మెయిన్ ఫీచర్

పండుగవేళ పరికిణీ అందాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓణీ.. పరికిణీ..
తెలుగు కనె్నపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న
కుర్రాడికి..
ఓణీయే ఓంకారం!!
పరికిణీయే పరమార్థం!!
అని తనికెళ్లభరణిగారు అమ్మాయిల పరికిణీ, ఓణీల గురించి ఎంతో అందంగా చెప్పారు. పరికిణీ, ఓణీల అందం అలాంటిది మరి.. పదహారు సంవత్సరాల అమ్మాయిలు పరికిణీ, ఓణీలను ధరించి వయ్యారంగా అలా నడుస్తూ ఉంటే.. అప్సరసలే దివి నుంచి భువికి దిగివచ్చి నడయాడుతున్నారా.. అనిపిస్తుంది. ముఖ్యంగా పండుగల్లోనూ, వేడుకల్లోనూ అమ్మాయిలు పరికిణీ, ఓణీలను ధరిస్తే వారిని అలా చూస్తూండిపోవాల్సిందే.. ఒకప్పుడు పరికిణీ, ఓణీలు అమ్మాయిలు మాత్రమే వేసుకునేవారు. కానీ నేడు అలా కాదు. వారితో పాటు పెళ్లయినవారూ వేసుకుంటున్నారు. అయితే అమ్మాయిలు వేసుకునే ఓణీలకు, పెళ్లయిన వారు వేసుకునే ఓణీలకు కొద్దిపాటి తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించుకోవాలి. పండుగల్లో కానీ, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు.. జీన్స్, స్కర్టులు వేసుకునే అమ్మాయిలు.. ఒక్కసారిగా పరికిణీ, ఓణీల్లోకి మారిపోతారు. అదీ ఆ దుస్తుల ప్రత్యేకత. అమ్మాయిలు ఎన్ని రకాల ఫ్యాషన్లు ఫాలో అయినా పరికిణీ, ఓణీలు మాత్రం అమ్మాయిలకు ఎప్పుడూ ప్రత్యేకమే..
* సంక్రాంతి పండుగవేళ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించాలి.. సంప్రదాయబద్ధంగా ఉండాలని అనుకునేవారికి కంచిపట్టు, గద్వాల్, పోచంపల్లి పట్టు, మంగళగిరి కాటన్ పరికిణీలు బాగుంటాయి. వీటికి జతగా ఎంబ్రాయిడరీ చేసిన పట్టు బ్లవుజులు, షిఫాన్ దుపట్టాలు సరైన ఎంపిక.
* పట్టుపై ఇక్కత్ అందాలు మరింత కొత్తదనాన్ని తీసుకొస్తాయి. వేడుకలప్పుడు మరింత ఆడంబరంగా కనిపించాలనుకుంటే మెరుపులీనే సిల్క్ కోటా వస్త్రాన్ని ఎంచుకుని క్రష్ చేయించుకోవాలి. దీనిపై బంగారు రంగులో బ్లాక్‌ప్రింట్ చేయించుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపించవచ్చు.
* పండుగల వేళ పరికిణీ, ఓణీలను ఎంచుకోవాలనుకున్నప్పుడు బ్లవుజ్ డిజైన్, క్లాత్ అన్నీ సంప్రదాయంగా ఉండాలనుకుంటే పరికిణీ, ఓణీలు కలిపి కుట్టినవి దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకోవచ్చు.
* కంచిపట్టు పరికిణీపై బాందినీ, బెనారస్, జార్జెట్ ఓణీలు బాగుంటాయి. ఇక బ్లవుజు విషయానికి వస్తే శరీర తీరుని బట్టి ఎంచుకోవచ్చు. డీప్‌నెక్ అనేది ఎవ్వరికైనా బాగుంటుంది. అది వద్దు అనుకునేవారికి హైనెక్‌ను ఎంచుకోవచ్చు. చేతులకు చిన్న బుట్ట వచ్చే లా కుట్టించుకుంటే మరింత అందంగా ఉంటుంది. పాతకాలం డిజైన్ కావాలనుకుంటే మోచేతివరకూ కుట్టించుకోవచ్చు.
* సన్నగా ఉన్నవారికి బోట్‌నెట్, మోచేతివరకు చేతులు బాగుంటాయి. డబుల్ నెట్ వస్త్రాన్ని ఎంచుకుంటే కాస్త లావుగా కనిపించవచ్చు. లేకపోతే బెనారస్, హెవీ రా సిల్క్ వంటివి ప్రయత్నం చేయవచ్చు.
* లావుగా ఉన్నవారికి షిఫాన్, జార్జెట్, బెనారస్ వంటివాటిని ఎంచుకోవచ్చు. ఓణీలో షిఫాన్, జార్జెట్ ఆడంబరంగా కనిపించేలా చేస్తాయి.
* బంగారు రంగు జాకెట్టు అదనంగా ఉంటే ఏ తరహా పరికిణీకయినా జతగా వేసుకోవచ్చు.
* ఎత్తు తక్కువగా ఉన్నవారు జాకెట్టు, పరికిణీ ఒకే రంగులో ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. అలాగే పొడవుగా ఉండేవారు ఎక్కువ రంగుల్ని ఎం చుకోవడం వల్ల ఎత్తుగా కనిపించకుండా ఉంటారు.
* సంక్రాంతి పండుగంటే ఆటలు.. కోలాహలం.. ఇలాంటి వాటికి బాందినీ, లెహేరియా, టై అండ్ డై రకాల పరికిణీ, ఓణీలుగా ఎంచుకోవచ్చు. వీటిపై అద్దాలు, గుజ్రీ పనితనం బాగుంటాయి. వేరు వేరు రంగుల్లో పరికిణీలు సందర్భానుసారంగా ఉంటాయి.
* రాసిల్క్‌కి జతగా జామెట్రికల్, పూల ప్రింట్లున్న డిజైన్లను ఎంచుకుంటే ఆ అందమే వేరు. ప్రింటెడ్ వస్త్రంపై అదనంగా మరేదైనా ఎంబ్రాయిడరీ పనితనం చేయించుకోవచ్చు.