మెయిన్ ఫీచర్

తుమ్ములతో బాధపడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుబు, ఎలర్జీ, ఏదైనా వాసన కారణంగా చాలామందికి తరచుగా తుమ్ములు వస్తుంటాయి. ఎప్పుడైనా ఈ రకమైన వరుసగా తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుమ్ములు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడతాయి. తుమ్ములు అనేవి చికాకులు, సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి శరీరం యొక్క సహజమైన మార్గం. ఇటువంటి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహజమైన మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు. ఇది ప్రస్తుతం శీతాకాలం కాబట్టి చాలామంది జలుబు, తీవ్రమైన తుమ్ములతో బాధపడుతుంటారు. వీటిని తగ్గించడానికి కొన్ని సహజ మార్గాలను తెలుసుకుందాం. వీటిని అనుసరించడం ద్వారా తుమ్ములను నివారించవచ్చు.
* సిట్రస్ పండ్లలో ఫ్లేవనాయిడ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లలో నిర్దిష్టమైన రసాయనాలు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇది శరీరంపై దాడిచేసే అవాంఛిత బాక్టీరియా, ఇతర ఎలర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. శీతాకాలంలో రోజూ ఈ పండ్లను తింటే శరీరం మెరుగుపడుతుంది.
* జింక్ ఆహారాలు జలుబు లేదా తుమ్ముల సమస్య ఉన్నవారికి జింక్ తినడం మంచిది. జింక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చిక్కుళ్ళు, విత్తనాలు, ధాన్యాలలో జింక్ ఉంటుంది.
* గూస్బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. రోజూ గూస్బెర్రీని తినడం వల్ల తుమ్ములు తగ్గుముఖం పడతాయి.
* నల్ల యాలకులు సుగంధ మసాలాలో ఒకటి. ఈ మసాలా భారతీయ వంటల్లో ఉపయోగించే సాధారణ పదార్థం. తుమ్ములతో బాధపడేవారు రోజూ రెండుయాలకులను నోట్లో వేసుకుని నమలాలి. దీనివల్ల శ్వాస మార్గంలో శే్లష్మం ప్రవాహాన్ని సాధారణీకరించడానికి సహాయపడుతుంది.
* తులసిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే.. తులసి ఆకు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన ఇనె్ఫక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
* వెల్లుల్లిలోని పదార్థాలు ఇబ్బందికరమైన ఎలర్జీ సమస్యతో పోరాడటానికి సహాయపడతాయి. వెల్లుల్లిలోని ప్రత్యేకమైన పదార్థం అల్లిసిన్. ఇది శ్వాసకోశంలోని శే్లష్మం పెరగడాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి తుమ్ముల సమస్య నుండి బయటపడటానికి కొన్ని వెల్లుల్లిలను పళ్ళ మధ్య ఉంచి తర్వాత బ్రష్ చేసుకుని నోటిని శుభ్రం చేసుకోవాలి. *