మెయిన్ ఫీచర్

‘లిటిల్ పర్సన్’ కోరిక తీరేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీడ్ బుర్కీ ఓ రచయిత్రి..
ఓ విద్యావేత్త..
ఓ న్యాయవాది..
వీటన్నిటితో పాటు సినీడ్ ఒక మరుగుజ్జు కూడా.. కానీ ఆమెకు మరుగుజ్జు అనడం ఇష్టం ఉండదు. ఆమె గురించి ఎవరైనా చెప్పేటప్పుడు లిటిల్ పర్సన్ అంటే బాగుంటుందంటారు ఆమె. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ భవనాలు, దుస్తులు, జీవితం అన్నిటిపైనా సమాన హక్కులు ఉండాలంటారామె. అందుకే ఆమె ఊహిస్తున్న భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుంది. గతకాలపు అణచివేతలు, అభివృద్ధికి దూరం చేయడాలు, వివక్షకు తావులేని సమాజాన్ని కోరుకుంటోంది. ఇలాంటి సినీడ్ బుర్కీ ఫొటో బ్రిటీష్ వోగ్ మ్యాగ్‌జైన్ ముఖచిత్రంగా ప్రచురితమైంది. అయినా ఆమెకు సంతోషం లేదు. ఈ ప్రపంచంలో సమానత్వాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతోంది సినీడ్.
సినీడ్ మరుగుజ్జు. ఆమె తండ్రి కూడా మరుగుజ్జే.. కానీ సినీడ్ తల్లి, అక్కచెల్లెళ్లు, సోదరుడు మరుగుజ్జులు కారు. తోబుట్టువులందరిలోనూ తనే పెద్దదైనప్పటికీ వారిలా తనకు కావలసిన దుస్తులు దొరకడం లేదని ఆమె గమనించింది. వారికి రకరకాల రంగుల్లో, డిజైన్లలో దుస్తులు దొరుకుతుంటే తనకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. అది ఆమెకు అన్యాయంలా అనిపించింది. అలాగే కుర్చీలు, దుకాణాల్లోని కౌంటర్లు, లాకర్లు, చివరకు వాష్ బేసిన్లు.. ఇలా ఏవీ తనలాంటివారికి అనుకూలంగా డిజైన్ చేసినవి కాదని తెలుసుకుంది. ఆమె పరిమాణం ఆధారంగా ఇతరులు ఆమె గురించి ఏమనుకుంటున్నారన్నది కూడా తెలుసుకోవడం ఆమెకు సవాల్‌గా కనిపించింది. ఆ భావనను తెలుసుకుని, దాన్ని తొలగించడాన్ని ఆమె తన బాధ్యతగా తీసుకుంది. అందుకే సినీడ్ మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉండబోయే ప్రతి ఒక్కరినీ ఆమె పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారు.
దుస్తులే కవచంగా..
మనకు ఏదైతే దొరకదో దానిపైనే ఎక్కువ మోజు ఉంటుంది. సినీడ్‌కు కూడా చిన్నప్పటి నుంచీ రంగురంగుల దుస్తులు వేసుకోవాలన్న కోరిక ఉండేది. అది ఫ్యాషన్‌పై ఆసక్తి కలిగేలా చేసింది. ఫ్యాషన్‌పై అంత ఆసక్తి ఉన్నా ఏవీ వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ డిజైన్లన్నీ తనకోసం కాదని అంటుంది సినీడ్. అప్పుడే సినీడ్ ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ‘నేనెంత ఎత్తున్నానన్న అంశంతో సంబంధం లేకుండా బతకగలిగే ప్రపంచం అది. అక్కడ నేనెవరన్నది నా వాదనా పటిమే చెబుతుంది. చిన్నప్పుడు ఫ్యాషన్ రంగానికి నాలాంటివారు మినహాయింపని భావించాను. చివరికి.. అదే నా కెరీర్ ఎందుకు కాకూడదని 29 సంవత్సరాల వయస్సులో అనిపించింది’ అని చెబుతోంది సినీడ్. ఆన్‌లైన్లో చాలా ధైర్యంగా తనకు నచ్చిన, మెచ్చిన వ్యక్తులతో ధైర్యంగా మాట్లాడేది. సినీడ్ ఎదిగేకొద్దీ తనలాంటివారు ప్రపంచంలో ఇంకెవరున్నారో తెలుసుకోవాలన్న తాపత్రయంతో పుస్తకాలు, పత్రికలు, ప్రకటనల్లో ఎప్పుడూ వెతుకుతూ ఉండేది. స్కూళ్లల్లోనూ, కాలేజీల్లోనూ.. చివరికి రాజకీయాల్లో కూడా తనలాంటివారికోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉండేది సినీడ్. ఆమె అనే్వషణ్ కొద్దివరకూ ఫలించినా ఆమె అటు ఫ్యాషన్ రంగంలోనూ, ఇటు నెట్టింట్లోనూ మంచి వక్తగా పేరు సంపాదించుకుంది. ఒకానొకరోజు వోగ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా మారిపోయింది సినీడ్. ఇది జరిగిన తరువాత చాలామంది మరుగుజ్జులు సినీడ్ చిత్రమున్న వోగ్ మ్యాగజైన్ పట్టుకుని ఫొటోలు దిగి ఆమెకు పంపించారు. ఇదంతా చూసిన సినీడ్ ఎంతగానో సంతోష పడింది. తన అడుగుజాడల్లో నడిచే మరో మరుగుజ్జు రావడానికి శతాబ్దాలు పట్టదు. ఆ రోజులు చాలా త్వరలోనే ఉన్నాయని చెబుతోంది సినీడ్. అంతేకాదు.. నేడు ఫ్యాషన్ రంగం దృష్టి కూడా మారిపోతోంది. ఆమెలాంటివారికి ఫ్యాషన్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు సినీడ్ వార్డ్‌రోబ్‌లో క్రిస్ట్ఫోర్ కేన్, గుచీ, గివెన్చీ, స్టెల్లా మెక్‌కార్ట్‌నీ, బుర్‌బెర్రీ బ్రాండ్ వస్త్రాలున్నాయి. ఇటీవల సినీడ్ ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, చర్చిలను సందర్శించారు. ఆ సందర్భంగా సమ్మిళిత ప్రాతినిధ్యంపై సినీడ్ మాట్లాడుతూ.. ‘గొప్ప దుస్తులు వేసుకోవడం నా లక్ష్యం కాదు. ఇవి ఒకప్పుడు మాకు అందుబాటులో లేనివి. కానీ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. మీరు నిజంగా సమాజాన్ని మార్చాలనుకుంటే.. మొదట మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రయాణం సులభమైంది కానీ విమానాలు, విమానాశ్రయాల్లో తనలాంటి వారికి కావలసిన సౌకర్యాలు లేవు. విమానం సీట్లో తనకు తాను కూర్చోలేకపోవడం నుంచి టాయిలెట్ తలుపుపై ఉన్న తాళాన్ని అందుకోలేకపోవడం, తమ సామాగ్రిని పైన పెట్టలేకపోవడం వంటివన్నీ అందరికీ చిన్న చిన్న సమస్యల్లా కనిపిస్తాయి కానీ మా దృష్టిలో అవి చాలా చాలా పెద్ద సమస్యలు. అనేక విమానాశ్రయాల్లో వైకల్యంతో ఉన్నవారికి సేవలందించడానికి వసతులు, సిబ్బంది ఉన్నారు. అది మంచిదే.. కానీ అదే సమయంలో డిజైన్ విషయంలో సాధారణ వ్యక్తులకు, మరుగుజ్జులకు మధ్య అంతరాన్ని తొలగించే ప్రయత్నమూ వేగవంతం చేయాలి’ అంటోంది. సినిడీ కోరుకున్న.., అందరికీ సమాన అవకాశాలు ఉండి, వివక్ష లేకుండా ఉన్న ప్రపంచం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.
*