మెయిన్ ఫీచర్

అహం ఉంటే అమ్మ దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
161. త్యజ్మాంసమేదో‚ స్థి పురీషరాశా
వహంమతిం మూఢజనః కరోతి
విలక్షణం వేత్తి విచారశీలో
నిజస్వరూపం పరమార్థ్భూతమ్‌॥
వివేకశూన్యుడైన మూర్ఖబుద్ధిగలవాడు, చర్మమాంసోపేత అస్థిరాశితోను, మలమూత్రాది పదార్థములతో నిండియున్న శరీరమే నేను, అనే భ్రాంతి కల్గిఉండును. కాని, విచారణచేసే సమర్థతగల వ్యక్తి, యథార్థతను గ్రహించి, త్రికాలాతీతమైన ఆత్మ తన స్వస్వరూపమని తెలిసికొనును.
162. దేహో‚ హ మిత్యేవ జడస్య బుద్ధి
ర్దేహే చ జీవే విదుష స్త్వహంధీః
వివేక విజ్ఞానవతో మహాత్మనో
బ్రహ్మాహ మిత్యేవ మతిః సదాత్మని॥
వివేక శూన్యుడైన మూర్ఖపు బుద్ధిగలవాడు దేహమే ఆత్మ అనే భ్రాంతి కల్గిఉండును. సామాన్య శాస్తజ్ఞ్రానమున్న పండితుడు కూడ, ప్రాపంచిక వ్యవహారంలో దేహముపైనా, స్వర్గ్భోగాసక్తితో వైదిక కర్మలందు ఆసక్తిపెంచుకొనును. నిత్యానిత్య వివేకము, ఆత్మానాత్మ జ్ఞానముకల విజ్ఞానవంతుడు మాత్రము, ఆత్మతత్త్వమును సమగ్రంగా తెలిసికొని, అద్వైతభావన పెంపొందించుకొని, ‘నేను’అనే నా ఆత్మ పరబ్రహ్మ స్వరూపము తప్ప వేరొకటి కాదనే నిశ్చితబుద్ధికల్గి ఉండును.

163. అత్రాత్మబుద్ధిం త్యజ మూఢబుద్ధే
త్వజ్మాంసమేదో‚ స్థి పురీషరాశౌ
సర్వాత్మని బ్రహ్మణి నిర్వికల్పే
కుర్యుః శాన్తిం పరమాం భజస్వ॥
ఓ అల్పబుద్ధీ! చర్మము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, పురీషములతో నిండి ఉన్న ఈ దేహమే ఆత్మ అనే అజ్ఞానమును అంతము చేయుము. సర్వాత్మకమైన నిర్వికల్ప పరబ్రహ్మముపై నీ బుద్ధిని స్థిరముగా నిల్పి, ‘నేను’పరమాత్మ స్వరూపమని తెలిసికొనుము, ఏకత్వ భావనతో పరమాత్మను తలచుకుంటూ (్ధ్యనిస్తూ) నిరవధిక శాంతిని పొందుము.
164. దేహేన్ద్రియాదావసతి భ్రమోదితాం
విద్వా నహంతాం న జహాతి యావత్‌
తావన్న తస్యాస్తి విముక్తివార్తా
ష్యస్త్వేష వేదాన్తనయాన్తదర్శీ॥
వేదాధ్యయనము చేసి, వేదాంతములో మహాపండితుడు అగుగాక! కాని దేహేంద్రియ మనోబుద్ధ్వాదులు నశ్యములు, సత్పదార్థములు కావనే జ్ఞానము లేక, శరీరాభిమానముతో దేహమే నేను అనే అహంభావనమును ఎంతవరకు విడువడో, అట్టి విద్వాంసుడు ముక్తిపొందే ప్రసక్తే ఉండదు. నేను పరమాత్మ స్వరూపమును అనే బ్రహ్మాత్మభావన బుద్ధిలో స్థిరముగా నిలువనంతవరకు, శాస్తజ్ఞ్రానము ఎంత ఉన్ననూ, అది బంధవిముక్తికి దోహదము కాదు.
165. ఛాయా శరీరే ప్రతిబింబగాత్రే
యత్స్వప్నదేహే హృదికల్పితాంగే
యథాత్మబుద్ధిస్తవ నాస్తి కాచిత్
జీవచ్ఛరీరే చ త థైవ మాస్తు॥
నీ నీడను నీవు చూచినపుడు, అద్దములో ప్రతిబింబించిన నీ శరీరము నీకు కన్పడినప్పుడు, స్వప్నములో నీ శరీరము దృశ్యమైనప్పుడూ, జాగ్రదవస్థలో కూడ నీ ఊహతో నీవు కల్పించుకొనిన శరీరముపైనా ఎట్టి తాదాత్మ్యము, మమకారము నీకు కల్గదుకదా! ఆ ప్రకారమే, ప్రాణముతోసహా ఉన్న నీ ఈ శరీరంపై కూడా, నీవు ఎన్నడూ ఆత్మాభిమానము పెంచుకొనవద్దు.
166. దేహాత్మధీరేవ నృణా మసద్ధియాం
జన్మాదిదుఃఖ ప్రభవస్య బీజమ్‌
యతస్తతస్త్వం జహి తాం ప్రయత్నాత్
త్యక్తే తు చిత్తే న పునర్భవాశా॥
సద్వస్తువుకాని శరీరముపై అహంభావము (నేననే భావము)కల్గి దానిపై అభిమానము చూపే మనుష్యులకు, దేహామే ఆత్మ(దేహాత్మ) బుద్ధి ఉత్పన్నవౌను. ఈ భ్రాంతియే జనన మరణములకు కారణము. అదే వారి దుఃఖములకు మూలము. అందువలన, దేహమే ఆత్మ అనే బుద్ధిపోవుటకు దృఢ సంకల్పముతో తీవ్ర ప్రయత్నము చేయవలెను. శ్రవణమననాది సాధనలతో అసద్వస్తువైన శరీరముపై పెంచుకున్న మోహమును చిత్తశుద్ధితో నిర్మూలించుకొని, ఆత్మవిచారణచేసిన, దేహాత్మబుద్ధి మరలిపోయి బ్రహ్మాత్మకతా భావము పొంద శక్యము. అపుడే సంసారముపై ఎట్టి మోహము కలుగదు.
ప్రాణమయకోశము
167. కర్మేంన్ద్రియైః పంచభి రంచితో‚ యం
ప్రాణో భవేత్ప్రాణమయన్తు కోశః
యేనాత్మవా నన్నమయో‚ నుపూర్ణః
ప్రవర్తతే‚ సౌ సకల క్రియాసు॥
ఐదు కర్మేంద్రియములు ప్రాణశక్తిపై ఆధారపడి ఉన్నవి.
- ఇంకావుంది...