మెయిన్ ఫీచర్

ఈ భావన లేదు... మోక్షం ఎడారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
27. సమ్యగాస్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా
తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్యలాలనమ్‌॥
నిత్య నిర్మలమైన పరబ్రహ్మమందు నిశ్చయాత్మకమైన బుద్ధిని స్థిరముగా నిల్పిఉంచటమే సమాధానమని చెప్పబడుతున్నది. మనో వికారము, చిత్తచాంచల్యము సమాధానముకాదు. శమము, వైరాగ్యప్రవృత్తితో చేసిన అభ్యాసము: సమాధానము తత్‌సాధన ఫలితము. ప్రసాదించే కొన్ని ఐశ్వర్యములను పొందవచ్చును. అయితే, వాటివలన నిర్గుణ పరబ్రహ్మమును చేరి అచిరకాలములో జన్మరాహిత్యము లభించదు. ఈ విషయము స్పష్టముచేయటానికే పరబ్రహ్మముపై బుద్ధిని నిల్పి, ధ్యానముచేయడమే సమాధానమని ఈ శ్లోకంలో వక్కాణించబడినది.
28. అహంకారాదిదేహాన్తాన్ బధానజ్ఞాన కల్పితాన్‌
స్వస్వరూపావబోధేన మోక్తు మిచ్ఛా
ముముక్షుతా॥
దేహాభిమానము అజ్ఞాన జనితము. అంతఃకరణమే ‘నేను’అనే అహంకార రూపము. దేహభాగ్యమైన ఆనందమయ కోశ స్థానమే అహంకారము. అంతఃకరణ ప్రవృత్తియే స్వస్వరూపజ్ఞాన ప్రాప్తికి ప్రతిబంధకము. అందువలన, నశ్యమయే దేహమందు ప్రీతి, మాయచే ఆవరింపబడిన అహంకారమును చిత్తశుద్ధితో అంతరముచేసుకొని స్వస్వరూప జ్ఞానార్జనతో బంధవిముక్తి కోరుకొనుటయే ముముక్షుత్వము.
అహంకారము మాయాజనితము. ప్రకృతినుండి సంభవించే అహంకారాదులు ఆత్మబోధతో అంతమగును. ‘‘అహమాత్మా సర్వభూతాశయ స్థితః’’ (సర్వ ప్రాణులను ఆశ్రయించిఉన్న ఆత్మను నేనే అని కృష్ణ్భగవానుని ఉపదేశము- భ.గీ.10-20).
హృదయ స్థిత ఆత్మ. పరమాత్మయొక్క అంశమే అందువలన, ఏకాగ్రతను నిశ్చల మనస్సుతో సాధించి, ఆత్మవిచారణ ద్వారా కైవల్యసిద్ధిని పొందే ఇచ్ఛయే ముముక్షుత్వం అని చెప్పబడుతున్నది.
29. మన్దమధ్యమ రూపాపి వైరాగ్యేణ శమాదినా
ప్రసాదేన గురోః సేయం ప్రవృద్ధా సూయతే ఫలమ్‌॥
ముముక్షత్వము మూడు విధములైనది- మంద, మధ్యమ, మరియు ప్రవృద్ధ మోక్షేచ్ఛ. ప్రాపంచిక, సంసార బంధనాదులు గలవారికి మోక్షాకాంక్ష కలుగుట బహు దుర్లభము. ఇది మందమ వర్గమునకు చెందిన మోక్షేచ్ఛ. శాస్త్రశ్రవణముచేసిన విద్యావంతుడు వైరాగ్యభావన పెంచుకొని, సద్గురువు సేవచేసిన, ముముక్షత్వము వృద్ధిచెంది మధ్యమ వర్గమునకు చెందినదగును. తత్త్వజ్ఞాన సాధకుడు గురూపదేశమును పొందిన పిదప, మోక్షేచ్ఛ అత్యంత తీవ్రమై, కైవల్యసిద్ధి తప్ప వేరొక దానిని ఆశింపదు. ఇట్టి ప్రవృద్ధమైన (తీవ్ర) ముముక్షత్వమే ఆత్యంతిక సుఖాన్ని, ఆత్మకు శాశ్వత బంధవిముక్తిని ప్రసాదించును.
30. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే
తస్మినే్నవార్థవస్తః స్యుః ఫలవన్తః శమాదయః॥
ఎవనిలో వైరాగ్యభావన, మోక్షేచ్ఛ అత్యధికముగా ఉండునో వానికే సాధన సంపత్తుల ఫలము లభించును. మోక్షమందు తీవ్రమైన ఆసక్తి లేనప్పుడు, శమదమాదులు అర్థవంతము కావు; తత్త్వజ్ఞాన ఫలితమైన పరమసుఖము లభించదు.
31. ఏతయోర్మన్దతా యత్ర విరక్తత్వమముక్షయోః
మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా॥
ఏ వ్యక్తిలో వైరాగ్యము మరియు మోక్షేచ్ఛ అంతంత మాత్రమే మందస్థాయిలో ఉండునో, వానియందు మోక్షాసక్తి ఎడారిలో జలాశయము (మృగతృష్ణ)వలె, లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిని కల్పించును. అనగా, వైరాగ్యభావన మరియు తీవ్రమైన ముముక్షత్వము లేని వ్యక్తిలో శమదమాదులున్నట్లు అగుపించినా, అతడు ప్రసన్నచిత్తుడు కాదు.
32. మోక్షకారణసామగ్య్రాం భక్తి రేవ గరీయసీ
స్వస్వరూపానుసన్ధానం భక్తి రిత్యభీధీయతే
మోక్షప్రాప్తికి ఉత్తమోత్తమైన మార్గము భక్తి. భగవంతుని అచంచల భక్తితో సేవించిన వానికి ముక్తి లభించుట తథ్యము. అద్వైత భావనతో పరమాత్మ స్వరూపమే నేను (సో‚ హం) అనే విశ్వాసముతో చేసే ధ్యానమే భక్తి అని చెప్పబడినది. సంసార బంధవిముక్తికి అన్ని సాధనలకన్న అత్యంత శ్రేష్ణమైనది భక్తిమార్గమని స్మృతిలో పలుచోట్ల బోధించబడింది-
‘‘్భక్త్వా త్వనన్యయా శక్య అహమేవంవిధో‚ ర్జునా
జ్ఞాతుం ద్రష్టంచ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప॥
(అర్జునా! నా ఈ విధమైన దర్శనము, తత్త్వజ్ఞానప్రాప్తి, నాయందు ఏకీభావము కల్గుట కూడా అనన్యభక్తిద్వారా మాత్రమే సాధ్యమగును- భ.గీ.11-54)
‘‘తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్‌
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్’’॥
(అర్జునా! నాయందు మనస్సును లగ్నముచేసి ధ్యానము చేసే పరమభక్తులను నేను మృత్యుసంసార సాగరమునుండి అతి శీఘ్రముగా ఉద్ధరించెదను- భ.గీ.12-7).
32(అ). స్వాత్మతత్త్వాసన్ధానం భక్తి రిత్యపరే జగు.॥
నేను అని ప్రకటితవౌతున్న జీవాత్మ (ప్రత్యగాత్మ)పరమాత్మకు అభిన్నము. జీవేశ్వరుల ఏకత్వమును విశ్వసించి చేయు ధ్యానమే భక్తి అని కొందరి విజ్ఞుల అభిమతము. భేదబుద్ధితో పరమాత్మ సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుడను అని పరమాత్మను వేరుచేసి, సేవించిన భక్తి అనన్యభక్తి కాజాలదు. అది మిథ్యారూపము; కావున భ్రాంతిని కల్గించును.
ఎటువంటి గురువును ఆశ్రయించవలెను?
33. ఉక్త సాధన సమ్పన్నః తత్త్వజిజ్ఞాసురాత్మనః
ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బన్ధవిమోక్షణమ్‌॥
తొలుత వివరించిన శమాది సాధన సంపత్తులుగల వ్యక్తి, జిజ్ఞాసువుగా ఆత్మతత్త్వమును తెలిసికొనదల్చినచో, ఎవని ద్వారా బంధవిముక్తికి తగిన జ్ఞానము లభించునో, అట్టి ప్రాజ్ఞుడైన గురువును ఆశ్రయించవలెను.
బ్రహ్మనిష్ఠగల, శ్రోత్రియుడే ప్రాజ్ఞుడనబడను. సమగ్ర వేదాంత జ్ఞానముతోపాటు, తర్క-మీమాంస శాస్తమ్రులలో ప్రావీణ్యముగల ఆత్మవేత్తయే మోక్షప్రాప్తి లభించే బ్రహ్మతత్త్వమును ఉపదేశించుటకు తగిన గురువని గ్రహించుట ముఖ్యము.

- ఇంకావుంది...