మెయిన్ ఫీచర్

కవితా.. ఓ కవితా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తువు కావ్యస్రష్ట చైతన్యాన్ని సూచిస్తుంది. దాని అభివ్యక్తికోసం వస్తు రహస్యాన్ని దొరకపుచ్చుకోవటంలో కవిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాని కవి తాను ఎంచుకున్న రూపంలోనే కవిత్వం ద్యోతకముతుందనుకోవటం కేవలం అజ్ఞానం. రూపం బాహ్యం మాత్రమే. అంతర్గతమైన అగరు కనిపించదు. ఆ కనిపించకపోవటం కవిత్వమవదు. ఏదైతే కనిపిస్తుందో (రూపం) అది కావ్యకళ అనిపించుకోదు. తెలుగు భాషలో ఈ కావ్యకళ అత్యంత ప్రధాన సమస్యగా మారి సాహిత్యక్షేత్రంలో దృష్టి అంతా అటువైపే ఖర్చుకావటం చర్చల ఝంఝామారుతం రేగటం ఒక శోచనీయ స్థితి. ఏ కొందరో తప్పించి అధిక శాతం కవులకి, విమర్శకులకి కావ్యచేతన లేకపోవటమే దీనికి కారణం. సంవేదనాత్మకమైన వ్యక్త్భావం లేనిదే కవిత్వం పుట్టదు.. వర్తమానాంధ్ర కవులకిది మృగ్యం. దీనికి కారణం కవిత్వంకన్నా వ్యక్తిగత ప్రయోజనాన్ని ఎక్కువగా అభిలషించటం. ఇది కచ్చువు నచ్చులో చూసుకునే వాపిరి మాత్రమే. రెండుమూడుసార్లు ఆ ప్రచురణతో కవ్యంహకార ప్రతిష్ఠ జరుగుతుంది. మొలకలై పిలకలెత్తి సంకలనావిష్కరణతో విరాడ్రూపం ధరిస్తుంది. మహాకవుల జాబితాలో మరో పేరు ఎక్కుతుంది. ఈ ఆవర్జాలో వారి పేరు వారే ఎక్కించుకుంటారు. అనుభూతి మూలక ఆత్మకళాభ్యాస సన్నివేశాల్లో నుంచి మాత్రమే కవితా వాక్య విన్యాసాలు వెలికివస్తాయి. కాగితం కలం పుచ్చుకొని పోలీసు కేసుల్లా బనాయిస్తే కవిత్వం రాదు. రామాయణ నాందీ శ్లోకమైన మానిషాద శ్లోకం జీవితంలో నుంచి పోగుచేసుకున్న అనుభవపాఠమే. అనుభూతి చిలికి తీసిన కళా నవనీతమే. ఇది ఆత్మకళాభ్యాసంతోనే సాధ్యవౌతుంది. జీవితంలో అనుభవించటం వేరు, అనుభూతిగా అభ్యసించటం వేరు. పఠనం అనుశీలనం వీటిమధ్యగల భేదాన్ని గమనించగలగాలి. ఈ గమనించటమన్నది కవిత్వాన్ని గుర్తించటం కోసం. మనిషిని మార్చాలంటే, మనిషిని పతితుడు కానీకుండా పట్టుకోవాలంటే కవిత్వానికే సాధ్యం. కవిత్వం మనిషితో కలవాలి. మనుష్యుల జీవనస్మరణ సమస్యలతో మిళితం అయిపోవాలి. ఇపుడు వస్తున్న కేకలు - అరుపులు ఆర్భాటాలు కవిత్వం అనుకుంటే, అంతకంటె డబ్బా మోత ఇంకోటి ఉండదు. కవిత్వమంటే అక్షరానుభూతి. ఈ శక్తి వక్రోక్తి, ధ్వని, అలంకారం ఇత్యాది బహువిధ చమత్కార ప్రయోగం చేత శబ్దానికి లభింపజేయబడుతున్న ఒక విశిష్ట సిద్ధి. ఈ శక్తి మనిషిమీద పడాలంటే తదుత్పాదక హేతువులైన చమత్కార విశేషాలు మనిషికి సాక్షాత్కరించాలి. ఈ శ్రమ ఎందుకనుకొంటే కవిత్వం ‘నీలిరాగాలే’. దురదృష్టవశాత్తు ఈనాడు కవిత్వం పరస్పర సహకార సంఘాల చోద ద్రవ్యమైంది. తత్కారణంగా అసాహిత్య జాతులన్నీ సాహిత్యంలోకి చొరబడ్డాయి. నిజంగా వీళ్ళెవరికీ సాహిత్యంతో సంబంధం లేదు. కులమో- మతమో అక్షర వేషం వేసుకుని సాగిస్తున్న వ్యభిచారం. శబ్ద ఘోషకు బానిసలు. కేవలం శబ్ద వ్యాపారమే కవిత్వం అనుకునే ఒక అద్వితీయ విచిత్ర విధానం తెలుగు నేలమీద అస్థిగతం కావటమే ఈ దరిద్రానికి మూలహేతువు. పుంజీలకొద్ది ఉదాహరణలు యివ్వగలను కానీ వారికా దురంద విషాదం అక్షరాలా కల్పించటం నా అభిమతం కాదు. వారి తెలివిమీద వారికున్న భ్రమ తొలగిపోవాలి. ముడి పదార్థంతో నాజూకు వస్తువైన కళాత్మకరచన (కవిత్వం) చెయ్యబడదు. కవి సుఖ దుఃఖాత్మకమైన జీవితంలో విలీనమయ్యేటప్పుడు తనని విభిన్న రసాలుగా విశే్లషించుకుంటాడు. జీవన మైదానాల్లోకి నానా రసాలై ప్రవహిస్తాడు. జనన మరణాలనే రెండు పార్శ్వాలను- వాటి మధ్య కాలాహి క్రీడ ఏ విధంగా ధ్వని గర్భితమయందో చూడండి.
‘‘వాడు / చేయి చాపితే వసంత గీతి / చేతలుడిగితే శ్లథ శైశిర పలాశరీతి / ఈ మధ్యకాలమంతా మహాసంగ్రామం / అనల వేదిక ముందు అస్ర నైవేద్యం’’- (స్పస్థిల) బ్రతుకు బరును మోసి మోసి అలసిపోయి వచ్చే ఒక దీర్ఘమైన నిట్టూర్పును ప్రతిధ్వనిగా కవిలోనుంచివచ్చే సుశిక్షతమైన ఓదార్పే కవిత్వం. పగ, ద్వేషం, అసూయ, కేక - ఇవి కావు మిత్రమా కవిత్వమంటే. రసానుభూతికి, స్వసానుభూతికి హస్తిమశకాంతర భేదముంది. కవులు తామదో మహాబోధకులమన్న తీరుగా వ్యవహరిస్తే తమ తమ అల్పత్వంతోపాటు తమ అవిద్యను కూడా బైటపెట్టుకున్నవారే అవుతారు. వినూత్న కవితాభివ్యక్తికి అనుకూలమైన భాషాపరమైన నూతన సంకేతాలను ఉత్తమకవి సర్యాతిశాయిగా స్థాపించుకుందుకు ప్రయత్నించాలి. ఇది నిరంతర అనుశీలనం ద్వారానే సాధ్యం.
అనుశీలనం లేని వ్యక్తిత్వం రచనాసక్తమైతే కవిత్వం కేవలం స్థూలమైన భౌతిక స్వరూపంతోనే భ్రష్టవౌతుంది. కవి ఎప్పుడూ సామాన్య సామాజికుని స్థాయి నుండి ఉన్నతుడే. కవి కూడా మనిషే. ఐతే ప్రతి మనిషి కవి కాడు. కాలేడు. కనుకనే నేడు సర్వత్రా అకవిత్వ దుర్వాయువులు వ్యాపిస్తున్నాయి. కవిత్వం స్వరూపంపైనే సర్వులూ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు తప్ప కవిత్వ స్వభావం గురించి అధిక సంఖ్యాకులు ఆలోచన పెట్టటంలేదు.
కవిత్వానికి ప్రధాన జీవలక్షణం ప్రతిభ. ప్రతిభ అనేది బీజప్రాయంగా వుంటే దానిని అక్షీణ మనన ధ్యానాదులతో వృద్ధి చేసుకోవచ్చు. వ్యుత్పన్నతను దానికి అధిష్ఠానంగా చేసుకొని కాపాడుకోవచ్చు. అంతే తప్ప వృత్తికోసం పాండిత్యప్పట్టా పుచ్చుకున్నంత మాత్రాన ప్రతివారికీ ప్రతిభ దానంతటదిగా లభించదు. కనుకనే ప్రతి యుగంలోను పండితులు వేరు, కవులు వేరుగా ప్రసిద్ధులు. వర్తమాన కవుల చేవ ఏమిటో శ్రీనాథుడానాడే పసిగట్టాడు. ‘బూడిద బుంగ’ లట్టివారే. ఈ లక్షణం మరీ అంత బాధపడవలసింది అప్పుడు కాదు కానీ- ఇప్పుడు మాత్రం బాధపడవలసిందే. ఇప్పుడు వీళ్లంతా ఉద్యోగాల్లో ఉన్నారు. ఊళ్ళు ఏలుతున్నారు. రచ్చ చేస్తున్నారు; కచ్చుకీడుస్తున్నారు. బరితెగిస్తున్నారు. బజార్నపడుతున్నారు. నిజానికి ప్రతిఒక్కరూ కవి కావాల్సిందే. అంటే అచ్చమైన కవితా హృదయాన్ని పెంపొందించుకోవాల్సిందే. తద్వారా లభించిన రసజ్ఞతతో కవితాధ్యయనంలో కేంద్రీకరించవలసింది. తన హృదయానికి మరిన్ని వెలుతురు రేకలద్దుకోవాల్సిందే. ఐతే సాధించకుండానే కలం మూత విప్పుతున్నారు. రాజకీయ నాయకుల ఉపన్యాస వస్తువే కవుల కావ్యవస్తువు. రాజకీయ కవితలే ఎక్కువగా వ్రాయబడుతున్నవి. దానితోపాటు తను వ్రాయు కవిత్వమే కవిత్వమని తన మార్గం అనితరసాధ్యమని, తానో కవిత్వ ప్రవక్తనని, తానొక అభ్యుదయ భావపథానికి ప్రతినిధినని ఏవేవో పనికిమాలిన పారుపత్తేన్ని ఒంటపట్టించుకున్నాడు. ఎంతసేపటికీ తను తన నాయకత్వంలోని ‘గోచీ గొప్ప’ తప్ప కావ్యవస్తువులను గూర్చి ఆలోచించే పని మానుకున్నాడు. ఆలోచించనివాడు, అనుభవములేనివాడు ఏమి చెపుతాడు? ఏమి వ్రాస్తాడు? వీడికి సంప్రదాయమంటే పడదు. కారణము అదంటే ఏమిటో తెలుసుకోవాలనే ‘యియాస’ ఉండదన్నమాట. శ్రుతపాండిత్యమెక్కువ. శే్లష్మాంతర్గతమక్షికమన్నమాట. వీడు రెంటికి చెడ్డ రేవడు. సంప్రదాయ స్పర్శా లేదు, సమకాలీన స్పృహా లేదు. చదువుయందాసక్తి, సంధ్యయందానురక్త రెండూ లేవు. వెరసి చదువు సంధ్యల యందు విస్వాసము శూన్యము.
జీవితంలో సాధించగల రెండు ప్రధాన విషయాలు- ఒకటి పదవి, రెండు డబ్బు. వీటికి చదువుతో ఏ విధమైన సంబంధము లేదు. అదే గుర్తించాడాధునికుడు. ఈ ఆధునికులలో కొందరికేదో వ్రాయవలెనని ఆరాటం. ఆరాటం మంచిదే, కాని వ్రాయుటకేమి కావలయును? మంచి భాష- మంచి భావము కావలయునుగదా! మంచి భాష ఎక్కడ దొరుకుతుంది; అక్కడికి మనం వెళ్ళాలి. ఆ సాధనలో మంచి భావము దానంతట అదే వస్తుంది. చదువు వద్దనుకున్నవారికి మంచి భాష దొరికే చోటు అవసరపడదు. కనుక నేటి తరమువారికి చేతిలో చెప్పినట్లొదుగు భాష లేదు. నిత్య వ్యవహారిక భాషయే వారికాధారము. ఆ ఆధారమునే పట్టుకు వ్రేలాడుదురు. కనుక భాష విషయమున వీరు దరిద్రులు. ఇప్పటివారి నిత్యానుభవంలో పాశ్చాత్య ధోరణికియే కనబడుతున్నది. వాటి ధోరణి అట్లే యుండును. ఆ మర్యాదలను రచనలలో గుప్పించువారికి మర్యాదలేముండును? తమవి కానివి వుండును. ఇట్ల సాగుట సాహిత్యమున పాడిగాదు.
ఇంతవరకు ఏది చెప్పబడినదో అది వట్టి కవిత్వమును గురించియే. అందువలన మిగిలిన సాహిత్య ప్రక్రియలన్నియు సావధానముగా సృష్టింపబడుచున్నవని అర్థముకాదు. అవియు కవిత్వముననుసరించియే సాగుచున్నవి. ఇది యొక ఉప్పెన. మనము స్వతంత్రులమైన తరువాత దేశభక్తి ప్రవాసమార్గము పట్టినది. మన భాషాభిమానమునంతియే. సాహిత్యాధ్యయనశీలము పతనమైనది. మన సంస్కృతి సభ్యతలమీద ఏహ్యము ఎక్కువైనది. ఇంతకూ భావం ఏమిటంటే కవి వయో విజ్ఞానాలు యిచ్చే లోకానుభవ పరిపాకం చేతనే అంటే అనుభూతి చేతనే ఉత్తమ ప్రయోజనాన్ని చేరగలడు. అలా కాక నినాదాల చేత, తత్కాలవాంఛాగ్నుల చేత బలాత్కృష్టుడై గొప్పకోసం తనో కావి సిద్ధాంతానికి కవిగా ప్రతిబద్ధుడ్ని అనటం లోకవంచన, ఆత్మవంచన. విచారించగా వీరు కవి వేషం వేసుకున్న గజదొంగలు అని తేలిపోతుంది. వాడికసలు ఏరకమైన సిద్ధాంతావగాహనా వుండదు. ఉత్త నాటకం. కనక ఒకడు కవిత్వ విషయంలో ప్రతిబద్ధుడ్ని అని ఆర్భాటంగా ప్రకటించుకొన్నాడంటే అతడు అంటురోగం అంటించుకున్న అప్రగల్భుడని అర్థం. సరిగ్గా చెప్పాలంటే కవి ప్రతిబద్ధుడవటమంటే కవిత్వం కోసం జ్వలించే దశకుచేరాలి. కవి తన కమిట్‌మెంటు విషయంలో అనుభూతి, కావ్య ప్రయోజనము, ప్రతిబద్ధతా ఈ మూడు కలిసి (మనో- వాక్కు- కాయం) ఐక్యం కాగలగాలి. అప్పుడే ఈ ప్రతిబద్ధతకు అర్థం సిద్ధిస్తుంది. అంటే కవి జగత్తుకోసం తపించటమన్నమాట.
సృష్టిలో వున్న పాశవికత హింస, వాటి రూపాంతరంగా మానవ సమాజంలో వున్న అధర్మం- కవి పరితాప హేతువులు. అనుభూతి పరిణామం చేతనే కవి అధర్మ దృశ్యాలు సహించలేనంత నాజూకు జీవి అవుతాడు దానికసం పరితపించటమనే ఆత్మశిక్షతో అంతర్ముఖుడౌతాడు. పక్షిహతమైనప్పటి వాల్మీకి దుఃఖం వంటి అగ్ని అంటుకుంటుంది. కవిత్వం వస్తుంది. దృశ్యాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ మహాసాహిత్య సత్యము వస్తువని ఘోషించే వస్తువు సాహిత్య చైతన్యంగా మారే ప్రక్రియే సాహిత్యంలో కీలక ప్రక్రియ. ఈ శక్తి చేతుల్లో (బుద్ధిలో) ఉండాలేకానీ లోకంలో ఆ వస్తువుకు కొరతలేదు. ‘న కావ్యార్థ విరామోస్తి యదిస్యాత్ ప్రతిభా గుణః’ అని ధ్వన్యాలోకం ఈ సత్యానే్న ఉద్ఘాటిస్తుంది.
‘‘ఈ ప్రకృతి గాఢ రహస్య మెఱుగలేక / గాలి యొసగెడు కొత్త ఱెక్కలు ధరించి / విశ్వపథముల నడయాడి వేసరిలుట / అన్ని విధముల భావ్యమే యగును కాని / ఓ వలాహక శకలమా! నీవు కూడ/ నావలె పరిభ్రమించుచున్నావదేల..?’’
అని ప్రశ్నించుకున్న వస్తువు తాదాత్మ్యస్థితి నుండి (తేరుకొని) ఆత్మాశ్రయ అనుభూతిగా వ్యక్తమయి సముద్ర కెరటంలా ఎలా పరిణమించిందో తెలుసుకుంటే కవిత్వం అర్థమవుతుంది. ఒకటికి పదిసార్లు పేరును ఉటంకిస్తే గుణావిర్భావంకలగదు. సాహిత్య రాజకీయాల్లో కూలికి ఏడిచే అర్భకొసురులు నినాదాలు విసరటం మానుకుంటే కవిత్వం కనిపిస్తుంది.. ఇలా...
‘‘మరి నిన్ను స్మరిస్తే / నా కగుపించే దృశ్యాలా / వినిపించే భాష్యాలా / అగ్ని శిరస్సున వికసించిన వజ్రం / ఎగిరే లోహశే్యనం / ఫిరింగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం.

- సాంధ్యశ్రీ, 8106897404