మెయిన్ ఫీచర్

అవాస్తవమే అజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
నిత్యవస్తువు, వికార రహితము. అందువలన, శరీర ధర్మములేవీ ఆత్మకు వర్తింపవు.
137. ప్రకృతి వికృతి భిన్నః శుద్ధబోధ స్వభావః
సదసదిద మశేషం భాసయన్నిర్విశేషః
విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థా
స్వహమహమితి సాక్షాత్సాక్షిరూపేణ బుద్ధేః॥
అవిద్యకు ఆశ్రయభూతమైన ప్రకృతికి, ఆకాశాది వివర్తరూపములకు భిన్నముగా నిర్విశేష ప్రజ్ఞానఘనమైనది పరమాత్మ అదియే మూర్తామూర్తములతో కూడియున్న యావద్విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నది. పరమాత్మ స్వరూపమైన ప్రత్యగాత్మ, జాగ్రదాది త్రివిధ అవస్థలందు శరీరములో జరిగే సకల వ్యవహారములకు, బుద్ధికి సాక్షిగా ప్రవర్తిస్తూ, ప్రత్యక్ష రూపములో ‘నేను-నేను’అని విరాజమానమై ఉన్నది.
138. నియమితమనసాముం త్వం స్వమాత్మనమాత్మ
న్యయమహమితి సాక్షాద్విద్ధి బుద్ధిప్రసాదాత్‌
జని మరణ తరంగాపార సంసార సింధుం
ప్రతర భవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః॥
నీవు నిశ్చలమనస్సుతో బుద్ధిని వినియోగించి, ఆ పరమాత్మనే నేను అనే నిర్ద్వంద్వ భావనతో, స్వస్వరూపమైన ఆత్మను సాక్షాత్కారము చేసికొనుము. నీవు జనన మరణములనే తరంగములుగల ఈ గంభీరమైన సంసార సముద్రమును దాటివేసి, బ్రహ్మస్వరూపమును పొంది కృతార్థుడవు కమ్ము.
మనోనిగ్రహమే మోక్షప్రాప్తికి ముఖ్య సాధనము. నిశ్చలమనస్సుతో బ్రహ్మత్వసిద్ధికొరకు పరమాత్మయందే బుద్ధిని నిల్పి ఏకాగ్రతతో ధ్యానము సల్పిన ఆత్మసాక్షాత్కారము పొంద శక్యము. ‘‘మనసస్తు పరాబుద్ధిర్బుద్ధేరాత్మామహాన్ పరః’’ (మనస్సుకంటె బుద్ధి గొప్పది, బుద్ధికన్ననూ శ్రేష్ఠమైనది జీవాత్మ-క.ఉ.1-3-15) అందువలన, స్థిరబుద్ధిని ముందుగా సాధించి, దాని సహాయముతో ఆత్మ దర్శనమునకు ఉపక్రమించవలెనని బోధించిన పిదప మృత్యుదేవత నచికేతునకు చేసిన ఆత్మబోధన ఇలా కొనసాగినది. ‘‘మనసైవేద మాప్తవ్యం నేహ నానాస్తి కించన’’ (పరమాత్మ స్వరూపము కేవలము మనస్సుచేతనే పొందబడుతుంది. బ్రహ్మతత్త్వంలో నానాత్వము, విలక్షణము లేనే లేదు- క.ఉ.2-1-11).
‘‘సో‚ హం’’, ‘అతని స్వరూపమే నేను’ తద్భిన్నము కాదు అనే జీవేశ్వరుల ఏకత్వభావనతో ధ్యానములో నిమగ్నమైన, బ్రహ్మత్వసిద్ధి కల్గును. అప్పుడు సంసారబంధము తెగిపోయి జనన మరణమునకు అధిగమించ సాధ్యమనే ఉపదేశముతో ఈ భాగము సమాప్తమైనది.
139. అత్రానాత్మన్యహమితి మతిర్బన్ధ ఏషో‚ స్య పుంసః
ప్రాప్తో‚ జ్ఞానా జ్జనన మరణ క్లేశ సంపాతహేతుః
యేనైనాయం వపరిద మసత్సత్యమిత్యాత్మ బుద్ధ్యా
పుష్యత్యు క్షత్యవతి విషయైస్తస్త్భుః కోశకృద్వత్‌॥
అజ్ఞానవశాత్తు ప్రాప్తమైన ఈ అసద్వస్తువైన దేహమును, యథార్థమును తెలిసికొనజాలక శరీరమే నేను అనే అపోహతో, శరీరముతో తాదాత్మ్యం చెంది, దాని పోషణ, వృద్ధి, రక్షణాదులపై శ్రద్ధ వహించే వ్యక్తి బంధమును విడలేక శోకమును అనుభవించక తప్పదు. గొంగళీపురుగు వంటి ప్రాణులు వాటి దేహములో ఉన్న రసములతోనే రక్షణకొరకు గూడు అల్లుకొని, ఆ వలయంలోనే చిక్కుకొని బయటపడలేక మరణిస్తున్నవి. అదే విధముగా, ఆత్మతత్త్వమును తెలిసికొనుటలో శ్రద్ధ వహించని మనిషి, మనోనిగ్రహములేక విషయలోలుడై సంసారబంధములో చిక్కుకొని పోతున్నాడు. అట్టి వ్యక్తి దుఃఖమును అధిగమించలేడు.
140. అతస్మింస్తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా
వివేకాభావాద్వై స్ఫురతి భుజగే రజ్జ్ధుషణా

తతో‚ నర్థవ్రాతో నిపతతి సమాధాతు రధికః
తతో యో‚ సద్గ్రాహః స హి భవతి బన్ధః శృణు సఖే॥

తామస ప్రవృత్తిగల మూఢుడు ఆత్మను శరీరమని భావించును. అది సత్యదూరము, కేవలము భ్రాంతి అయినా అజ్ఞానముచే ఆవరింపబడిన వాని బుద్ధి యథార్థతను గ్రహించలేదు. వ్యతిరేక బుద్ధితో అధర్మమును ధర్మముగా భావించును. సర్పమును రజ్జువనే అపోహతో దాని చెంతకుపోయి చేతితో పట్టుకొనుటకు ప్రయత్నించిన మృత్యువు సంభవించే ప్రమాదము తప్పదు కదా! అట్లే, వివేకము కోల్పోయి ఈ క్షయగ్రస్తమయే శరీరతత్త్వమును ఎఱుగక, దానిని ఆత్మగా భావించడమే సంసారబంధమునకు కారణవౌతున్నది. ఓ మిత్రమా! నీవు సమ్యక్ జ్ఞానముతో యథార్థతను గ్రహించిన, జన్మరాహిత్యమును పొందుదువు. మృత్యువును అధిగమించి పరమ సుఖమును అనుభవించెదవని తెలిసికొనుము.
సంసార బంధము ఏ కారణమువలన ఏర్పడుతున్నదో ఇప్పుడు బోధించబడుతున్నది.
141. అఖణ్డ నితాయద్వయబోధశక్త్యా
స్ఫురన్తమాత్మాన మనన్త వైభవమ్‌
సమావృణో త్యావృతిశక్తి రేషా
తమోమారుూ రాహు రివార్కబిమ్బమ్‌॥
పరమాత్మ నిత్యమూ ఉండే అద్వితీయ అఖండ జ్ఞాన స్వరూపము. తత్స్వరూపమైన, ప్రత్యగాత్మ స్వతేజస్సుతో ప్రకాశిస్తూ శరీర ధారుడికి జ్ఞానమును ప్రసాదిస్తున్నది. ఆత్మవైభవము అనంతము, కాని, వ్యక్తిలోగల తమోగుణముయొక్క ఆవరణ శక్తిచే, జ్ఞాన స్వరూపమైన ఆత్మ ఆవరింపబడి వానిని అజ్ఞానవంతుని చేస్తున్నది, గ్రహణ కాలములో రాహుగ్రహము సూర్యబింబమును కప్పివేసి, సూర్యుని తేజస్సుకు అడ్డు పడుతున్నట్లు, ఆవరణశక్తి, జ్ఞానమును కప్పివేసి నిరోధిస్తున్నది.శ్రుతి పరమాత్మను ‘‘ప్రజ్ఞానఘనం’’, ‘‘సత్యం జ్ఞానం అనంతం’’ అని నిర్దేశించింది.

- ఇంకావుంది...