మెయిన్ ఫీచర్

సేవే లక్ష్యంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలు, మహిళలు, బాలికలకు అండగా నిలువాలన్నదే ఆలోచన.. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలనే ఆకాంక్ష.. సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ల పట్ల అపరిమితమైన మమకారం.. ఇందుకోసం తాను ఎంచుకున్న మార్గంలో ప్రయాణం.. కడియం ఫౌండేషన్ బాసటగా ప్రయత్నాలు చేస్తోంది డా. కడియం కావ్య.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు.. పైగా డాక్టర్.. నిరుపేద మహిళల ఆరోగ్య సమస్యల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ, వారికి చికిత్స చేసే విలక్షణ వైద్యురాలు కావ్య. విద్యార్థి దశ నుండే సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగిన కావ్య ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పాథాలజిస్ట్‌గా పనిచేస్తోంది. వృత్తిలో తనదైన శైలిలో పేదలకు సహకరిస్తున్న డాక్టర్ కావ్య, సమాజ సేవ అనే ప్రవృత్తిని కూడా ఎంచుకుంది. అందుకే కడియం ఫౌండేషన్‌ను స్థాపించింది. దాన్ని ఆచరణాత్మకంగా నడుపుతోంది. చిన్ననాటి నుండే తోటివాళ్లకు సహకరించాలనే దాతృత్వం కావ్యది. అంతేకాదు ఆలోచనలోనూ, ఆచరణలోనూ తండ్రికి తగ్గ తనయ. పేదల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కావ్య భవిష్యత్తులో సామాజిగా డాక్టర్‌గా తన సేవలను విస్తరించాలనుకుంటోంది. కావ్య చదువుతున్న దశలోనే నిత్యం సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను ఆకళింపు చేసుకొని తనదైన శైలిలో సామాజిక సేవను విస్తరించాలని సంకల్పించింది. ఓసారి కొత్త సంవత్సరంలో ప్రవేశించే అర్ధరాత్రి వేళ తాను ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన.. ఆమెను పేదల పట్ల మరింత సేవాభావంతో, అంకితభావంతో పనిచేసేలా చేసింది. ఆ రాత్రి కేరింతలు, ఆర్భాటాలతో కొందరు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బస్సులోంచి బయటకు చూస్తే పేవ్‌మెంట్‌పై కాళ్ల ముడుచుకొని పడుకున్న ఓ వృద్ధుడు చలికి వణుకుతూ కనిపించాడు. వీళ్లకు కూడా కొత్త సంవత్సరమే అయినా.. వీరి మధ్య ఎంత తారతమ్యం? ఎంత వ్యత్యాసం? అనే భావన కలిగింది. అప్పటి నుండి పండుగలు, పర్వదినాల్లో సమాజంలో ఉన్న అందరూ జరుపుకోవాలన్న తలంపుకు వచ్చింది కావ్య. దాన్ని ఆచరణలో కూడా పెట్టింది. ఇప్పుడు కడియం ఫౌండేషన్ ద్వారా కడియం కుటుంబం పండుగలను జరుపుకుంటు న్నారు. ఆమె ఎప్పుడూ మహిళల ఆరోగ్య సమస్యలు, మెనుస్ట్రువల్ హైజీన్ గురించి పాటుపడుతుంటుంది. అందుకని అహర్నిశలూ వారి ఆరోగ్య సమస్యల పరిష్కారం, మహిళా సాధికారత దిశగా తాను ఎలా ఉపయోగకారిగా నిలుస్తాను అన్న ఆలోచనే కావ్యకు. ఎలాగైతే మహిళా విద్య కుటుంబానికి ఉపయోగకారి అవుతుందో, సమాజానికి మార్గ నిర్దేశం చేయగలదో అదేవిధంగా మహిళా ఆరోగ్యం మహిళా సాధికారతకు హేతువవుతుందని చెబుతుంటుంది కావ్య. ముక్కు సూటితనం, నిక్కచ్చి సమాధానాలు ఇవ్వడంలో తండ్రి అలవాట్లను పుణికి పుచ్చుకున్న కావ్య ఎప్పుడూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారికి ఆరోగ్యంపై పూర్తి అవగాహన కలగాలని, అలా సామాజిక ఆరోగ్యానికి ముందడుగు పడుతుందని కావ్య అభిప్రాయం. అలా మహిళా సాధికారతకు తొలి అడుగు పడుతుందని అనుకుంటోంది కావ్య. మహిళా సాధికారత పట్ల స్పష్టతతో ఉన్న కావ్య, ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళ కూడా అనారోగ్యం పాలయినప్పుడు సాధారణంగా వాళ్లెదుర్కునే నెలసరి, గర్భసంచి తదితర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు విధుల్లో వెనుకబడి పోతారు. ఇలా వెనుకబడిపోవడాన్ని మనం తరచూ చూస్తుంటాం. అందువల్ల ఆరోగ్యమే మహిళా సాధికారతకు తొలి అడుగు అంటారు డాక్టర్ కావ్య. బాలికా విద్య, మహిళా ఆరోగ్యం, సమాజంలో వివిధ రకాల రుగ్మతల కారణంగా తోటి వాళ్లతోనే సమ ఉజ్జీలుగా ఉండలేక పోతున్న వాళ్ల పట్ల కావ్య ప్రత్యేకించి కార్యక్రమాలను రూపకల్పన చేసింది. మూడేళ్ల క్రితం బాలికలు స్కూలు మధ్యలో మానేయడానికి ప్రధాన కారణంగా ఉన్న మెనుస్ట్రువల్ అంశంపై ఒక ప్రత్యేక ప్రాజెక్టును అమల్లోకి తెచ్చింది కావ్య. తండ్రి కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న దశలో బాలికల సానిటేషన్ కిట్ ప్రభుత్వపరంగా ప్రవేశపెట్టడానికి చాలా కృషి చేసింది. తన సంస్థ కడియం ఫౌండేషన్ ద్వారా మెనుస్ట్రువల్ హైజీన్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా, నిరాఘాటంగా నిర్వహిస్తూ వస్తోంది కావ్య. మూడు సంవత్సరాలుగా సుమారు లక్షకుపైగా మెనుస్ట్రువల్ హైజీన్ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఇప్పటివరకు మొత్తం యాభై పైచిలుకు కార్యక్రమాలు నిర్వహించింది కావ్య.
బాలికా విద్య ప్రాముఖ్యతపై తనదైన దుక్పథాన్ని అమలుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కడియం ఫౌండేషన్‌కు కావ్య ఒక చుక్కాని. అందులో భాగంగానే బాలికలు బడి మానకుండా హైజీన్ ప్రాజెక్టును అమలుపరుస్తూనే, పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టులు, ఐడెంటీకార్డులు తమ సంస్థ ద్వారా పంపిణీ చేస్తోంది. కావ్యకు పేదల పట్ల అపరిమితమైన జాలి, ప్రేమ. అందుకే చలికి వణుకుతూ మురికివాడల్లో జీవనం వెళ్లదీస్తున్న పేదలకు బ్లాంకెట్లను పంపిణీ చేస్తూ సేవా నిరతి చాటుకుంటోంది. తండ్రి కడియం క్రమశిక్షణ, భర్త డా. నజీర్ ఆలోచనా సరళిని ప్రోధి చేసుకొని తన అంకిత భావాన్ని ఆచరణలో చూపుతోంది కావ్య.

- నార్లగిరి యాదగిరి ఆంధ్రభూమి బ్యూరో, వరంగల్