మెయిన్ ఫీచర్

బైక్‌పై 4,500 కిలోమీటర్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణం చేయాలంటే దగ్గరైతే ఆటో, క్యాబ్ లేదా బైక్‌ను ఉపయోగిస్తాం.. అదే ప్రయాణం కాస్త దూరమైతే బస్సును ఎంచుకుంటాం.. మరికాస్త దూర ప్రయాణమైతే రైలు.. లేదా డబ్బులు ఎక్కువుంటే విమానంలో వెళతాం.. అంతేకానీ వేల కిలోమీటర్ల ప్రయాణానికి బైక్‌ను ఎవరైనా ఉపయోగిస్తారా? ఈ ఇద్దరు అమ్మాయిలు మాత్రం ఉపయోగిస్తారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,500 కిలోమీటర్ల దూరం.. బైకుల పైనే.. ఇద్దరు అమ్మాయిలు.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని లేహ్ వరకు.. కేవలం గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంలా కాకుండా.. ఆ ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ.. కేవలం 129 గంటల్లో ప్రయాణాన్ని పూర్తిచేసి లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన స్వేచ్ఛా పక్షులు ఆ ఇద్దరమ్మాయిలు.. వారే బెంగళూరుకు చెందిన అమృతా కాశీనాథ్, శుభ్ర ఆచార్యలు.. వీరికి బైక్ రైడ్ చేయడం కొత్తేమీ కాదు.. ఇంతకు మునుపు కూడా వీరు అమ్మాయిలకోసం బైక్ రైడ్స్ చేశారు. వీరి లక్ష్యం ఒక్కటే.. నేటి మహిళల ఆలోచనా తీరు మార్చాలి అనేదే వీరి ధ్యేయం.
మొదలు ఇలా..
నేటి ఫాస్ట్ యుగంలో కూడా చాలామంది మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయడానికి భయపడతారు. అందుకని వారికి తోడుగా తండ్రో, భర్తో, అన్నో, తమ్ముడో.. వెళుతుంటారు. నేడు భారతదేశంలో ఉన్న పరిస్థితుత్లో అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమేనా? అన్న అనుమానం చాలామంది అమ్మాయిల్లో ఉంది. అలాగని సొంత బండిలో ప్రయాణం చేస్తారా? అనుకుంటే.. వారికి బైక్ ఎక్కాలంటేనే భయం. వీటన్నింటినీ గమనించిన శుభ్ర విశ్వనాథ్.. స్ర్తిలలో ఉన్న ఈ భయాన్ని పోగొట్టి.. వారిలో ప్రయాణాలంటే వారికి ఆసక్తిని కలిగించాలని తన స్నేహితురాలైన అమృత సాయం తీసుకుంది శుభ్ర. మొదట శుభ్ర ఒంటరిగానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2010లోనే శుభ్ర బైక్‌పై ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. అయితే వృత్తిరీత్యా మొదట వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అంతా బానే ఉన్నా తన ధ్యాసంతా బైక్ ప్రయాణాలపైనే ఉండేదట. దీంతో బాగా నడుస్తున్న వ్యాపారాన్ని వదిలి మోటార్ సైకిల్ టూర్లను ఏర్పాటుచేసే ‘ట్రావెలింగ్ సర్కన్’ సంస్థను ప్రారంభించింది. ఈ క్రమంలో భర్తతో కలిసి 2017లో 45 రోజుల పాటు బెంగళూరు నుంచి భూటాన్ వరకు బైక్‌పై ప్రయాణం చేసింది. ఈ ఒక్క ప్రయాణంతో తన మనస్సులో ఉన్న భయాలన్నింటినీ పోగొట్టుకుంది శుభ్ర. ముందుగానే తను ప్రయాణం చేసే మార్గం గురించి నెట్‌లో రీసెర్చ్ చేసేది. అలాగే రాత్రుళ్లు ప్రయాణం చేయకుండా, స్థానికంగా ఉన్న గొడవల్లో తలదూర్చకుండా, మార్గమధ్యంలో ఏదైనా గొడవ జరిగినా దారి మరల్చుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలని.. తనకు తానే కొన్ని నియమాలను పెట్టుకుంది. ఇలా ప్రయాణిస్తే బైక్ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది అనుకుంది శుభ్ర.
స్నేహితురాలితో కలిసి..
అమృత, శుభ్రలు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ఆలోచనాధోరణి ఒకలాగే ఉంటుంది. దాంతో ఒకానొకరోజు తన కోరికను స్నేహితురాలి ముందు ఉంచింది శుభ్ర. శుభ్ర కోరికకు అమృత ఊతమిచ్చింది. ముందు నుంచీ అమృతకు కూడా ప్రయాణాలంటే ఇష్టమే.. కానీ కార్లలోనే ఎక్కువగా తిరిగేది. ఒకసారి అమృత బెంగళూరు నుండి సిక్కిం వెళ్లిన తరువాత ఒంటరిగా లక్ష్యద్వీప్‌కు వెళ్లిందట. తరువాత ఒకరోజు గుజరాత్ నుండి బెంగళూరుకు బైక్‌పై ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిందట. అలా మోటార్ సైకిల్‌పై ఒంటరిగా వెళ్లడంతో తనకు బైక్‌పై అమితాసక్తి కలిగిందట. అప్పటినుంచే ప్రతి విషయంలో భిన్నంగా ఆలోచించడం మొదలైంది అంటోంది అమృత. అలా వీరిద్దరూ బైక్ రైడింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ బైక్ రైడింగుకు ముందే వీరిద్దరూ కలిసి బైక్‌పై దేశవ్యాప్తంగా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా చుట్టొచ్చారు. ఈ ప్రయాణంలో శ్రీలంక, భూటాన్‌లు కూడా ఉన్నాయి. ఇలా బైక్ ప్రయాణాలు చేయడం వల్ల కొత్త వ్యక్తుల గురించి, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారి ఆలోచనల్లో పరిణితి కనిపిస్తుంది.. అంతేకాదు ఇలా అమ్మాయిలు బైక్‌పై వెళ్లడం అనుకున్నంత ప్రమాదం ఏమీ కాదని తమ ప్రయాణాల ద్వారా నిరూపిస్తున్నారు ఈ అమ్మాయిలు.
ఇంతకు మునుపు
గతంలో ఇద్దరు మహిళలు లేహ్ నుండి కన్యాకుమారి వరకు 150 గంటల్లో బైక్‌పై ప్రయాణించి రికార్డు సృష్టించారట. ఈ విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు స్నేహితులు కన్యాకుమారి నుంచి లేహ్ వరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆ రికార్డును బ్రేక్ చేద్దామన్న పట్టుదలతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే 129 గంట ల్లో తమ గమ్యాన్ని చేరుకున్నారు. ఇందుకు వారు కేటీఎం డ్యూక్ 390 బైకులను వాడారు. ఇద్దరూ ఒకే రకం బైకులు వాడటం వల్ల ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు స్పేర్ పార్ట్స్‌కోసం ఇబ్బంది వచ్చేది కాదట. అంతేకాదు 70 శాతం మహిళా ఉద్యోగులు కలిసి ‘్ఫలాడా ప్యూర్ అండ్ ష్యూర్’ అనే సంస్థ కూడా వీరికి స్పాన్సర్‌గా మంచి సపోర్ట్ ఇచ్చారట. వీరిద్దరి మాటల ప్రకారం ఈ ప్రయాణం వీరికి సరికొత్త కిక్ ఇచ్చిందనిపిస్తోంది. కానీ దీనికోసం వీరు చాలానే కష్టపడ్డారు. రోజుకి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అతి కష్టంగా నిద్రను ఆపుకుంటూ గమ్యంవైపు సాగారు. ఇక లఢాఖ్ వద్ద ‘తంగ్లాంగ్ లా’ అనే పర్వత ప్రాంతాన్ని దాటేటప్పుడు ఈదురు గాలులు, పెద్ద వర్షం.. ఇంత వ్యతిరేక వాతావరణంలో కూడా వారు తమ ప్రయాణాన్ని ఆపలేదు. అంత పెద్ద వర్షాన్ని దాటుకుని వెళ్లడం పెద్ద సవాల్‌గా మారినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు ఈ ఇద్దరు స్నేహితులు. అయితే ఇలాంటి సమస్యలన్నీ తమకెదురైన మనుషుల ఆప్యాయత ముందు పెద్ద కష్టాలుగా అనిపించలేదని చెబుతారు వీరు. అందుకే తమలా ఒంటరిగా ప్రయాణం చేయాలనుకునే మహిళలకు వారు ఒకటే చెబుతారు.. ‘మహిళలు ముందుగా తమ మెదడులోని భయాలన్నింటినీ చెరిపేయాలి. ఒక్కసారి ఆ భయాలను దాటుకుని ముందడుగు వేస్తే.. ఇక వెనకడుగు ఉండదు. ఎక్కడికైనా వెళ్లాలంటే మగవారి తోడు కోసం చూడనవసరం లేదు. ఎవరో ఏదో అంటారని, ఏదో చేస్తారని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. సానుకూల దృక్పథం ఉంటే మనం సందర్శించే ప్రతి ప్రదేశం అతి సుందరంగా ఉంటుంది’ అని చెబుతున్నారు ఈ ఇద్దరు స్నేహితులు. ఏదేమైనా అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుని లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కిన వీరిద్దరి సాహసానికి జయహో అనక తప్పదు మరి!