మెయిన్ ఫీచర్

బామ్మ వేసిన పెయింటింగ్స్ మిలాన్‌లో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు జుడయ్య బైగా..
వయస్సు 80 సంవత్సరాలు..
ఊరు మధ్యప్రదేశ్‌లో లోర్హా గ్రామం..
ఇంత పెద్ద వయస్సులో కూడా అద్భుతమైన బొమ్మలు గీస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ బామ్మ. అవునండీ.. నిజం.. భారతదేశంతో పాటు విదేశాల్లోని అనేక ఆర్ట్ గ్యాలరీలలో ఈమె వేసిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇటలీలోని మిలాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఈ బామ్మ వేసిన బొమ్మలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ బామ్మ జీవితంలో చాలా విశేషాలే ఉన్నాయి.. అవేంటో చూద్దామా..
జుడయ్య బైగా లోర్హా గ్రామానికి చెందిన గిరిజన మహిళ. చిన్నవయస్సులోనే ఈమెకు పెళ్లయింది. బైగాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. జీవనోపాధి కోసం వీరు అటవీ వనరులపై ఆధారపడతారు. బైగా నలభై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే భర్తను కోల్పోయింది. తరువాత పొలంలో పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె ఇద్దరు కుమారులు కూడా ఏదో చిన్న చిన్న పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బైగా కూతురికి కూడా ఇటీవలే పెళ్లి జరిగింది. బైగా 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆ ఊరికి ఆశిష్ స్వామి అనే వ్యక్తి వచ్చారు. ఆయన స్థానిక సంస్కృతులు, సాంప్రదాయాలు అంతరించిపోకుండా ఉండటానికి ‘జన్‌గన్ తస్వీర్‌ఖానా’ అనే స్టూడియోని మధ్యప్రదేశ్‌లోని అనేక గిరిజన గ్రామాల్లో నెలకొల్పాడు. మన భారతదేశమంతటా గొప్ప సంస్కృతులు అనేకం ఉన్నాయని, అవి చనిపోయే అంచున ఉన్నాయి. వాటిని రక్షించడానికి సమర్థవంతమైన గొప్ప సాధనం చిత్రలేఖనం అని నమ్ముతాడు ఆశిష్ స్వామి. చిత్రలేఖనం ద్వారా స్థానిక పద్ధతులు, ఆచారాలను, సాంప్రదాయాల గురించి ఇతరులకు, మరో తరానికి తెలియజేయ పూనుకున్నాడు స్వామి. అందుకోసం కొందరు గిరిజన మహిళల్ని ఎంచుకున్నాడు. అందులో బైగా కూడా ఉన్నారు. స్వామి ఈ గిరిజన మహిళలందరికీ ఉచితంగా చిత్రలేఖనం వేయించడం నేర్పించారు. డెబ్భై సంవత్సరాల వయస్సులో ఏమాత్రం బెరుకులేకుండా ఆమె చిత్రలేఖనం నేర్చుకున్నారు. ముందుగా క్లాత్‌పై చిత్రలేఖనం వేయడం నేర్చుకుంది. మొదట చిత్రలేఖనాన్ని చెట్టుతో ప్రారంభించిన బైగా పోను పోను అడవి జంతువులలోని అమాయకత్వాన్ని, ప్రకృతిలోని ప్రశాంతతను, పరిపూర్ణతను, చెట్లు, జంతువులు, పక్షులు, నీటి వనరులు, మనుషుల మధ్య ఉండే సామరస్యం వంటి ఎన్నింటినో తన చిత్రలేఖనం ద్వారా పొందుపరిచేది. పనులు చేసి చేసి అలసిపోయిన ఆ శరీరం విశ్రాంతి తీసుకుందామనుకోలేదు.. చిత్రలేఖనంలోని విశ్రాంతి పొందుదామనుకుంది.. అందుకే పెయింటింగ్‌లోని ఎన్నో మెలకువల్ని అలవోకగా నేర్చేసుకుంది. ‘దీనికి వయస్సు, కీర్తితో సంబంధం లేదు. నేను చిత్రలేఖనంలో ఒక పక్షిలా, స్వేచ్ఛగా విహరిస్తున్నాను’ అని చెబుతుంది బైగా. వాటిని స్వామి దేశ, విదేశాల్లో జరుగుతున్న ఎగ్జిబిషన్స్‌కు, ఆర్ట్ గ్యాలరీలకు పంపుతారు. అలా ఆమె పెయింటింగ్స్ ఇప్పుడు దేశ, విదేశాల్లో తిరుగుతున్నాయి. వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఆమె చాలా సంతృప్తిగా ఉంది బైగా. ఏది ఏమైనా ఎనభై సంవత్సరాల వయస్సులో ఎంతో ఓపికగా, అందంగా పెయింటింగ్స్ వేస్తున్న ఈ బామ్మకు హాట్సాఫ్ చెప్పాల్సిందే..