మెయిన్ ఫీచర్

ఆర్థికంగా ఎదగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచమంతటా ఆర్థిక అవకాశాల్లో ఉన్న లింగ అసమానత సమసిపోవడానికి మరో రెండు వందల సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక గత ఏడాది అంచనా వేసింది. ఉద్యోగాల్లో, విధుల్లో లింగ వైవిధ్యం అధికంగా ఉంటే వ్యాపారాలకు చాలా లాభాలు ఉంటాయి అని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ.. అక్కడ లింగ సమానత్వానికి ఇంకా రెండు వందల సంవత్సరాలు పడుతుందట. ఈ నేపథ్యంలో మహిళలు తమ కెరీర్‌లో ఎదగడానికి కొన్ని సూచనలు చేశారు లీడర్‌షిప్ కోచ్‌గా పనిచేస్తోన్న శాలీ హెల్గెసెస్. శాలీ సూచనలు మహిళలకే కాదు, పురుషులకూ పనికొస్తాయి. ఆ సూచనలేంటో చూద్దామా..
పొరపాట్లను వదిలిపెట్టాలి..
పనిలో చేసే పొరపాట్ల గురించి పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని, అది మహిళలను ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతుందట. ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన సమస్యే.. దానికి బదులుగా ఇలాంటివి జరిగినప్పుడు చిన్న విరామం తీసుకోవాలట.. అంతేకాదు ఎవరికి వారే నచ్చజెప్పుకుని అంతటితో పొరపాట్లను వదిలివేయాలట.
మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోకూడదు..
మహిళల్లో భౌతికంగానూ, మాట్లాడటంలోనూ తమను తాము చిన్నగా నిరూపించుకునే వైఖరి కూడా ఉంటుందట. తమ స్థానంలో తాము ఉన్నామన్న సాధికారంతో కాకుండా.. అపాలజీ చెబుతుండటం, ప్రతిదాన్నీ రిక్వెస్ట్‌గా చెప్పడం వంటివి మహిళలు ప్రదర్శించే లక్షణాలు.. ఇలాంటి సమయంలో.. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఒక నాయకురాలు స్థానంలో నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీ స్థానంలో మీరు బలంగా నిలబడాలి. మీరు సంపూర్ణులని, పూర్తి సాధికారత కలవారని మీకు మీరుగా అనుకోవాలి.
నో చెప్పాలి..
ఇంతకుముందు కెరీర్‌లో సాయపడిన వైఖరి.. మీరు ఎదగాలి అనుకుంటున్నప్పుడు అవరోధంగా మారవచ్చు. కొన్ని అంశాల్లో నో చెప్పకపోతే మహిళలు ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చు. ముందుగా మహిళ తన పరిధులను విస్పష్టంగా కాపాడుకోవాలి. ఏదైనా పని చేసేముందు అది మీ కెరీర్‌కి ఉపయోగపడుతుందా? లేదా? అని ఒక్క క్షణం ఆలోచించాలి.
ఖచ్చితత్వం
అన్ని పనులు పూర్తి ఖచ్చితత్వంతో చేయాలనుకునే పర్‌ఫెక్షనిస్టుగా ఉండటం వల్ల కొంతమందికి సమస్యలా తయారవుతుంది. ఎందుకంటే కొన్ని పనులు నిబద్ధతతో చేసే మనుషులకే అప్పజెప్తారు.. సంస్థల్లో ఖచ్చితత్వంతో, తప్పులు చేయకుండా పనిచేసే మహిళలకు రివార్డులు లభిస్తుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కెరీర్‌లో పై స్థాయికి వెళ్లటానికి ఖచితత్వం నుంచి పక్కకు తప్పుకుని.. అప్పుడప్పుడూ రిస్క్ కూడా చేస్తుండాలట.
విజయాలు
మీరు చేసిన కృషిని ఇతరులు అప్పటికప్పుడు గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తారనో, రివార్డు ఇస్తారనో భావించడం తెలివితక్కువట. అయినప్పటికీ తాము సాధించిన విజయాల గురించి మాట్లాడకుండా వౌనంగా ఉండే వాళ్లు తరచుగా తారసపడుతుంటారట. ఎందుకంటే.. దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. ‘నేను బాగా పనిచేస్తే వాళ్లు గుర్తించాలి కానీ.. నేను చెప్పుకోవడమేమిటి?’ అనేది ఒక కారణమైతే.. ‘గుర్తింపు పొందటానికి ఆరాటపడేవారిలా తామూ ప్రవర్తించేకంటే తమకు గుర్తింపు రాకపోయినా ఫర్వాలేదు’ అనేది మరో కారణం. కానీ ఈ విధంగా ఆలోచించడం కెరీర్‌లో ఎదగడానికి దారులు లేకుండా చేస్తాయి అని హెల్గెసెస్ అంటారు. దీన్ని మార్చుకోవాలంటే ముందుగా మహిళలు తమలో ఉన్న శక్తిని గుర్తించాలి అని చెబుతున్నారు వారు.
ఇలా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తే మహిళలు తమ కెరీర్‌లో రాకెట్‌లా దూసుకెళ్లగలరు. *