మెయిన్ ఫీచర్

ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్న మహిళలకు ‘డర్ ఆమ్నేహ్’ సమాధానంగా మారింది. అంటే రక్షించే ఇల్లు అని అర్థం. ఇంట్లో వేధింపులకు గురయ్యే జోర్డాన్ మహిళలకు ఉపాధిని, ఆశ్రయాన్ని కల్పించే కేంద్రమే ఈ డర్ ఆమ్నేహ్.
ఆకాశంలో సగం స్ర్తిలు.. శ్రమ ఉత్పత్తిలో సగానికి తక్కువేమీ కాదు.. పేరుకే అన్నింటిలో సగం.. కానీ తాను చదువుకోవాలన్నా, కడుపులో పడ్డ నలుసును కనాలన్నా, తాను ఎలా కావాలంటే అలా జీవించే హక్కు లేదు, అసలు సొంత నిర్ణయం అంటూ తీసుకునే స్వేచ్ఛ స్ర్తికి ఏమాత్రమూ లేదు. స్ర్తి నడకపై, నడతపై.. ఆఖరుకి నవ్వుపై కూడా ఆంక్షలే.. ఇలా స్ర్తిలంటే ఎంతో చిన్నచూపు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా చాలామంది దృష్టిలో మహిళలంటే చులకన. అనాదిగా దాసులుగా, పనిమనుషులుగా చిత్రీకరణ. వివక్షత, స్ర్తి ఎప్పుడూ మగవాడి కనుసన్నల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లి తరువాత భర్త, ముసలితనంలో కొడుకులు ఆధీనంలో జీవించాల్సి వస్తుంది. ఇలా స్ర్తిని బంధీని చేయడం ఈ సమాజం చేస్తున్న మొదటి నేరం. చివరకు మన చరిత్ర, సంస్కృతిలో కూడా ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శరణేషు రంభ’ అంటూ స్ర్తిని పురుషునికి సొంత ఆస్తిగా చూపిస్తూ భూస్వామ్య సంస్కృతి పితృస్వామ్యాన్ని వ్యవస్థీకృతం చేసింది. శతాబ్దాల కాలగమనంలో వ్యవస్థీకృతంగా పాతుకుపోయిన స్ర్తి పట్ల వివక్ష, హీనత, అణచివేత ధోరణులు ఈ వైఖరికి కారణం కావచ్చు. ప్రపంచం ఎంత హైటెక్ శాస్ర్తియ విజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఆడవారికి కనీసం బయటకు వెళ్లే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదు. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఏ మహిళకైనా బయటి సమాజం నుండి ఏదైనా సమస్య వస్తే ఇంట్లో చెప్పుకుంటుంది. అదే సమస్య ఇంట్లో నుంచే వస్తే ఎవరికి చెప్పుకుంటుంది? ఆ దేశంలోని అమ్మాయిలు ఇంట్లోని ఆంక్షలను భరించలేక వెళ్లిపోతే.. వెంటనే పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టేస్తారు. పెళ్లిచేసుకునే ముందు మగవారు కోరుకుంటే సదరు అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలను చేస్తారు. ఈ పరీక్షల్లో పొరపాటు ఫలితాలు వచ్చినా లేదా ఆ అమ్మాయి గతంలో తెలియక తప్పు చేసినా.. ఇక ఆ అమ్మాయి జైలుకో లేదా పరువు హత్యకు గురికావల్సిందే.. అదే ఒక పురుషుడు ముక్కూ మొహం తెలియని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడితే.. ఆమెను వివాహం చేసుకుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఇలా ఉన్నాయి అక్కడి చట్టాలు.. ఇంతకీ ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అనుకుంటున్నారు కదూ.. జోర్డాన్ దేశంలో.. అందుకే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జోర్డాన్ వ్యవస్థను సమూలంగా మార్చమని కోరుతోంది.
జోర్డాన్‌లో ఒకమ్మాయి పుట్టినప్పటి నుండి ఆమె ఏం తినాలో, ఏ బట్టలు కట్టుకోవాలో, ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించేది తండ్రే.. తల్లి కూతురి విషయంలో నోరు మెదపడానికి వీల్లేదు. ఇక ఆడపిల్ల చదువు గురించి ఆలోచించే సంస్కృతే అక్కడ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి తండ్రి చనిపోతే బాబాయో, మామయ్యో ఆమె సంరక్షణ బాధ్యతలను తీసుకుంటారు. అతను చెప్పిన వారితోనే ఆమె వివాహం జరగాలి. కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోతే పోలీసులు ఆ అమ్మాయిలను పట్టుకుని జైల్లో పెడతారు. ఆమె ఇంట్లో నుండి పారిపోయిందని రుజువు చేయక్కర్లేదు కూడా. ఆమె సంరక్షణ చూసే మగవారు వాంగ్మూలం ఇస్తే చాలు. ఆమెకు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్షను ఖరారు చేసేస్తారు. కులమతాల కారణంగా పరువు హత్యలున్నట్లే జోర్డాన్‌లో కూడా పరువు హత్యలున్నాయి. ఇక్కడ తండ్రి, అన్నదమ్ముల ఆవేశానికి ఎందరో అమ్మాయిలు తమ ప్రాణాలను కోల్పోయారు. తల్లిదండ్రుల అండలేని అమ్మాయిల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందీ అనుకుంటే పొరబాటు. ఇక్కడ మహిళ బతకాలంటే.. మగవారి సంరక్షణ తప్పనిసరి. ఒకవేళ ప్రేమించి, మోసపోయో.. అత్యాచారం జరగడం వల్లనో ఒక మహిళ బిడ్డను ప్రసవిస్తే.. తల్లి నుండి బిడ్డను నిర్దాక్షిణ్యంగా వేరుచేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇలా ఇటీవల ఓ మహిళ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వగా.. ఆమెకు భర్త లేడని తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం ఆమెను పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడిప్పుడే మార్పు
ఆ దేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి, ఎవరికీ చెప్పుకోలేని మహిళలకు ‘డర్ ఆమ్నేహ్’ సమాధానంగా మారింది. అంటే రక్షించే ఇల్లు అని అర్థం. ఇంట్లో వేధింపులకు గురయ్యే జోర్డాన్ మహిళలకు ఉపాధిని, ఆశ్రయాన్ని కల్పించే కేంద్రమే ఈ డర్ ఆమ్నేహ్. ఇంట్లో వేధింపులకు గురై, మగవారి అభియోగాలకు జైల్లో శిక్షను అనుభవించిన మహిళలు శిక్షాకాలం పూర్తయిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. పైగా ఆ దేశంలో మహిళ ఒంటరిగా బతకడానికి వీలులేదు. అందుకే వారికి ఒక సంవత్సరం పాటు రెన్యువల్ పద్ధతిలో పూర్తి సంరక్షణతో కూడిన నిర్బంధాన్ని కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లా? లేక జైలా? అని నిర్ణయించుకోమని మహిళలకు ఆంక్షలు పెడుతున్నట్లే కదా! దీంతో చాలామంది మహిళలు మరో గత్యంతరం లేక ప్రభుత్వ నిర్బంధంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. వారి బాధను చూసిన రగ్దా ఆజా అనే మహిళ డర్ ఆమ్నేహ్ అనే సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ చేయని తప్పుకి శిక్షను అనుభవించిన మహిళలు ఇక నుంచి తన కేంద్రంలో స్వేచ్ఛగా, ఆనందంగా విహరించవచ్చు అని చెబుతోంది ఈమె.
చట్టాలను మార్చండి..
ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతోంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఈ క్రమంలో ఆ సంస్థ ఇటీవల జోర్డాన్‌కు వెళ్లి అక్కడి మహిళల దుస్థితి గురించి తెలుసుకుంది. మహిళల కోసం డర్ ఆమ్నేహ్ చేస్తున్న కృషిని కొనియాడింది. ఆ దేశంలో మహిళలకు వ్యతిరేకంగా ఉన్న పురుషాధిక్య నిబంధనలకు వెంటనే మార్చాలని జోర్డాన్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అక్కడి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ ఇందుకు ఒప్పుకోరని తెలుసు. అందుకే చూస్తాం.. చేస్తాం.. అని కాకుండా రెండింతల వేగంతో కార్యాచరణ మొదలుపెట్టాలని కోరింది. ఈ మార్పుతో ఇప్పుడిప్పుడే అక్కడ కదలిక వచ్చింది. చూద్దాం.. ఇకనైనా అక్కడి చట్టాల్లో, ప్రజల్లో, ముఖ్యంగా మగవారిలో మార్పు వచ్చి.. మహిళను కూడా సాటి మనిషి చూడటం మొదలుపెడతారేమో..

-సన్నిధి