మెయిన్ ఫీచర్

కేప్‌లతో కేక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం పెరిగిపోయింది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్వెటర్, మఫ్లర్‌ల వంటివి వేసుకుంటారు. కాస్త ఆధునికంగా కనిపించాలనుకుంటే జాకెట్, బ్లేజర్, కోట్, షగ్స్.్ర. వంటివి వేసుకుంటారు. కానీ ఎప్పుడూ అవేనా.. అనుకునేవారికి, కాస్త కొత్తగా, ట్రెండీగా.. చలికాలం కోసం ఏమీ తయారుచేయలేదా ఈ డిజైనర్లు.. అనుకునేవారికి కేప్‌లు కాస్త ఊరటనిస్తాయి. ముడ, భుజాలు, ఛాతీ భాగాన్ని కప్పి ఉంచుతూ కుట్టే టాప్‌లాంటిదాన్ని కేప్ అంటారు. నేటి ట్రెండ్ ఇది. ఇది అన్ని శరీరాకృతుల వారికి చక్కగా నప్పుతుంది. దీన్ని ఏ రకం వస్త్రంతో నైనా కుట్టించుకోవచ్చు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు మాత్రం జార్జెట్, సిల్క్, శాటిన్, పట్టు, షిఫాన్, వెల్వెట్, క్రేప్ వంటి వస్త్రాలతో బాగుంటాయి. జాలువారే వస్త్రంతో ఎంచుకుంటే వారికి డిఫరెంట్ లుక్ వస్తుంది. చాలా చాలా అందంగా కనిపిస్తారు. కేప్‌లలో చాలా రకాలు ఉంటాయి. పైగా ఇది ఏ వయసువారికైనా బాగుంటుంది.
* కేప్‌లలో కేప్ కోట్ ప్రత్యేకమైనది. ఇది కాస్త పొడవుగా, సన్నగా ఉన్నవారికి ఇది బాగుంటుంది. దీన్ని హైకాలర్ నెక్, క్లోజ్డ్ నెక్‌లైన్స్‌తో కుట్టించుకోవచ్చు. ఇది ప్రత్యేక సందర్భాలకు బాగుంటుంది. దీన్ని నలుపు, ముదురు నీలం, లేత గోధుమరంగుల్లో ఎంచుకుంటే.. పార్టీల్లో కానీ, ఔటింగ్‌లకు వెళ్లినప్పుడు కానీ మెరిసిపోవచ్చు.
* కేప్‌లో సర్క్యులర్ మోడల్ ఒకటి. దీన్ని ఎక్కువ కుచ్చిళ్లు వచ్చేట్లుగా హైనెక్, షోల్డర్, ఆఫ్‌షోల్డర్ తరహాలో కుట్టించుకోవచ్చు. సన్నగా ఉన్నామనుకునేవారికే కాదు.. ఛాతి భాగం లావుగా ఉన్నవారికి కూడా ఈ మోడల్ చాలా బాగుంటుంది. కాస్త లావుగా ఉన్నవారికి కూడా ఇది బాగా నప్పుతుంది. స్టైల్‌గానూ, ట్రెండీగానూ కనిపిస్తారు.
* పోంచో అన్ని రకాల శరీరాకృతుల వారికీ నప్పుతుంది. పొట్టిగా ఉన్నవారు దీన్ని ఎంచుకుంటే.. కాస్త పొడవుగా కనిపించవచ్చు. ఇది ఆకర్షణీయమైన రంగుల్లో, ఆకట్టుకునే ప్రింట్లలో లభిస్తుంది. నలుపు రంగు టైట్ జీన్స్, లేత రంగు డెనిమ్‌పైకి దీన్ని జతగా ఎంచుకోవచ్చు. క్రాప్‌టాప్ పైకి కూడా ఇది చాలా బాగుంటుంది.
* కేప్ కార్డిగన్ అనేది పూర్తిగా ర్యాపింగ్ స్టైల్‌లో ఉంటుంది. భుజాల మీదుగా వేలాడుతుంది. ఇది కాలేజీలకే కాదు, చిన్న చిన్న విహారయాత్రలకు కూడా అనువుగా ఉంటుంది. ఇందులో నలుపు, ముదురు నీలం, ఎరుపు, బ్రౌన్.. వంటి ముదురు రంగుల్ని ఎంచుకుంటే బాగుంటుంది. దీనికి జతగా స్కిన్ జీన్స్, పట్టీలున్న టీషర్టు, కానీ, తెల్లని తెలుపు రంగు ఆఫ్ షర్ట్‌గానీ వేసుకుంటే.. అదిరిపోయే లుక్ సొంతమవుతుంది.
* స్లీవ్‌లెస్ టాప్‌లు వేసుకోవడం ఇష్టం. కానీ అలాంటివాటిని కొన్ని కారణాల వల్ల ఎంచుకోలేకపోతున్నాం అని బాధపడేవారికి కేప్ చక్కని ఎంపిక. ఇది పై నుంచి కింది వరకు మ్యాక్సీ తరహాలో లేదా అనార్కలీ వేసుకున్నప్పుడు దానికి జతగా కాస్త మెరుపులుండే కేప్ చాలా చాలా బాగుంటుంది.
* బాగా సన్నగా ఉన్నవారు కేప్‌ను ఎంచుకోవడం వల్ల కాస్త లావుగా కనిపిస్తారు.
* రఫుల్డ్, లేయర్డ్ కేప్‌లు స్లిమ్ ఫిట్ స్కర్టులూ, ప్యాంట్‌లపైకి నప్పుతాయి. అలాగే స్కిన్ జీన్స్, ప్యాంట్లపైకి లాంగ్ కేప్స్ బాగుంటాయి.
* కేప్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎంపిక చేసుకున్నా.. అది మిగతా ఆహార్యాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. అందుకే దుస్తుల్ని బట్టి కేప్‌లను ఎంచుకోవాలి. దుస్తులు లేత రంగుల్లో ఉంటే ముదురు రంగు కేప్‌లను ఎంచుకోవాలి.
మరెందుకాలస్యం.. ఈ చలికాలంలో కేప్‌ను ఉపయోగించి అదిరిపోయే లుక్‌ను సొంతం చేసుకుని అందరి చూపులనూ మీ వైపు తిప్పుకోండి..
*