మెయిన్ ఫీచర్

తరిగిపోతున్న పర్యావరణ స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు అభివృద్ధి చెందుతున్నా కొద్ది లాభాలతోపాటు నష్టాలను కూడా మనుషులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు సమస్తం కాలుష్యమయం. తినే తిండి, గాలి, నీరు అన్ని కాలుష్యాలే. కొన్ని సహజంగా ఏర్పడితే మరికొన్ని మానవ తప్పిదాలు.. అలాంటి తప్పిదాల్లో ఒకటి ప్లాస్టిక్ వాడకం. ఇంతగా అభివృద్ధి చెందనికాలంలో ప్లాస్టిక్ లేకుండానే జీవితాన్ని కొనసాగించేవారు. ఈ ప్లాస్టిక్ వాడకం తయారీ ఎంతగా జనాల్లోకి వెళ్లిదంటే ప్లాస్టిక్ లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేనంతగా. వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త అంతా భూమిలోపల కొన్ని వేల సంవత్సరాలు ఉండీ పర్యావరణానికి చేటు చేస్తుంది. నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఒక విడదీయరాని అవసరం. దాన్ని దాటుకొని ముందుకు పోలేని స్థితి.
సగటున ప్రతి వ్యక్తి ఒక పాలిథీన్ సంచిని చెత్తబుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్ల పైమాటే? అన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి? మట్టిలో, నీళ్ళలో, ఎడారిలో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో.. ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఆ వ్యర్థం కొండలా పేరుకుపోయి, కొండచిలువలా మానవ జాతిని కబళిస్తోంది. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్ర్తియంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వంసమైంది.
మన అవసరాలను తీర్చుకునే క్రమంలోప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన మనకుండాలి. పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో, సమకాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలి. జీవితంలో ప్లాస్టిక్ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునేవరకు ఇంటా, బయటా ఎన్నో అవసరాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌బ్రష్‌లు, వాటర్ బాటిల్స్, టిఫిన్‌బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, షాంపులు, పాలు, వంటనూనె ప్యాకెట్లు, తలనూనె, ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే. ఆశ్చర్యమేమంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్ బాటిల్స్, రక్తం భద్రపరచే సంచులు, ఇంజెక్షన్ సీసాలు, సిరంజీలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే వాటిల్లో ప్లాస్టిక్ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా, నిర్లక్ష్యం, బద్ధకంవల్ల విపరీతంగా ప్లాస్టిక్‌ను వాడుతున్నాం.
ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారుచేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో ప్లాస్టిక్‌తో తయారుకాబడని వస్తువంటూ ఏదీ లేదు. స్వతహాగా ప్లాస్టిక్ విషపూరితం కాదు, ఆరోగ్యానికి హానికరం అంతకన్నా కాదు. కాని వాటి వ్యర్థ పదార్థాలవలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు.
ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడంవలన జరిగే సమస్య, వ్యర్థపదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణం. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాలు కాలుష్యం మొదలైన వాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాలవల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టమ్‌లోకి వెళ్ళి వాటిని మూసివేయడంవలన అశుభ్రమైన వాతావరణాన్ని కలుగజేసి, నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలుగజేస్తాయి. పునర్వినియోగం / రంగుల ప్లాస్టిక్ సంచులు భూమిలోనికి ప్రవేశించి మట్టిని, మరియు ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలను కలిగి ఉండవచ్చు. మిగిలిపోయిన ఆహారం కలిగివున్న లేదా ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసిపోయి వున్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడంవలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని మరియు చొచ్చుకుపోనీయని స్వభావంగల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగుపరచడానికి మరియు పాడేయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను మరియు ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను అగ్నిమాపకాలని మరియు పిగ్‌మెంట్లను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యంమీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
ఇక మనం నిత్యం వాడే ప్లాస్టిక్‌ని జనాలు వివిధ రకాలుగా ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి కర్రీ పాయింట్ వాళ్ళు వేడి వేడి కూరలని, సాంబార్, రసం లాంటి వాటిని ప్లాస్టిక్ సంచులలో కట్టేసి ఇస్తున్నారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి ఆహార పదార్థాలతో కలిసి, దాన్ని తినటంవల్ల ఎన్నో వ్యాధులను వొంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చా?
కొంచెం పర్యావరణ స్పృహ, మరికొంత బాధ్యతగా వ్యవహరిస్తే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా చాలావరకూ తగ్గించవచ్చు. పెళ్లిళ్లు, ఇతర విందుల్లో ప్లాస్టిక్ పళ్లాలు, గ్లాసులు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరాకులు అరటి ఆకులు, కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి!
ప్లాస్టిక్ వినియోగంపై ఎవరికివారు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు, కిరాణా షాపుల్లో సామాన్లు కొనేటపుడు ప్లాస్టిక్ సంచులు అడుగకుండా ఇంటినుంచి బట్ట, జ్యూట్ సంచులు తీసుకెళ్ళడం ఉత్తమం.
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా క్లాత్ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి మరియు ఆర్థికపరమైన ఇనె్సంటివ్‌లతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి. మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది.
40 మైక్రాన్ల కన్నా తక్కువగా ప్లాస్టిక్ సంచుల వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్య సమస్యలు, పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్ సభ్యులను, కాలనీలను ప్రోత్సహించాలి. అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్ మహమ్మరి నుంచి మనల్ని మనం రక్షించుకోగలం.

-పుష్యమీ సాగర్ 90103 50317