మెయిన్ ఫీచర్

ఫోబియాలు ఎన్నేన్నో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూలుకు వెళ్లడానికి కొంతమంది పిల్లలు నిరాకరిస్తారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అనేదానికి పెద్దగా కారణాలేమీ ఉండవు. కొంచెం పెద్దయినవారు రకరకాల కారణాలు చెబుతారు. వీటిలో కొన్ని నమ్మశక్యంగా ఉండవు. కొన్ని సహేతుకంగానే ఉంటాయి. స్కూలుకెందుకు వెళ్ళవు అని పెద్దలు నిలదీసినపుడు, వీరి భయానికి సాక్ష్యాలుగా శారీరకంగా కొన్ని మార్పులు మనం గుర్తించగలుగుతాము. వారిలో ఆందోళన కనిపిస్తుంది. ఇంకా తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు అవడం, డయేరియా, కడుపునొప్పి, కండరాల నొప్పి, బలహీనంగా ఉండటం, వణుకుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పిల్లల్ని ఇంటివద్ద ఉండేందుకు అనుమతించగానే ఈ లక్షణాలన్నీ క్రమంగా అదృశ్యమైపోతాయి. ఏ వయసులోనైనా పిల్లలకు స్కూలు ఫోబియా రావచ్చు. కానీ చాలామంది విషయంలో ఈ స్కూలు ఫోబియా ప్రాథమిక పాఠశాలనుండి, ఉన్నత పాఠశాలకు మారే సమయంలో వస్తుంటుంది. అంటే పిల్లలకు పదకొండు, పనె్నండు సంవత్సరాల వయసులో ఈ ఫోబియా వస్తుంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మిగిలిన ఫోబియాలకు భిన్నంగా ఈ స్కూలు ఫోబియా ఆడపిల్లలకంటే మగ పిల్లల్లోనే ఎక్కువగా ఉంటోంది.
స్కూలుకు వెళ్ళడంవలన ఎన్నో లాభాలు ఉంటాయని, ఎవరివల్ల ఏవిధమైన ఇబ్బంది ఉండదని పిల్లల్లో ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందేటట్లు వారికి నైతిక బలాన్ని చేకూర్చాలి. అవసరమైతే కొంత సమయం పిల్లలతోబాటు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు స్కూలుకెళ్లి తమ బిడ్డకు కావలసిన మనోధైర్యాన్ని సమకూర్చాలి. క్రమక్రమంగా బిడ్డలో స్కూలు ఫోబియా కనుమగరువుతుంది. కొంతమందికి స్కూలు ఫోబియా పోగొట్టడానికి వీడియో చిత్రాల ద్వారా పాఠశాలకువెళితే ఎలా విద్యను నేర్చుకోవచ్చో తెలియజేసే సన్నివేశాలను చూపించి మానసిక బలాన్ని చేకూర్చాలి.
అమ్మాయిల వెంటబడే మనస్తత్వంగల అబ్బాయిలు ఉంటారు. అదేవిధంగా అమ్మాయిలన్నా, ఆడవారన్నా వ్యతిరేక ధోరణిలో దూరంగా పారిపోయే వారు కూడా ఉంటారు. అంటే వారికి ఆడవారంటే ఫోబియా, ఆడవారంటే భయం లేదా అంతర్గత ద్వేషం వల్ల అలా ప్రవర్తిస్తుంటారు. దీనిని గైనోఫోబియా అంటారు. మగవారిని చూస్తే దూరంగా పారిపోయే లక్షణాలుగలవాళ్ళుంటారు. ఈ విధంగా భయం లేదా సిగ్గుతో దూరంగా వుండే లక్షణాన్ని ఆండ్రోఫోబియా అంటారు. తమాషా ఏమిటంటే, మనిషి మనిషికి మనసు స్పందన, ప్రతిస్పందన తేడాగా ఉంటుంది. అసలు ఈ సృష్టిలో అత్యంత మనోహరమైనది మనిషి మనసే.
కోటీశ్వరుడైనా ఎక్కడికైనా వెళితే, అక్కడి వస్తువు ఏదైనా తస్కరించి తెచ్చుకునే మనస్తత్వంగలవారుంటారు. ఇటువంటివారు ఏ ఫంక్షన్లకైనా వెళితే కనీసం ఓ చెంచా అయినా దొంగిలించి పట్టుకుపోతారు. అలా చేయలేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. ఓ హిందీ నటి తాను ఏ హోటలులో దిగినా అక్కడినుండి ఏదో ఒక వస్తువు దొంగిలించడం జరుగుతుందని ఆమె పత్రికలకు, మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇలా దొంగతనం చేసే నైజాన్ని ‘క్లెఫ్టోమేనియా’ అంటారు.
దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే మానసిక నైజం మరికొంతమందిలో ఉంటుంది. వీరికి తమ మీద తమకు నమ్మకం ఎక్కువగా ఉండదు. అంటే ఏదైనా ఫంక్షన్‌కు వెళితే, ఏదైనా వస్తువు తాను తస్కరించడం జరుగుతుందేమోనని భయపడతారు. అందుకే వీరు ఒంటరిగా వస్తువులు వున్న ప్రాంతానికి వెళ్ళరు. నగలదుకాణం, ఫ్యాన్సీ షాపులు, పుస్తకాల షాపు వంటి వాటి వద్దకు ఒంటరిగా వెళ్ళరు. నలుగురితో కలిసి వెళ్లి, మళ్లీ వారితో తిరిగి వచ్చేస్తుంటారు. ఎక్కడైనా, ఎవరింటికైనా వెళ్లినపుడు తాము ఎక్కడ పొరపాటున పరాయివాళ్ళ సామాన్లు దొంగిలించి పట్టుకు వచ్చేస్తామో అనే భయం కొంతమందిలో వుంటుంది. ఇలాంటివారు సాధ్యమైనంత వరకూ ఇతరులతో కలిసి వెళుతుంటారు. ఇటువంటి భయాన్ని క్లెప్ట్ఫోబియా అంటారు.

- పి.ఎం. సుందరరావు 9490657424