మెయిన్ ఫీచర్

ఆనందకాంక్ష జీవన హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
విషయము స్వతఃసిద్ధముగా ప్రియమైనచో సర్వకాల సర్వావస్థలందు అందరికీ ఆ విషయమందు ఇచ్ఛ (ఆసక్తి)కలగాలి. కాని, కొన్ని విషయములు కొందరికి కొంతకాలమే ప్రియమై తదనంతరము అప్రియవౌతున్నవి. అదే విధముగా, కొందరికి ప్రియమైన విషయములు మరికొందరికి జుగుప్స పుట్టిస్తున్నవి కదా! ఆత్మ స్వతఃసిద్ధముగా ఆనంద స్వరూపము. కావున, అందరికీ సర్వావస్థలందు అత్యంత ప్రియమైనది నిజ ఆత్మయే. ఆత్మ ఎవరికీ హేయము కాదు.
యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి ఆత్మతత్త్వమును బోధిస్తూ ఇలా అంటారు ‘‘న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి నవా అరే జాయాయై కామాయ జాయాప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి’’ (మైత్రేరుూ! భర్తయొక్క ప్రీతికొరకు భర్త ప్రియుడుకాడు, తన ఆత్మ ప్రీతికొరకే భర్త ప్రియుడౌతున్నాడు.
భార్యయొక్క ప్రీతికొరకు భార్య ప్రియమైనది కానే కాదు. తన ఆత్మ ప్రీతికొరకే భార్య భర్తకు ప్రియమైనదౌతున్నది- బృ.ఉ.6-5-6). ఈ శ్రుతిస్వాత్మ ప్రీతికొరకే విషయ పరిగ్రహణ జరుగుచున్నదని స్పష్టము చేస్తున్నది.
109. తత ఆత్మా సదానన్దో నాస్య దుఃఖం కదాచన
యత్సుషుప్తౌ నిర్విషయ ఆత్మానన్దో‚ నుభాయే
శ్రుతిః ప్రక్యక్షమైతిహ్య మనుమానం చ జాగ్రతి॥
శరీరమే సుఖదుఃఖములను అనుభవించును. ఆత్మ దుఃఖాతీతము. సర్వదా ఆనందపరవశములో ఉండే ఆత్మకు ఏనాడూ దుఃఖముండదని ముందు శ్లోకములో ప్రస్తావించినదే ఈ శ్లోకంలో నిర్ధరింపబడుతున్నది.
సుషుప్త్యవస్థలో గాఢనిద్రలో మునిగిన జీవాత్మ, ఇంద్రియ సుఖములకు అతీతమైన పరమానందమును పొందుతూ అత్యంత ప్రశాంతంగా ఉండును. జీవాత్మ అలసట తీర్చుకోటానికి కొంతకాలము పరమాత్మయందు లయమగునని శ్రుతి నిర్ధారిస్తున్నది ‘ఏషాస్య పరమాగతి రేషాస్య పరమా నమ్పదేషో‚ స్య పరమోలోక ఏషో‚ స్య పరమ ఆనన్ద ఏతస్యైవానన్దస్యాన్యాని భూతానిమాత్రా ముపజీవన్తి’’ (ఇదియే పరబ్రహ్మమాత్రమైన లోకము. ఇదియే ఈ జీవాత్మకు పొందదగు శ్రేష్ఠస్థానము. ఇదియే జీవిత్మాకు అన్ని సంపత్తులలోను శ్రేష్ఠమైన సంపత్తు. జీవాత్మకు విషయ సంపర్కమువలన కలిగే అన్ని ఆనందములకంటె శ్రేష్ఠమైన ఆనందము ఇదియే. విషయేంద్రియ సంయోగముతో కల్గిన ఈ ఆనందముయొక్క అంశ మాత్రమునే అనుసరించి సుషుప్త్యవస్థకు చేరలేని ఇతర ప్రాణులు జీవిస్తున్నవి- బృ.ఉ.4-3-32). ఇంకొక ప్రమాణము ఇట్లున్నది ‘‘రసో వై సః రసగ్గ్ హేవాయం లబ్ధ్యా‚‚ నందీ భవతి కో హ్యేవాన్యత్ కం ప్రాణ్యాత్‌ యదేష ఆకాశ ఆనందో న స్యాత్’’ (బ్రహ్మము రస స్వరూపము. రసానుభవము వలననే జీవి ఆనందమును పొందుతున్నాడు. నిర్లిప్తమగు ఆకాశమువలె ఈ ఆనందములేనిచో ఎవడు జీవించును? ఎవని ప్రాణము నిలబడును? - తై.ఉ.2-7).
మూలప్రకృతి లేక మాయ
110. అవ్యక్తనానీ పరమేశశక్తి
రనాద్యవిద్యా త్రిగుణాత్మికా పరా
కార్యానుమేయా సుధియైవ మాయా
యయా జగత్సర్వమిదం ప్రసూయతే॥
రూప రహితమైన పరమేశ్వర శక్తియే అవ్యక్తమని, మాయ అనే పేర్లతో పిలువబడుతున్నది. సృష్టి ఆవిర్భావమునకు పూర్వమునుండి ఉన్న కారణంగా అనాది అని అందురు. మాయ రూపరహితమేకాదు, అసలు వాస్తవముగా లేనిది, లేని దానిని భ్రాంతితో ఉన్నదని భావించటమే అవిద్య. అందువలన, మాయ అవిద్య. అవిద్యకు హేతువు పంచభూతముల సంయోగముతో ఏర్పడిన ప్రకృతి. సత్త్వరజస్తమో గుణములు మూడూ ప్రకృతి జనితములే. అందువలననే, అవిద్య (అజ్ఞానము) త్రిగుణాత్మిక మని చెప్పబడింది.
సృష్టికార్యమునకు ముందు ఏర్పడిన మాయలో మూడు గుణములు సమపాళ్ళలో సమ్మిళితమై ఉండి ఉండాలి. అందువలన, అజ్ఞానము అనాది. యావత్ ప్రజానీకాన్ని ఆవరించి, వారి జ్ఞానమును కప్పివేసి ఉంటున్నది. అయితే, సత్త్వగుణము, రజోగుణము, తామస గుణము అందరిలో ఒకేపాలులో మిళితమై ఉండవు. అందుచేత, అందరూ ఒకే స్వభావముకలిగి ఉండరు. అంతేకాదు, మూడు గుణాలు సమపాలులో ఉంటే సృష్టి జరుగనే జరుగదు. మనకు దృశ్యమయే చరాచరముల ఉత్పత్తి అయేదికాదు. సంకల్పాదులకు హేతువు రజోగుణము.
‘‘మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్’’అని ఈశ్వర తత్త్వమును శ్రుతి స్పష్టము చేస్తున్నది (ప్రకృతి మాయా రూపమని మహేశ్వరుడే మాయను అధిష్ఠించి ఉన్న ప్రభువని తెలిసికొనుము- శే్వ.ఉ.4-10). సూక్ష్మబుద్ధిగలవారు, మాయచే మోహితులు కాక సత్యమును తెలిసికొనుటకు ప్రయత్నింతురు.
111. సన్నాప్యసన్నాప్యుభయాత్మికా నో
భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికా నో
సాంగాప్యనంగాప్యుభయాత్మికా నో
మహధ్రూతా‚ నిర్వచనీయరూపా॥
మాయ సత్పదార్థముకాదు, అసత్పదార్థము కాదు. మాయ సంభవము, మాయ అసంభవము అనియూ చెప్పబడదు. సత్ అసత్ ఉభయ లక్షణములు కలదని కూడా చెప్పశక్యముకాదు. అదే విధంగా, మాయ సావయవి అని కాని, నిరవయని అని కాని, ఉభయ విధములుగా మాయ అంగములుకలది-
అంగములు లేనిదని నిశ్చయముగా చెప్పబడదు. నానారూపాలలో ఉన్నదని కాని, ఒకే రూపంలో ఉన్నదని కాని చెప్పబడదు. శబ్దరూప రసాదులు లేని కారణంగా ఇంద్రియ గ్రాహ్యముకాదు. అనిర్వచనీయము, కావున, మాయ సర్వదా సంభ్రమాశ్చర్యములను కలిగించును. ఇంద్రుడు ఈశ్వరుడు, హిరణ్యగర్భుడు అనే పదాలను కార్యబ్రహ్మనుద్దేశిస్తూ ఉపనిషత్తులలో పురుషవాక్యప్రయోగముతో ‘సః’అని చెప్పడమైనది. నిర్గుణ పరబ్రహ్మము మాత్రము ‘‘తత్’’అనే నపుంసక లింగ ప్రయోగంతో నిర్దేశింబడింది. అయితే, కారణరూపమైన పరబ్రహ్మమును అద్వితీయము.
సత్యం శివం సుందరం
ఇంకాఉంది