మెయిన్ ఫీచర్

విజయం సాధించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు రెండు కప్పల్ని మింగాల్సి వస్తే ముందుగా పెద్దది మింగండి అంటాడు బ్రెయిన్ ట్రేసీ. ఇక్కడ కప్పలు అంటే నిజంగా కప్పలు కాదు.. సమస్యలు. ముందు ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటే.. ఆ అనుభవంతో రెండో చిన్న సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. చాలామంది తెలియక చిన్న సమస్యను ముందు చేపడతారు. దానికి ఎదురయ్యే ఇబ్బందులతోపాటు, పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలో అనే భయం పెరిగి చేసే పనిని మధ్యలో విడిచిపెడతారు. అర్థంలేని ఆలోచనలతో తమని అసమర్థులుగా తీర్చిదిద్దుకుంటారు.
ప్రతి వ్యక్తి కనీసం మూడు లక్ష్యాలను పెట్టుకోవటం మంచిదంటారు అనుభవజ్ఞులు. ఆ మూడూ కూడా మనకు అందుబాటులో ఉండేవి అయ్యుండాలి. ఉదాహరణకు నేను నెలకు కనీసం రెండు లక్షల రూపాయల ఆదాయం లభించే వ్యాపారం చేయాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, పరీక్ష పాసవ్వాలి, వివాహ జీవితం ప్రశాంతంగా ఉండాలి. ఇలా మీరు సాధించాలనుకున్నవి ఒక పేపరుమీద సాధించినట్లుగా రాసుకోవాలి. వాటిని మూడు రోజులపాటు రోజూ ఉదయం లేచి చదువుకోవాలి. నాలుగో రోజు ఉదయం లేచి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్‌లు తయారుచేసుకోవాలి.
మీరు ఖచ్చితంగా సాధించాలనుకుంటున్నది ఏమిటి? అది సాధ్యమేనా? గతంలో ఎవరైనా సాధించారా లేదా అనేది ప్రశ్న కాదు. సాధించే నమ్మకం మీకుందా.. రైట్ సోదరులను ఎంతమంది హేళన చేసినా, గాలిలో విమానం ఎగిరించగలమనే విశ్వాసం వారికుండటంవల్లనే అది సాధ్యం చేసి చూపించారు.
మీ లక్ష్యంవలన నిజంగా మీకు మంచి జరుగుతుందా! అనేది రెండో మెట్టు. డైనమైట్ కనిపెట్టిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌కి మంచి పేరు కన్నా చెడ్డ పేరే వచ్చింది. సమాజ నాశనానికి బాంబు కనిపెట్టాడన్నారు. అది గ్రహించిన నోబెల్ తనకొచ్చి ఆదాయంతో నోబెల్ శాంతి బహుమతి ఏర్పాటుచేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు పెట్టుకున్న లక్ష్యంవలన ఎవరికీ హాని జరుగకూడదు.
ఎంతకాలానికి మీరు లక్ష్యం చేరుకోగలరు అనేది మూడవ మెట్టు. మీరు సాధించవలసినదానికి ఒక సమయం నిర్ణయించుకోండి. అది నెల, రెండు నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు, అయిదేళ్ళు- ఇలా ఒక డెడ్‌లైన్ పెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రతిరోజూ మీ లక్ష్యానికి సంబంధించిన ఏదో ఒక పనిని చేస్తుండాలి.
ప్రతిదానికి ప్రణాళిక ఉండాలి. మీ లక్ష్యానికి సంబంధించిన పని చేయడానికి ఏ పని, ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక ముందుగా వేసుకోవాలి. ఆ ప్రణాళికను నిజాయితీగా ఆచరణలో పెట్టాలి. దానివలన వైఫల్యాలు ఉండవు. ఏ విజయం సాధించినా దాని ఫలితం అనుభవించేది మీరే కనుక బద్ధకం విడిచిపెట్టి ముందుకు సాగాలి.
వాయిదాల వ్యాధిని అంతమొందించటం మరో ముఖ్యమైన మెట్టు. మీకు తెలియకుండా చాపకింద నీరులాగా చేరి మిమ్మల్ని ముంచివేసే జబ్బు అది. రేపటి పని ఈ రోజే చేయాలని, ఈ రోజు పని ఇపుడే చేయాలనే నియమం పెట్టుకుని, నిష్టగా మీ పని మీరు చేసుకుపోతే వాయిదాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టే.
మధ్యలో సమస్యలు ఏ రంగంలోనైనా తప్పవు. సమస్యలు వచ్చినపుడు చతికిలపడిపోవడం పిరికివారి లక్షణం. సాహసవంతులు అలా కాదు. హోండా మోటార్స్ యజమాని హోండా మోటారు సైకిలును తయారుచేసినపుడు ఎనె్నన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఒకపక్క జపాన్‌లో ఆర్థిక సంక్షోభం, మరోప్రక్క ప్రపంచ యుద్ధం, నగరాలు భస్మం, భయంకరమైన డీజిల్ ఆయిల్ కొరత. అయినా తన ప్రయత్నం విడిచిపెట్టలేదు. చివరకు విజయం సాధించారు.
మీ విజయాన్ని చాలామంది గుర్తిస్తుంటారు. మీరు అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేసుకున్నారో కూడా ఇతరులు గమనిస్తుంటారు. దానివలన వారు కూడా మీరు చేరుకున్న స్థితికి అతి తక్కువ శ్రమతో చేరుకోగలరు. అందుకే మీరు ఎక్కడా ఆగకూడదు. విజయం ఒక నిరంతర ప్రయాణం! అని గుర్తించి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కాలి. విజయం అనితర సాధ్యం చేసుకోవాలి.

-పి.ఎం.సుందరరావు