మెయిన్ ఫీచర్

కలతలేకుండా కథ చెబుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. వేటకెళ్లి ఏడు చేపలు తెచ్చారు.. ఒక ఈగ ఒక రోజు ఇల్లు అలుకుతూ దాని పేరు మర్చిపోయిందట...
చందమామ రావే.. జాబిల్లి రావే. కొండెక్కి రావే.. కోటిపూలు తేవే.. అంటూ చిన్నారికి చందమామను చూపిస్తూ భోజనం తినిపించేవారు. పిల్లలు కేరింతలు కొడుతూ భోజనం ఆరగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. పనులు చకచకగా అయిపోవాలని పిల్లలు టీవీలు చూపిస్తూ, సెల్‌ఫోన్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు.
పిల్లలకు కథలు చెప్పేంత తీరిక మాకెక్కడిది అదిగో ఆ టీవీ రిమోట్ ఇచ్చేస్తే నచ్చిన పిల్లల చానల్స్ వచ్చినంత సేపూ చూసి పడుకుంటారు అనే ధోరణిలో చాలా మం ది ఉంటున్నారు. ఇది మం చి పద్ధతి కాదు. టీవీల్లో పగ, ద్వేషం పెంచే కొన్ని కథలు పిల్లల్లో బలంగా నాటుకుపోతున్నాయి. అలా కాకుండా మనమే కాస్త సమయం కేటాయించి పిల్లలకు కథలు చెబితే చాలు.
ఆదివారం సెలవు రోజులు అనురాగాలకు నెలవుగా మారాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. విహార, విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లడం ద్వారా చిన్నారుల్లో మానసిక పరిపక్వత చెందే అవకాశం కల్పించవచ్చు. రోజంతా బిజీగా ఉన్నా సరే.. పడుకునే సమయంలో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం వంటి వాటితో పిల్లలను త్వరగా పడుకోబెట్టాలి.
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, నిద్రలేచేలా క్రమశిక్షణ అలవాటు చేయాలి. ఉదయానే్న మనతోపాటు చిన్నారులను కూడా వ్యాయామానికి తీసుకెళ్లాలి.
మూడేళ్ల నుంచే సాధారణంగా పిల్లలు పాఠశాలలకు వెళుతున్నారు. అయిదేళ్ళవరకు కనీసం రోజుకు 12 గంటలు చిన్నారులకు నిద్ర అవసరం. రాత్రి పూట మంచి కథలు చెప్పడం వంటివి చేస్తే హాయిగా నిద్రిస్తారు.
చాలా ఇళ్ళలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గిపోవడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కూడా ఉండడం లేదు. ఉద్యోగాలు చేసి అలసి ఇంటికొచ్చిన తర్వాత పిల్లలను ఆడించడం, వారికి అనేక విషయాలు చెప్పడంలో చాలామంది సమయం కేటాయించలేకపోతున్నారు. ఇది సరికాదు.. పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారికి అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పడంవల్ల చిన్నారుల్లో ఆలోచనలు సృజనాత్మకంగా వుంటాయి.
చెప్పాలే కానీ ఎన్నో కథలు..
మన సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా కథలు చెబుదాం. సంక్రాంతి పండగవేళ హరిదాసులు, కొమ్మదాసులు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల సందడి గురించి చెబితే ఆసక్తిగా ఆలకిస్తారు. దసరా, దీపావళి కోసం ఒకసారి చెప్పాలేగానీ ఏటా పండగ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు.
స్వాతంత్య్ర గణతంత్ర దినోత్సవాల వేళ జాతీయ నాయకులు, దేశానికి వారు చేసిన త్యాగాలను పిల్లలకు వివరించాలి. పంచతం త్ర కథలు, ఆత్మీ య, అనురాగాలు పంచే అనుబంధాల కథ లు స్ఫూర్తిదాయక వ్యక్తు ల గాథలు పిల్లలకు పరిచయం చేద్దాం. సరదాగా కథ సాగాలంటే మన తెనాలి రామలింగడు ఉన్నాడు కదా.
కథలో క్యారెక్టర్లను చక్కగా చెప్పాలే గానీ పిల్లల మనసులో నాటుకుపోతాయి. తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులకు ఏగిన రాముడు, అన్న వెంటనే నడచిన లక్ష్మణుడు గురించి చెబితే పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది.
అలాగే భారతంలో ధర్మరాజు నీతిని, అర్జునుడి చాకచక్యాన్ని, భీముడి బలాన్ని ఇలా వివరిస్తే గుర్తుండిపోతుంది.
బొమ్మలు చూపిస్తూ వాటి గురించి పిల్లలకు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు. కలత లేకుండా చిన్నారులు హాయిగా నిద్రపోయేందుకు మనం కొంత తీరిక చేసుకుందామా మరి.

రోజంతా బిజీగా ఉన్నా సరే.. పడుకునే సమయంలో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం వంటి వాటితో పిల్లలను త్వరగా పడుకోబెడితే కమ్మటి నిద్రపోతారు.

బుజ్జాయికి నిద్ర రావడం లేదంటే తమ గారాల పట్టి ఊహాలోకంలో విహరించేలా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఇలా కథలు చెప్పి హాయిగా నిద్రపుచ్చేవారు. మరి మన పిల్లలకు నేడు ఆ సంతోషాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. తీరిక లేదు అనే ఒక్క మాటతో ఆ ఆనందాన్ని చిన్నారులకు మనం దూరం చేస్తున్నాం. తీరిక చేసుకుని కథలు చెబుదాం.. పిల్లలతో ఊ కొట్టిద్దాం.. కథ కంచికి మనం ఇంటికి.. అని ప్రశాంతంగా నిద్రపోయేలా చేద్దాం.

- నీలిమ సబ్బిశెట్టి