మెయిన్ ఫీచర్

వంటగది మెరుస్తుందిలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిందరవందరగా, అపరిశుభ్రంగా వున్న వంట గది విసుగు తెప్పిస్తుంది. చక్కగా సర్దుకున్న వంటగది చూడముచ్చటగా ఉండి మనసుకు హాయినిస్తుంది. దానికోసం వంటింట్లో సామాన్లు ఎలా సర్దుకోవాలో.. గదిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలానో తెలుసుకుంటే సరి.
వివిధరకాల వస్తువులతో వంటగది నిండిపోతుంది. కాబట్టి తక్కువగా వాడే వస్తువులను అటకపై చేర్చాలి. దీనివల్ల గదిలో కొంత ఖాళీ స్థలం మిగులుతుంది. దాన్ని అవసరమైన పనులకోసం వాడుకోవాలి. అంతగా వాడని వస్తువులతో అల్మారాను నింపొద్దు. కొత్త వస్తువులను కొనేముందు దాని అవసరం ఎంత అనేది బాగా ఆలోచించాలి.
చక్కగా సర్దుకోవడం..
ఒకరకం సరుకులు అన్నింటినీ ఒకవైపు ఉండేలా, ఏ రకానికి అదే విభజించి ఒక క్రమపద్ధతిలో అల్మారాలో పెట్టుకోవాలి. అప్పుడే తెచ్చిన వస్తువులను అల్మారాలో అన్నిటికంటే వెనుకన, పాత సరుకులు అల్మారా ముందుభాగంలో సర్దుకోవాలి. తద్వారా అవి పాడయిపోకుండా, వాటి కాల పరిమితి కంటే ముందే వాటిని వాడుకోవడానికి వీలవుతుంది. ఇలా చేయడంవల్ల కావలసిన సరుకుల జాబితా రాయటమూ సులువవుతుంది. సరుకులు ఉంచే అల్మారాను చూస్తే ఏంకావాలో, ఏం అవసరం లేదో ఇట్టే తెలిసిపోతుంది. సరుకుల డబ్బాలు, ప్యాకెట్లపైన గడువు తేదీలను అప్పుడప్పుడు చూస్తుండాలి. గడువుదాటిన వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు తొలగిస్తే అల్మారాలో కొంత ఖాళీ ఏర్పడుతుంది.
సొరుగుల అల్మారాతో సులువు
అల్మారాల్లో చిందరవందరగా పడేస్తే కొన్ని సరుకులు అవసరమైనప్పుడు చేతికి అందవు. కనిపించక పాడైపోయే అవకాశమూ ఉంది. అందుకే అల్మారాల్లో అరలకు బదులు సొరుగులు ఏర్పాటుచేసుకొని అందులో సరుకులు ఉంచుకోవాలి. సొరుగు బయటకు లాగితే అందులో వున్న సరుకులు అన్నీ కంటికి కనిపిస్తాయి.
సన్నటి కంటెయినర్లు!
సన్నగా, ఎత్తుగా వుండే డబ్బాల్లో సరుకులను నింపి అరల్లో పెడితే అల్మారాలో మరింత ఖాళీ స్థలం మిగులుతుంది. అంతేగాక ఒక క్రమంలో పద్ధతిగా ఉండి చూడడానికి బావుంటాయి. దీనివల్ల ఎక్కువ సరుకులతో అల్మారా నింపటానికి వీలవుతుంది.
ఆర్నెల్లకోసారి
శుభ్రం చేయండి
ఏడాదిలో రెండుసార్లు సామాన్లు అన్నింటినీ తొలగించి, వంటగది అంతటినీ పూర్తిగా శుభ్రం చేయాలి. ఆల్ పర్సస్ క్లీనర్‌తో అల్మారాల్లో అరల కింది భాగం కూడా తడిచేలా స్ప్రే చేసి శుభ్రం చేయాలి.

- తులసి జ్యోతి