మెయన్ ఫీచర్

సెల్ఫ్‌గోల్స్‌తో ‘హస్త’వ్యస్తం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పాత కాపులు, యువ నాయకుల మధ్య యుద్ధం జరుగుతోందా? వృద్ధనేతలు, యువ నాయ కులు రెండుగా చీలిపోయరా? పార్టీ ప్రథమ కుటుంబం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని వాళళూ .. వీళళు పంచుకున్నారా..? సోనియా చుట్టూ చేరిన వృద్ధ నేతల కోటరీ ఆమెకు ‘తాత్కాలిక అధ్యక్షురాలి’ ట్యాగ్ తీసేసి మరో మారు పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కోరుకుంటున్నారా? అందుకోసం రాహుల్ గాంధీ, ఆయన కోటరీకి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారా? లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం పలాయనం చిత్తగించిన రాహుల్ గాంధీకి శాశ్వత రాజకీయ సన్యాసం ఖరారు చేసి, కాంగ్రెస్ పార్టీని తమ గుప్పిటలో ఉంచుకునేందుకు, అందుకోసం రా హుల్ స్థానంలో ప్రియాంక వాద్రాను ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఆ కుట్రలో భాగంగానే, రాహుల్ గాంధీ చాలా చాలా గట్టిగా, చాల కచ్చితంగా కుటుంబం బయటి వారే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అన్నా, వినకుండా, ఆయన ఆజ్ఞలను బేఖాతరు చేస్తూ- సోనియా గాంధీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారా? ఆ కుట్ర కొనసాగింపుగానే, ఇప్పుడు సోనియా పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారా? రాహుల గాంధీ వృద్ధ నాయకుల ‘కుట్ర’ భగ్నం చేసేందుకు సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నారా? వృద్ధులపై యుద్దానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారా? అందుకేనా ఆయన బ్యాంకాక్ విమానం ఎక్కింది? కంబోడియాలో ధ్యానం చేసి ఇండియాకు వచ్చి కాంగ్రెస్ వృద్ధ నా యకులపై ఆకస్మిక దాడిచేస్తారా? సోనియా గాంధీ తనను సమర్ధిస్తున్న వృద్ధ నాయకులపై రాహుల్ ప్లాన్ చేసిన దాడికి ‘అమ్మమనసు’తో ఆశీస్సులు అందిస్తున్నారా? వృద్ధ నాయకుల నుంచి రాహుల్ గాంధీని రక్షించేందుకు సోనియా గాంధీనే స్వయంగా స్కెచ్ గీసి రాహుల్‌ను విమానం ఎక్కించరా? ప్రియాంక గేమ్ ప్లాన్ ఏమిటి? ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఆమె చేసిన మా ర్పులు,చేర్పులు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఆమె అమ్మ పక్షమా? అన్న పక్షమా? అసలు- ఊహాగానాల్లో వినిపిస్తున్నట్లుగా ఆ ముగ్గురి మధ్య నాయకత్వ పోరు లాంటిది ఏదైనా జరుగుతోందా? లేక పార్టీ పగ్గాలు ఫ్యామిలీ నుంచి చేజారిపోకుండా, ఒకటిగా అలోచించి, వ్యూహాత్మకంగా విడివిడిగా పావులు కదుపుతున్నారా? ఇలా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న చుట్టూ రాజకీయ, మీడియా వర్గాల్లో చాలా చిత్ర విచిత్ర చర్చ జరుగుతోంది.
అయితే, ఇన్ని ప్రశ్నల్లో ఏ ప్రశ్నకూ ఇదీ సమాధానం అని కన్విన్సింగ్ రిప్లయ్ ఇవ్వగలిగే వారు ఎవరూ లేరు. మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల సారం ఏమిటో కూడా ఎవరికీ అంతుచిక్కని బ్రహ్మ పదార్ధంగానే ఉంది. ఎలా చూసినా, ఎటుగా ఆలోచించినా కాంగ్రెస్‌కు సంబంధించి వేధిస్తున్న ప్రశ్నలకు జవాబు దొరకదు. ఇదంతా ఒక విధంగా ఏదో పొలిటికల్ థ్రిల్లర్ అనిపస్తుంది. మరో కోణంలో చూస్తే ముక్కోణపు కుటుంబ కథా చిత్రంలా కనిపిస్తుంది. కానీ, నిజమేమిటో, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియక పోవచ్చును. ఒక విధంగా ‘గజం మిధ్య పలాయనం మిధ్య’ అన్నట్లుగా ‘్ఫస్ట్ ఫ్యామిలీ సెంట్రిక్’గా నడుస్తున్న కథలో ప్రశ్నలే గానీ సమాధానాలు వెతుక్కోవడం అయితే అవివేకం కాదంటే అజ్ఞానం అనిపించుకుంటుంది. అలా అనిపిస్తోందని రాజకీయ విశే్లషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఒకటి మాత్రం నిజం కాంగ్రెస్ పార్టీ అంపశయ్యకు చేరింది. కాంగ్రెస్ కథ ముగింపును వెతుక్కుంటోంది. అందుకే సీనియర్, జూనియర్ నాయకులు అవశేష బంధాలను వదిలించుకునేందుకు ఎవరి పంథాలో వారు ప్రయత్నాలు సాగిస్తునారు. దింపుడు కళ్ళెం ఆశలలో కొందరుంటే, ఇంకొందరు తిలోదకాలకు నువవులు, నీళళు సిద్దం చేసుకుంటున్నారు. నిజానికి, ఇప్పటికే చాలా మంది చిన్న అవకాశం చిక్కినా ఇంచక్కా చెక్కేస్తున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి తమ దారి తాము చూసుకుంటున్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఎంతటి తీవ్ర స్థాయికి చేరిందో అర్థమవుతుంది.
హర్యానాలో నెల రోజుల క్రితం వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ తన్వర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్‌గా నియమించిన తన్వర్‌ను సోనియా గాంధీ తొలిగించారు. ఆయన స్థానంలో కుమారి సెల్జాలను పీసీసీ చీఫ్‌గా నియమించి, సీఎల్పీ పదవిని మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడాకు అప్పగించారు. అంతేకాదు, సోనియా గాంధీ హూడాకు దాసోహం అన్నారా? అన్నట్లుగా పార్టీ టికెట్ల కేటాయింపు, ప్రచారం.. ఇలా ఎన్నికల సర్వ హక్కులూ ఆయనాకే దఖలు పరిచారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొత్త కాదని అనుకున్నా, నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలో మొత్తం పదికి పది స్థానాలు బీజేపీ ఖాతాలో చేరిన నేపథ్యంలో అందరూ కలిసు న్నా కాంగ్రెస్ పార్టీ, మంచి ఊపు, ఉత్సాహం మీదున్న బీజీపీని ఎదుర్కోవడం అయ్యే పనికాదు. అలాంటిది ఇలా పై నుంచి కిందిదాకా కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటూ, తి ట్టుకుంటూ ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర లేదు. అందుకే, హర్యానాలో మళ్ళీ అధికారం కమల దళానిదే అని అందరికీ అర్థమై పోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు దక్కిం చుకుంటుందనే దాని మీదనే ఇప్పడు పందాలు పరుగులు తీస్తున్నాయి. మహారాష్టల్రో కూడా ఇదే సీన్. సీనియర్లు రాహుల్ అనుచరులకు మొండి చెయ్యి చూపిస్తున్నారని యంగ్ లీడర్స్ బజారున పడ్డారు. ముంబయ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు సంజయ్ నిరుపం అలక పానుపు ఎక్కారు. ‘ఐదూళళు కాదు, ఒకే ఒక్క సీటు అడిగాను, అదే లేదన్నారు... ఇక ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేయాలి’ అంటూ ప్రచారంలో పాల్గొనేది లేదని ఆయన ప్రకటించారు. ఇక మహా రాష్టల్రో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి చాలామంది సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాషాయం గూటికి చేరారు. మహారాష్టల్రోనూ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఓటమి ముందుగానే ఖరారై పోయింది.
మరో పదిరోజుల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో గుడ్ ఓల్డ్ పార్టీ పరిస్థితి ఇంత చక్కగా, ఇంత సుందర ముదనష్టంగా ఉంది కాబట్టే, సల్మాన్ ఖుర్షిద్ అంతటి సీనియర్ నాయకుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలిసినా, కడుపు చించుకోక తప్పలేదు. సల్మాన్ ఖుర్షిద్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రతిభగల న్యాయవాదిగానూ గుర్తింపు, గౌరవం పొందారు. ఈ అన్నిటినీ మించి ఫస్ట్ ఫ్యామిలీకి మరీ ముఖ్యంగా సోనియా గాంధీకి వీర విధేయుడు. అలాంటి ఆయన- తల్లీ కొడుకులు ఇద్దరికీ సమానంగా వాతలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దౌర్భాగ్య స్థితికి సమర్ధవంతమైన నాయకత్వం లేక పోవడమే ప్రధాన కారణమని కుండ బద్దలు కొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఇంతవరకు తెలుసుకోలేక పోయా మని, అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదని, ఈ జాప్యం కారణంగానే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని ఖుర్షిద్ తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీపార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. పార్టీ వ్యవహారాలు పట్టిం చుకోవడం లేదు. ఆయన స్థానంలో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నిక లేదా ఎంపిక ప్రక్రియ ఇంతవరకు ప్రారం భం కాలేదు. ఆమె తనని తానూ తాత్కాలిక అధ్య క్షురాలిగా చూస్తున్నారే గానీ, పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి నిలిపే పరిస్థితి లేదని ఖుర్షిద్ మర్మగర్భంగానే అయి నా పార్టీకి ఇక భవిష్యత్ లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరో వంక జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీ అత్మప రిశీలన చేసుకోవలసిన అవస రం ఉందని సల్మాన్ ఖుర్షిద్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీ భవించారు.
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓడి పోయిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వలన చేసిన తప్పులే చేస్తూ పతనాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు పరుగులు తీస్తోందని, పార్టీ నాయకులే కాదు రాజకీయ విశే్లషకులు కూడా కాంగ్రెస్ కథ కంచికి చేరినట్లే అన్న అభిప్రయాన్ని బాహాటంగా వ్యక్తప రుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందంలో లేని అవినీతిని ఉన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ప్రధాని మోదీని దొంగగ చిత్రిస్తూ, ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఊరు వాడ ఎగరేసుకుని తిరిగారు. ప్రజలు రాహుల్ గాంధీ ఆరోపణలను నమ్మలేదు సరికదా,ఆయన అ జ్ఞానాన్ని చూసి నవవుకున్నారు. కొర్రుకాల్చి వాత పెట్టారు. కేవలం 53 సీట్లు ఇచ్చి ఛీ కొట్టారు. అయినా, కాంగ్రెస్ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కాలేదులా ఉంది.
విజయదశమి రోజున ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి తొలి రాఫెల్ యుద్ద విమానాన్ని అధికారికంగా అందుకున్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, అదే రోజున వైమానిక దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని శస్త్ర పూజ నిర్వహించారు. అయితే, కాంగ్రెస్ నాయకులకు ఇది రు చించలేదు. రాజనాథ్ సింగ్ యుద్ద విమానానికి ఆయుధ పూజలు చేయడం ద్వారా లౌకిక పవిత్రకు భంగం వాటిల్లిందని గగ్గోలు పెట్టారు. దేశ ప్రజలందరూ రక్షణ మంత్రి శాస్త్రోక్తంగా పూజలు చేయడాన్ని స్వాగతించారు, సంతోషించారు. ఒక విధంగా గర్వగా ఫీలయ్యారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం,అసలు రాజనాథ్ సింగ్ ఫ్రాన్స్ వెళ్ళడం ఏమిటి? యుద్ద విమానాన్ని ఆయన తీసుకోవడం ఏమిటీ? అంటూ రాగాలు తీసారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ ఇదేమిటి? అంటూ ప్రశ్నించారు. ఆయనకంటే ఘనుడు- మల్లిఖార్జున ఖర్గే రక్షణ మంత్రి ‘తమాషా’ చేస్తున్నారని చిందులేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బోఫోర్సు శతఘు్నలు కొన్నప్పుడు ఎవరూ వెళ్లి పూజలు, గీజలు ఏమీ చేయలేదు, ఇప్పడు ఈ తమాషా ఏమిటీ? విజయదశమి రోజున ప్రతి హిందువు పవిత్రంగా చేసే ఆయుధ పూజను చులకన చేశారు. హిందువుల వి శ్వాసాన్ని క్వశ్చన్ చేశారు. దీనికి రాజనాథ్ సింగ్ స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. కానీ, తెలియకుండానే ఖర్గే ఏకంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగ ఒకే సారి రెండు సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారు. ఒకటి- హిందూ సంప్రదాయాల పట్ల కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదని చెప్పకనే చెప్పడం ద్వారా బీజేపీకి ఎన్నికల సమయంలో ఒక చక్కని అస్త్రాన్ని అందించారు.
సోషల్ మీడియాలో ఖర్గే వ్యాఖ్యలకు వచ్చిన స్పందన గమనిస్తే, రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్’ స్లోగన్ కంటే ఖర్గేజీ బబుల్ బ్రహ్మాండంగా గూబ గుయ్యిమనేలా చేసింది. ఇటు హర్యానా, అటు మహారరాష్టల్రో హిందూ సెంటి మెంట్ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు రాష్టాల్లో వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయి. ఓటమి మరింత దగ్గరవుతుంది. మరో వంక బోఫోర్సు కుంభకోణాన్ని ఖర్గే తెరపైకి తెచ్చారు. ఇది కూడా ఎన్నికల ప్రచారంలో కమ లనాథులకు పనికొచ్చే అంశమే అవుతుంది. పాత పురాణాలు, ముఖ్యంగా సోనియా , ఖత్రోచి లింకులు ప్రస్తావనకు వచ్చి సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేస్తోంది. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది, గతంలో ఇండియన్ నేవీకి చెందిన జల్సా నౌక జలప్రవేశం సమయంలో నెహ్రూ ప్రధాని హోదాలో పూజలు చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల వంచనను నెటిజన్లు ఎండగడుతున్నారు.
సోనియా గాంధీ జమానాలో ఇలా హిందూ విశ్వా సాలను చులకన చేయడం కొత్తేమి కాదు.. గతంలో రామసేతు విషయంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ‘రామసేతు’ అభూత కల్పన అని ఏకంగా కో ర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంకా అనేక సందర్భాలలో మైనారిటీలను బుజ్జగించేందుకు హిం దువుల మనోభావాలను దెబ్బ తీయడం, చులకన చేయడం సోనియా పార్టీకి అలవాటుగా అమరింది. అందుకే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గుళళు గోపురాలు పట్టుకుని తిరిగి, మెడలో నాలుగు దారపు పోగులు వేసుకుని, అదే యజ్ఞోపవీతం అని అందరికీ చూపుతూ తానూ జంధ్యం (యజ్ఞోపవీతం) ఉన్న శుద్ధ సోత్రీయ బ్రాహ్మణుడిని అని ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మలేదు. ఆయన్ని, ఆయన పార్టీని హిందూ వ్యతిరేక లౌకిక వాద పార్టీ గానే చూశారు. ఇప్పుడూ అంతే. ఇక ముందూ అంతే.. అందుకే కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరే సమయం వచ్చేసింది. పార్టీకి సోనియా నాయకత్వం వహించినా, రాహుల్ మళ్ళీ పగ్గాలు పట్టుకున్నా... చిట్టచివరి ఆశగా ప్రియాంకనే తెరపైకి తెచ్చినా.. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కాదు.. కనీసం మనుగడను నిలుపుకోవడం కూడా కాని పని అంటున్నారు రాజకీయ పండితులు.

-రాజనాల బాలకృష్ణ 99852 29722-