కుడి కాలును శరీరానికి 90 డిగ్రీల కోణంలో తిప్పి, ఎడమ కాలును కూడా 45 డిగ్రీల కోణంలో తిప్పి నిలబడాలి. నడుపు పై భాగాన్ని కుడి కాలు వైపుకు తిప్పాలి. ఇలా శరీరాన్ని వంచినప్పుడు ఎడమ చేయి, కుడి కాలు పక్కగా నేలను తాకాలి. కుడిచేయి
నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి. తల, చూపులు ఆకాశం వైపు ఉండాలి. ఇదే ఆసనాన్ని ఎడమ వైపు వంగి కూడా చేయాలి.
లఘు వజ్రాసనం
మోకాళ్లపై కూర్చుని నడుము పై నుంచి శరీరాన్ని వెనక్కి వంచాలి. వెనక్కి వంచిన తలను నేలకు ఆనించాలి. చేతులతో మోకాళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటు నుంచి ఒక నిముషం పాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా శరీరాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చి చేతులను వదులుగా వదిలేయాలి.
కీళ్లనొప్పుల కోసం..
ఈ మధ్య కాలంలో యువతను ఆర్థ్రయిటిస్ సమస్య వేధిస్తోంది. కీళ్లకు తగినంత వ్యాయామం దొరకకపోవడం, తప్పుడు భంగిమలలో కాళ్లను మడిచి కూర్చోవడం, కుదురుగా ఉండని చెప్పులు ధరించడం వల్ల కాలి కీళ్లలో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో మృదులాస్థి దెబ్బతిని, ఎముకలు రాపిడి గురై కీళ్ల మార్పిడి చేయించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం కీళ్లకు బలాన్నిచ్చే ఆసనాలు వేయాలి.. అవేంటంటే..
శిశువాసనం
మోకాళ్లపై కూర్చుని పిరుదులకు కాళ్లను ఆనించాలి. రెండు చేతులూ పైకి లేపి నడుము పై భాగాన్ని ముందుకు వంచి తలను నేలకు తాకించాలి. ఈ భంగిమలో చాపిన చేతులు కూడా నేలను తాకాలి. పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి ఊపిరి పీల్చుకోవాలి. ఈ భంగిమలో సాధ్యమైనంత ఎక్కువ సమయం ఉండి తిరిగి పైకి లేవాలి.
అధోముఖశ్వాసాసనం
మోకాళ్లపై కూర్చుని, అరచేతులను నేలకు ఆనించాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును పైకి లేపాలి. కాళ్లు, చేతులు నిటారుగా ఉండేలా పైకి లేవాలి. ఈ భంగిమలో తలను చేతుల మధ్య ఉంచాలి, చూపులు నేలవైపు ఉండాలి. ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయంపాటు ఉండి తిరిగి కాళ్లను మడిచి కూర్చోవాలి.
*