మెయిన్ ఫీచర్

కరుణామయి కమలాకర భారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరమరుగై దీన స్థితిలో వున్న ఒకప్పటి మేటి కళాకారులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో 2004 సంవత్సరంలో లలిత కళాభారతి అనే సంస్థను రూపొందించారు. ప్రతినెలా సాహిత్య పరిమళాలు అనే అంశంతో గ్రంథావిష్కరణలతో
పాటు, నాటకాలు, కవితల పోటీల, నృత్యప్రదర్శనలు, సంగీత కచేరీలు వంటి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘దినయామినే్య సాయం ప్రాతః శిశిర వసంతే పునరాయతః’ అని శంకర భగవత్పాదుల వారి వక్కాణం. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు క్రిమికీటాలు ఈ ప్రపంచంలోకి ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి. జన్మను సార్థకం చేసుకొని పది కాలాలపాటు ప్రజల హృదయాలలో పదిలంగా నిలబడగల ప్రత్యేకత కొంతమందికే సాధ్యం అవుతుంది. అలాంటివారి కోవకు చెందినవారే శ్రీమతి కమలాకర భారతిగారు.
వీరు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో చండ్ర గోపాలరావు, బసవపున్నమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. భారతిగారిది రైతు కుటుంబ నేపథ్యంగల జీవితం. భర్తగారి పేరు కమలాకర రావుగారు. చిన్నప్పటినుంచి భారతిగారికి సమాజంలోని బీదల యెడల, నిర్భాగ్యుల మీద కరుణ, దయ, మానవతా దృక్పథంతో కూడిన సేవా కార్యక్రమాలపట్ల ఎంతో శ్రద్ధ, నిబద్ధత ఉన్నవారు. పెద్ద చదువులు చదవకపోయినా తన వంతు సహాయ సహకారాలు ఆపన్నులకు అందించి మానవసేవే మాధవసేవ అనే చిత్తశుద్ధిని తన జీవితంలో అలవర్చుకున్నారు.
తాను చేసే సేవా కార్యక్రమాలు ఎక్కువమందికి అందాలనే ఉద్దేశ్యంతో భర్తగారి పేరుమీద ‘కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ సంస్థ’ను 1990లో ఉపాధ్యాయ దినమున తత్త్వవేత్త డా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినము అయిన సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్‌నందు ఏర్పాటుచేశారు. గత 30 సంవత్సరములుగా శ్రీమతి కమలాకర భారతిగారు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు అలుపెరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.
ఆపన్నులకు అభయహస్తం
దివిసీమలో సంభవించిన తుఫాను బీభత్సంలో నిరాశ్రయులైన 100 మంది కుటుంబాలకు నూతన వస్త్రాలు, వంట పాత్రలు, ఆహార ధాన్యాలు ఆనాటి దేవాదాయ మంత్రి సింహాద్రి సత్యనారాయణగారిచే పంపిణీ చేయించారు. అదేవిధంగా దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా తన వంతు సహాయ సహకారాల్ని కమలాకర ట్రస్టు ద్వారా అందిస్తున్నారు.
వృత్తి విద్యా కార్యక్రమాలు
నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచి స్వయం ఉపాధి కల్పించాలనే సత్సంకల్పంతో 1996లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను సరస్వతీ ఉపాసకులు శ్రీ దైవజ్ఞశర్మ మరియు ప్రఖ్యాత రచయిత్రి డా కె.వి.కృష్ణకుమారిగారిచే ప్రారంభించారు. అప్పటినుంచి 2001 సంవత్సరము వరకు దాదాపు 60 మంది పేద విద్యార్థినీ విద్యార్థులకు పిజి డిసిఎ సర్ట్ఫికెట్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇప్పించారు. వారిలో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రాగా మిగిలినవారికి స్వయం ఉపాధి పథకాలను ఈ సంస్థ ద్వారా ఏర్పాటుచేశారు.
వృద్ధులకు ఆసరా..
వివిధ కారణాలతో దిగువ మరియు మధ్యతరగతి ఆదాయ వర్గాలలో ఆలనాపాలనా చేసేవారు లేక అవస్థలు పడుతున్న వృద్ధులకు ఆసరా కల్పించాలి అనే సత్సంకల్పంతో 1999వ సంవత్సరంలో మహాత్మాగాంధీ వర్థంతి రోజున ‘మమతా వృద్ధాశ్రమము’ అనే కార్యక్రమాన్ని రూపుదాల్చారు. దీనిని ఆనాటి మహిళా శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ ప్రారంభించారు. ఆనాటినుంచి నేటివరకు అనేకమంది నిరాశ్రయులైన వృద్ధులకు వసతి మరియు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడమేగాక వారి శారీరక, మానసి ఉల్లాసం కొరకు వైద్య వసతులు, ఆధ్యాత్మ సత్సంగాలు, సాహిత్య సమ్మేళనాలు అలుపు ఎరుగకుండా నిర్వర్తిస్తున్నారు.
విద్యావ్యాప్తి
ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన విద్యను పొందలేని బాల బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలనే సదుద్దేశ్యంతో 2001 సంవత్సరంలో ఇంగ్లీషు మీడియంలో ‘వికాసభారతి’ అనేప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాల దినదినప్రవర్థమానమై నేడు 10వ తరగతి వరకు దాదాపు 300 మంది విద్యార్థులకు విలువలతోకూడిన విద్యను అందిస్తున్నది. కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా దేశభక్తి, దైవభక్తి కలిగి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషిచేస్తున్నది. అంతేగాకుండా విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఆటలు, పాటలు, నాట్యము మొదలగు రంగాలలో కూడా వీరికి శిక్షణావకాశాలు కల్పించబడుతున్నవి.
లలితకళలకు ప్రోత్సాహం
తెరమరుగై దీన స్థితిలో వున్న ఒకప్పటి మేటి కళాకారులను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో 2004 సంవత్సరంలో లలిత కళాభారతి అనే సంస్థను రూపొందించారు. ప్రతినెలా సాహిత్య పరిమళాలు అనే అంశంతో గ్రంథావిష్కరణలతోపాటు, నాటకాలు, కవితల పోటీల, నృత్యప్రదర్శనలు, సంగీత కచేరీలు వంటి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అవార్డుల ప్రదానం
వివిధ రంగాలలో నిష్ణాతులైనవారిని ఈనాటి తరానికి మార్గదర్శకులుగా పరిచయం చేసే కార్యక్రమాన్ని 2006లో ప్రారంభించారు. ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కమలాకర సేవారత్న అనే అవార్డును ఒక విశిష్ట వ్యక్తికి ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు ప్రదాన ప్రథమ సభకు అప్పటి కర్నాటక గవర్నర్ శ్రీమతి వి.ఎస్. రమాదేవి, అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ సురేష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇప్పటివరకు ఈ సత్కారాన్ని పొందిన ప్రముఖులు ఆనాటి జెఎన్‌టియు వైస్ ఛాన్సలర్ రాజగోపాల్, ప్రముఖ వైద్య నిపుణులు డా. గోపాలకృష్ణ గోఖలే, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత గాననిధి ఎల్.వి.గంగాధర శాస్ర్తీ, ఎ.పి.రావు, లయన్ గవర్నర్ అంబటి నటరాజు లాంటి వారు ఎందరో ఉన్నారు.
ప్రచురించి ఆవిష్కరించిన గ్రంథాలు
లుక్ కల్చరే కాని బుక్ కల్చర్ లేకుండా ఈ కాలంలో మానవీయ విలువలు కలిగి దేశభక్తి, దైవభక్తితో కూడిన దేశ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ నేటి తరానికి మార్గదర్శకంగా ఉండి పదికాలాలపాటు సమాజంలోనివారి మనోవికాసానికి, విజ్ఞానానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఉత్తమ గ్రంథాలను ప్రచురించి పదిమందికి పంచిపెడుతున్నారు.
ఈ పథకం క్రింద జీవన వికాసము, కృష్ణం వందే జగద్గురుం, మాతృవందనం, పాడవోయి భారతీయుడా, బాలసంజీవని, భారత్ జయహో, భారతంలో మహిళలు ఇత్యాది గ్రంథాలు ఆవిష్కరించారు. వీరికి జంటనగరాలలోని వివిధ సాంస్కృతిక సంస్థలచే కాకుండా దేశంలోని నలుమూలలనుంచి సన్మానాలు, అవార్డులు ఎన్నో స్వీకరించారు.
అనాథలను, పేదలను, నిర్భాగ్యులను తన సొంత కుటుంబ సభ్యులుగావించి వారికి తన సహాయ సహకారాలు అందిస్తూ హైదరాబాద్ మదర్ థెరీసా పేరుగాంచిన శ్రీమతి కమలాకర భారతిగారు వేయి వసంతాల వేడుకలు చేసుకొని అప్పటివరకు సమాజంలోని నిర్భాగ్యుల సేవకు అంకితం అయి తమ తల్లిదండ్రుల మరియు భర్తగారి జీవితములు ధన్యమయం చేస్తారని ఆశిద్దాం.

-జొన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497