మెయిన్ ఫీచర్

మలి వయస్సు అందగత్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాభై ఎనిమిదేళ్లు..
అంటే రిటైర్‌మెంట్ అయ్యే వయస్సు. కష్టపడింది చాలు.. ఇక ఇంటికి వెళ్లి ప్రశాంతంగా బతకండి అని చెప్పే వయస్సు. కానీ ఈ వయస్సులో అనేక మిరాకిల్స్ చేసేస్తున్నారు నేటి మహిళలు. ఈమె పేరు షెల్లీ రీన్. 60కి చేరువవుతున్న కొద్దీ జీవితాన్ని మరింత కొత్తగా మలచుకుంది. ఈ వయస్సులో కూడా అందంలోనూ, ఫిట్‌నెస్‌లోనూ పాతిక సంవత్సరాల అమ్మాయిలతో పోటీపడుతూ అందాలపోటీలో పాల్గొన్న సుందరీమణులందరికీ సవాల్ విసురుతోంది. ఈ క్రమంలోనే నలభై సంవత్సరాలు దాటిన మహిళలకోసం దిల్లీలో నిర్వహించిన ‘క్లాసిక్ బ్యూటీ వరల్డ్ ఇంటర్నేషనల్’ టైటిల్ గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే..
అందరి మహిళల్లాగా వయస్సులోనే షెల్లీకి పెళ్లి జరిగింది. పెళ్లితో ఆ ప్రయాణం మలుపు తిరిగింది. షెల్లీ దాంపత్య జీవితం అనుకున్నంత ఆనందంగా సాగలేదు. అతి కష్టంపై భర్తతో తొమ్మిది సంవత్సరాలు కలిసి జీవించాక ఇక తప్పదని విడాకులు తీసుకుంది. ఈ పెళ్లి ప్రయాణంలో షెల్లీకి ఓ కుమారుడు మ్యాథీవ్. షెల్లీకి, మ్యాథీవ్‌కి షెల్లీ తల్లి అండంగా నిలిచింది. ఆర్థిక ఆలంబన కోసం షెల్లీ సొంతంగా క్లీనింగ్ బిజినెస్‌ను మొదలు పెట్టింది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే పనిని మొదలుపెట్టి డబ్బులు సంపాదించేది. ఆ సంపాదనతోనే కొడుకును చదివించుకుంటూ తల్లిని చూసుకునేది. ఈ క్రమంలో షెల్లీ తల్లికి రొమ్ము కేన్సర్. అయినా కూడా షెల్లీ ఏమాత్రం బెదరకుండా తల్లికి చికిత్స చేయించింది. ఇలా చాలామంది మహిళల్లాగే ముళ్లబాటలో పయనించింది. కానీ మనస్సులో ఎప్పటినుంచో అందాల పోటీల్లో పాల్గొనాలని కోరిక. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల రీత్యా ఆ కోరిక మనసు పొరల్లోనే ఉండిపోయింది. కానీ కాలక్రమేణా అది పెరుగుతూ వచ్చింది. ఒకానొకరోజు ఆ పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడదే షెల్లీకి కొత్త జీవితాన్ని ఇచ్చింది. తన కోరికను నెరవేర్చుకునేందుకు యాభై సంవత్సరాల వయస్సులో ఫిట్‌నెస్ ట్రైనర్‌ను పెట్టుకుని మరీ తన శరీరాకృతిపై దృష్టి సారించింది. కొద్దిరోజుల్లోనే ఫిట్‌గా మారింది. ఇలా మారిన తరువాత ముప్ఫై సంవత్సరాల మహిళలు పాల్గొనే మిస్ గెలాక్సీ యు.కె. అందాల పోటీకి దరఖాస్తు చేసుకుంది. యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అమ్మాయిల అందాలతో పోటీ పడేలా ఉన్న షెల్లీ ఫొటోలను చూసి సెలక్టర్లు ఆశ్చర్యపోయారు. షెల్లీ అందాల పోటీల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చారు. అంతే.. ఇక మిస్ గెలాక్సీ యు.కె. టైటిల్‌ను సొంతం చేసుకుంది షెల్లీ. అప్పటినుండి అందాల పోటీల్లో పాల్గొంటూ పురస్కారాలను సొంతం చేసుకుంటోంది షెల్లీ. షెల్లీని కలిసే అమ్మాయిలు కూడా.. తాము యాభైలు దాటినా షెల్లీలానే ఉండాలనుకుంటున్నట్లు చెబుతున్నారట. తన వయస్సులో సగం వయస్సు ఉండే అమ్మాయిలు అలా అనడం తనలో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగించిందని షెల్లీ అంటోంది. ఇలా యు.కె.లోని పలు అందాల పోటీల్లో గెలుపొందిన తర్వాత మొదటిసారి టర్కీలోని అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టింది షెల్లీ. అక్కడా ఆమెను విజయం వరించింది. ఇలా షెల్లీ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుంది.
ఇటీవల రెట్టించిన ఉత్సాహంతో దిల్లీలోని క్లాసిక్ బ్యూటీ వరల్డ్ ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొని రెండో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముదిమి సుందరి. షెల్లీ ఈ వయస్సులో కూడా అందాల పోటీలో పాల్గొనడం పట్ల చాలామంది ఆమెను మొదట విమర్శించారు. వయసు పైబడిన షెల్లీకి యువత పాల్గొనే అందాల పోటీలెందుకని హేళన చేశారు. కానీ వారి మాటలను అస్సలు పట్టించుకోలేదు షెల్లీ. తనకంటే సగం వయసున్న అమ్మాయిలతో పోటీపడి గెలవడంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోందని అంటోంది షెల్లీ. ఇష్టం లేని పెళ్లి, విడాకులు, ఇంటి బాధ్యతలు ఇలా ఎన్నో అవరోధాలను ఎదుర్కొనే హిళలు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. వారు వాటన్నింటినీ దాటుకుని జీవితాన్ని కొత్తగా, తమకు నచ్చినవిధంగా మలచుకోవాలంటే ముందడగు వేయాల్సిందే.. అని చెబుతోంది షెల్లీ. అందాల పోటీ అంటే స్టేజిపై కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదని, తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి సాధికారతకు బాటవేయడమేనని చెబుతోంది ఈ యాభై ఏడు సంవత్సరాల సుందరి.