మెయిన్ ఫీచర్

ఎందుకిలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలో కుంతీదేవి తన సవితి తల్లి బిడ్డలను, తన బిడ్డలను పెంచింది. ఎక్కడా మచ్చలేదు. వారంతా పాండవులుగా కీర్తికెక్కారు కానీ కుంతి తనయులు, మాద్రి బిడ్డలు అన్న వ్యత్యాసం ఎక్కడ మనకు కనిపించదు.
అంతెందుకు? లోకానికే జగద్గురువుగా కీర్తికెక్కిన శ్రీకృష్ణుడిని కన్నతల్లి దేవకీదేవి కనీసం కనులారా చూడకముందే.. పొత్తిళ్లల్లోనే యశోద దగ్గరకు చేరాడు... ప్రేమకు మారురూపంగా కృష్ణుడిని యశోదమ్మ పెంచింది... కృష్ణుడు ఏనాడు తన తల్లి యశోదమ్మ కాదు అనుకొనేలా యశోద వ్యవహారం కనిపించదు..
చిట్టి పొట్టి మాటలు మాట్లాడుతూ... చిన్ని చిన్ని చేతులతో పెద్ద పనులేవో చేసేయాలనే తపనతో చేసే చిన్నారుల పనులు... కొత్త చూసే ఏ వస్తువునైనా అద్భుతంగా అపురూపంగా చూసే చిన్ని చిన్ని కళ్లు... వాళ్ల స్వచ్ఛమైన నవ్వులు... అసలు ఏ చిన్ని పాపనో, బాబునో చూస్తే చాలు అప్పటివరకూ మనసు బాగలేదనో, మరేదో బాధను అనుభవించిన వారైనా సరే వారి ముఖంలో స్పష్టమైన మార్పు వస్తుంది. చిన్న చిరునగవు అనుకోకుండానే వచ్చేస్తుంది.
అసలు ఏబంధమూ, అనుబంధమూ లేకుండానే, బస్సులోనో, లేక ఏ బస్‌స్టాప్‌లోనో, ఇంతెందుకు భాష తెలియని వారు సైతం చిన్నారులను ఎత్తుకుంటే వారు కళ్లు తిప్పుతూ చిరునవ్వులు నవ్వుతూ చూస్తున్నపుడు పక్కన ఉన్నవారు వారికి తెలియకుండానే ఆ చిన్ని చిన్నారులను ఎత్తుకోవడానికి చేతులు చాస్తారు. వారి నవ్వుకు వీరి నవ్వును జోడిస్తారు. ఏదో మాట కలుపుతారు..
కదా.. ఇదంతా సహజం. అందుకే చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అన్న నానుడి వచ్చింది.
అంతేకాదు.. ఎందరో తల్లులు వారి పిల్లలనే కాదు ఎవరి పిల్లలనైనా తమ బిడ్డలుగానే పెంచటం ఈ భారతదేశం సంస్కృతి.
అట్లాంటి సంస్కృతి నేడు బీటలు బారుతోంది. అమ్మతనానికే మచ్చ వచ్చేలా నేటి స్ర్తిలు వ్యవహరిస్తున్నారు.. ఇందుకిలా చేస్తున్నారు..
వీరి మానసిక స్థితి ఎందుకిలా దిగజారుతోంది..
చూడండి.. నిన్నటి నుంచి వెనక్కు చూస్తే....
మరి ఈనాడు ఏమైంది.. ఈ సమాజాన్ని ఏ చీడపురుగు తొలుస్తోంది... ఎక్కడ చూసినా చిన్నారుల ఆక్రందనలు... వారి గోడు చూస్తుంటే, వింటుంటే... నరాలు చిట్లిపోతున్నంత బాధ కలుగుతోంది... ఎందుకిలా...
ఒకచోట - అప్పుడే పుట్టిన బిడ్డ... కనీసం కళ్లైనా తెరవని పసిగుడ్డును ముళ్లకంపల్లో పారేసేవారు....
మరోచోట- ఇంకా లోకం తెలియని వయస్సులో బాల్యం వీడని నీడలోనే 5,6, 8 ఏళ్లవయస్సులోనే అత్యాచారాలు...
ఇంకోచోట- కాస్త పెద్దయి చదువుకోవడానికి వెళ్లే సమయంలో అత్యాచారాలు.. మానభంగాలు... హత్యలు.. ఆత్మహత్యలు...
ఇంకో ఇంకో చోట- పారాణి ఆరక ముందే కాటికి పోతున్న మహిళలు...
మరోచోట... విధి ఆడిన వింతనాటకంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక... , ప్రేమించిన వాని మోసం తెలుసుకోలేక... కట్టుకున్నవాడి కుతంత్రం తెలుసుకోలేక...నిండు ప్రాణాలు.. బలి...
నిన్నటి ఉదంతం దీప్తిని పెంచిన తల్లి కడతేర్చడం...
ఇవన్నీ చూస్తుంటే మనసు రగిలిపోతోంది...
మన దేశం ఏమిటి? మన సంస్కృతి ఏమిటి? మన సమాజం ఎటుపోతోంది? ఇది పురోగతా? అధోగతా?
అసలు స్ర్తి ప్రేమకు మారురూపం కదా...
ఆమె చేతులు అమృత్వాన్ని అందించేవి కదా...
కానీ నేడు కర్కశంగా ఎలా ప్రవర్తిస్తోంది?
దీనికంతా కారణం మనుష్యుల్లో పెరుగుతున్న అసహనం, స్వార్థం, ఆషాఢభూతితనం.. తాను మాత్రమే బాగుండాలన్న పేరాశ. మనిషి ఎప్పుడూ ఒక్కడూ ఉండలేడు. సంఘజీవి. ఆ సంఘజీవే నేడు మరోమనిషిని సహించలేని దుస్థితికి చేరుకుంటున్నాడు.
దీనికి కారణం ఆర్థిక స్థితిగతులు మారడటమే అనేది ఆర్థిక సంబంధ విశే్లషకుల అభిప్రాయం.
ఉన్నది నలుగురూ కలిసి తినడం .. ఐకమత్యంతో ఉండడం అనేవి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచీ చెబుతూ పెంచకపోవడం, చిన్న పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే ఫర్వాలేదు.. నీవు మాకు ముఖ్యం.. నీకేదైనా చేసేస్తాం అని చెప్పడం. వారి గొంతెమ్మ కోరికలను తీర్చడంలో ఇతరులను నొప్పించడం.. ఇలాంటివన్నీ పెద్దలు చేయడమే..
చిన్న కుటుంబాలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడం లో ఇతరులెవరైనా ఇంట్లో ఉంటే వారు తమ అభివృద్ధికి అడ్డుగా ఉంటారన్న అపోహలు.. అంతా తమకే కావాలన్న అత్యాశ వల్లే ఇలాంటి విపరీతాలు జరుగుతున్నాయి.
నీవు నీ క్లాసులో ఫస్టు ర్యాంకు తెచ్చుకుని తీరాలి. నీవే మొదటి ర్యాంకర్‌గా ఉండాలి అని వారిలో కసిని పెంచటం వంటి పనులు చేసే పెద్దల వల్ల వారి నడవడిలో భయంకరమైన మార్పులు వస్తున్నాయి.
ఒకవేళ ఇలాంటి స్థితే కొనసాగితే కొన్నాళ్లకు సమాజం ఏమై పోతుంది.
నేను బాగుండాలి. నా వాళ్లు బాగుండాలి అనే ధోరణి మార్చకోవాలి. నలుగురూ బాగున్నపుడే మనమూ బాగుంటాము అన్న విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు కూడా ఉన్నది నలుగురూ కలిసి పంచుకోవడంలోనే ఆనందం ఉంటుంది కానీ ఒకరిని చంపి వారిది తినాలన్న ఆటవికవృత్తిని చేపడితే వారు ఆలోచన, బుద్ధి ఉన్నవారుగా సమాజం అంగీకరించదన్న వివేకాన్ని కలిగించుకోవాలి.
రెండో పెళ్లి చేసుకొనేవారు, అసలు పెళ్లి చేసుకోవాలన్న అనుకొన్న ప్రతి జంట కొన్నాళ్లు ఫ్యామిలీ కౌన్సిలింగును తప్పక తీసుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పే కొన్ని గ్రంథాలను చదవాలి. నలుగురితో కలిసి ఉండే మానసిక స్థితిని తెచ్చుకోవాలి. సర్దుబాటు ధోరణిని అలవర్చుకున్న తరువాతనే వివాహాలు చేసుకోవాలి. అపుడన్నా ఇలాంటి ఉన్మత్త పరిస్థితులను దూరం చేసుకోవచ్చు.
ఇక నుంచైనా స్ర్తిలంటే కేవలం లావణ్యం కాదు వారి మనుసులు మృదుభావాలకు మారురూపంగా తయారు కావాలి. హింసకు వ్యతిరేకులుగా ఉండాలి కానీ హింసోన్మాదులుగా ఉండకూడదు. అపుడే సమాజం ఆనందంగా మనుగడ సాగిస్తుంది. సంపదులు ఉండాలి కానీ సంపదే ప్రాణంగా భావించకూడదు. ధనం జీవితంలో ఒక భాగం కానీ జీవితమే ధనం కాదు అన్న విషయాన్ని స్ర్తిలందరూ గుర్తించాలి. ప్రపంచానికి గర్వకారణగా భారతీయ స్ర్తిలు ఉండాలి కానీ ఉన్మాదులుగా మారకూడదు. సాధికారత సాధించి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మనం ఇట్లాంటి విపరీతధోరణులకు పాల్పడకూడదు. అందుకే ప్రతి తల్లీ తన కూతురుకు సర్దుబాటు, ఐకమత్యం గురించి విషయాలను చిన్నప్పటి నుంచి నేర్పించాలి. రక్తచరిత్రలు కాకుండా రత్నాల చరిత్రలను రాయగలిగే రమణీమణులుగా ఉండాలి.

- లక్ష్మి