మెయన్ ఫీచర్

కాశ్మీర్ కల్లోలానికి కారకులెవరంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భారతదేశంలో విలీనమై ఈ నెల 26 నాటికి సరిగ్గా 69 వసంతాలు గడిచాయి. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం 1947’కు లోబడి- ‘నేను.. అనగా శ్రీమాన్ ఇందర్ మహేందర్ రాజరాజేశ్వర్ మహా రాజాధిరాజ శ్రీ హరిసింగ్ జీ, జమ్మూ కాశ్మీర్ నరేశ్ తథా టిబెట్ ఆది దేశాధిపతి, జమ్మూ కాశ్మీర్ పరిపాలకుడిగా ఈ ప్రాంతంపై నాకున్న సంపూర్ణ అధికారాలను వినియోగిస్తూ, విలీన ఒప్పందాన్ని అమలుచేస్తున్నాన’ని ప్రకటించి 1947 అక్టోబర్ 26న సంతకం చేశారు. రాజా హరిసింగ్ చేసిన ఈ విలీన ఒప్పందాన్ని అంగీకరిస్తూ మరుసటి రోజు అంటే 1947 అక్టోబర్ 27న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వౌంట్ బాటన్ సంతకం చేశారు.
స్వాతంత్య్ర పోరాటం ఫలితంగా ఆంగ్లేయులు మన దేశం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమైన సమయంలో వివిధ రాజవంశీకుల అధీనంలో 565 సంస్థానాలు ఉండేవి. ఇవన్నీ భారత్‌లో విలీనం అయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం-1955’ తీసుకువచ్చారు. విలీన ఒప్పందాన్ని మొదట్లో కొన్ని రాజకుటుంబాలు వ్యతిరేకించినా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి చాలా సంస్థానాలు విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మిగతా సంస్థానాధీశులు చేసిన విలీన ఒప్పందానికి, జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ చేసిన ఒప్పందానికి ఎటువంటి భేదాలు లేవు. మిగిలిన సంస్థానాలన్నీ దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతుండగా, జమ్మూ కాశ్మీర్ మాత్రం ఇప్పటికీ రావణకాష్ఠంలా కాలుతూ దేశం నెత్తిన కుంపటిలా ఇప్పటికీ ఎందుకు భారంగా మారిందన్న ప్రశ్నకు- దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మత్రమే కారణం.
వ్యక్తిగత రాగద్వేషాలకు లోబడిన నెహ్రూ మొదట్నుంచీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి అన్యాయం చేస్తూ వచ్చారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆయన చేసిన తప్పులు రాచపుండులా మారి దేశ జవసత్వాలను నేటికీ పీల్చివేస్తున్నాయి. కాశ్మీర్‌లో పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా మతం ఆధారంగా జిహాదీ తీవ్రవాదానికి ప్రాణం పోస్తున్నాయి. నెహ్రూ తప్పుడు విధానాలకు దేశం ఇప్పటికీ భారీ మూల్యం చెల్లిస్తుండగా, వేలాది మంది మన జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవల్సిన దుస్థితి ఏర్పడింది.
అది- 26 అక్టోబర్ 1947. అప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి మెహర్‌చంద్ మహాజన్ దేశ ప్రధాని నెహ్రూతోపాటు ఇతర ప్రముఖ నాయకులను కలవడానికి వి.సి.మీనన్‌తో కలిసి ఢిల్లీకి వచ్చారు. మహాజన్ రాకకు రెండు ప్రధాన ఉద్దేశాలున్నాయి. ఒకటి- జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ రాజా హరిసింగ్ చేసిన ఒప్పంద పత్రాన్ని దేశ నాయకులకు అందిస్తూ, ఆ ప్రాంతానికి భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను రూపొందించుకోవడం. రెండు- కొత్తగా ఏర్పడ్డ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌ను ఆక్రమించుకోవడానకి 22 అక్టోబర్ 1947న మొదలుపెట్టిన దాడులను తిప్పికొట్టేందుకు సైన్యాన్ని పంపవల్సిందిగా కోరడం. అప్పటికే పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ ప్రాంతంలోని అధిక భూభాగాన్ని ఆక్రమించుకున్నది. జమ్మూ కాశ్మీర్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై నెహ్రూ నిర్లక్ష్యవైఖరి చూపించారు. కాశ్మీర్‌ను రక్షించుకునేందుకు సైన్యాన్ని పంపవల్సిందిగా మహాజన్ చేసిన విజ్ఞప్తులతో చిరాకుపడ్డ నెహ్రూ- ‘పోయిన భూభాగాలను తిరిగి తెచ్చుకోగల సామర్థ్యం భారత్‌కు ఉందిలే..’ అని నిర్లక్ష్యంగా చెప్పారు. నెహ్రూ వైఖరితో ఖిన్నుడైన మహాజన్- ‘అయితే.. మేం పాకిస్తాన్‌తోనే విలీనం అవుతాం’ అన్నప్పుడు సర్దార్ పటేల్, వి.పి.మీనన్‌లు అడ్డుపడ్డారు. కాశ్మీర్ ‘పాకిస్తాన్ వైపునకు వెళ్ళకూడదన్న’ది వీరి అభిప్రాయం. జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు వీరిద్దరూపడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. చర్చలు జరుగుతున్న గదికి పక్కనే ఉన్న భారత వ్యతిరేకి, జమ్మూ- లడ్డాఖ్‌ల వ్యతిరేకి ‘నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు’ షేక్ అబ్దుల్లా పంపిన ఒక్క చిన్న చీటీని బంట్రోతు తెచ్చి నెహ్రూకు ఇచ్చాడు. ఆ చీటీ చూడగానే నెహ్రూ ముఖం వెలిగిపోయింది. ‘ఓహ్..! షేక్ సాహెబ్ కూడా ఇదే అడుగుతున్నారు’ అంటూ ఆనందపడి పోయిన నెహ్రూ జమ్మూ కాశ్మీర్ విలీన ఒప్పంద పత్రాన్ని స్వీకరిస్తూ సైన్యాన్ని కాశ్మీర్ ప్రాంతానికి పంపాలన్న నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ అధీనంలోకి వెళ్ళిపోతే తనకు అధికారం దక్కదన్న భావనతో షేక్ అబ్దుల్లా కూడా సైన్యాన్ని పంపవల్సిందిగా కోరారన్నది జగమెరిగిన సత్యం.
స్వయంగా షేక్ అబ్దుల్లాయే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. 1947 నవంబర్‌లో శ్రీనగర్‌లో ‘స్టేట్స్‌మెన్’ విలేఖరి ఇయాన్ స్టీఫెన్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో- ‘పాకిస్తాన్‌కు చెందిన అధీకృత, అనధీకృత సేనలు భారత్‌పైనే దాడి చేయాలనుకుంటే- జమ్మూలోని పూంచ్‌పై దాడి చేసి రాజా హరిసింగ్ ద్వారా ఇబ్బంది పడుతున్న ముస్లింలను రక్షించవచ్చు కదా! పాకిస్తాన్ సైన్యానికి కాశ్మీర్ ప్రాంతమే కావల్సి వచ్చిందా?’అని తన అసహనాన్ని ప్రదర్శించారు. మహ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీల దళాలు తనను ఎక్కడ చంపివేస్తాయోనన్న భయం కూడా షేక్ అబ్దుల్లాకు విపరీతంగా ఉండేది. అధికారం కోసం తాను ఎంతకైనా తెగిస్తానని షేక్‌అబ్దుల్లా ప్రకటించేవారు. 27-10-1947 శ్రీనగర్‌లో చేసిన ఒక ప్రకటనలో షేక్ అబ్దుల్లా ఇలా అన్నారు.. ‘కాశ్మీర్ కిరీటాన్ని చెత్తలోంచి ఏరుకువచ్చాం. ఈ ప్రాంతం భారత్‌లో చేరాలా? పాకిస్తాన్‌లో చేరాలా? అన్న ప్రశ్నపై జవాబుకు కొంతకాలం వేచి ఉండవచ్చు. తొలుత మనం కాశ్మీర్ ప్రాంతానికి పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకోవాలి.’
జాతీయ భావాలు కలిగి దేశం కోసం తపించే రాజా హరిసింగ్‌ను నిలువెల్లా ద్వేషిస్తూ భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అయిన షేక్ అబ్దుల్లాతో నెహ్రూ ఏళ్ల తరబడి అంటకాగారు. ఈ అపవిత్ర బంధానికి మద్దత్తుఇస్తూ, ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారత్‌ను ముక్కలు చేయాలన్న ఏకైక లక్ష్యం కలిగిన వౌంట్ బాటన్ సైతం సహాయ సహకారాలు అందించాడు. షేక్ అబ్దుల్లాతో అమితమైన మైత్రి వల్లనే రాజా హరిసింగ్ పట్ల నెహ్రూ ద్వేషం పెంచుకున్నారు. 1946 ప్రాంతంలో షేక్ అబ్దుల్లా ‘క్విట్ కాశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించినపుడు రాజా హరిసింగ్ ఆయనను జైల్‌లో నిర్బంధించడం నెహ్రూకు నచ్చలేదు. స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా కాశ్మీర్ ప్రాంతంలో దేశ వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్లాకు మద్దతుగా కాశ్మీర్‌కు వచ్చిన నెహ్రూను రాజా హరిసింగ్ సేనలు అడ్డుకున్నాయి. దీన్ని తనకు జరిగిన అవమానంగా భావించిన నెహ్రూ రాజా హరిసింగ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి దేశశ్రేయస్సును పణంగా పెట్టి జమ్మూ కాశ్మీర్‌లో విద్రోహులకు వత్తాసు పలికారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకునేందుకు భారత్ సైన్యాలు సిద్ధంగాఉన్న సమయంలో షేక్ అబ్దుల్లాను గుడ్డిగా నమ్మిన నెహ్రూ ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. 1953 ప్రాంతానికే షేక్ అబ్దుల్లా భారత వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారని, జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనడానికి అనేక ప్రమాణాలు ఉ న్నాయి. అయినా, నెహ్రూకు ఇవేవీ కనపడలేదు. నెహ్రూ విధానాల వల్లనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని తీవ్రవాదుల స్థావరంగా మార్చివేసి భారత్‌ను ఇప్పటికీ దొంగదెబ్బ తీస్తోంది.
దేశ సమగ్రతకు కృషిచేసిన అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్‌ను నిలువెల్లా ద్వేషించిన నెహ్రూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ చెప్పిన హితవులను కూడా పెడచెవినపెట్టి దేశాన్ని కష్టాలపాలు చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాలను సవాల్ చేసే ఆర్టికల్ 370కి ప్రాణం పోసిన వ్యక్తి నెహ్రూ. కాశ్మీర్‌కు విశేష అధికారాలు కావాలని, స్వయం ప్రతిపత్తి కొనసాగాలని షేక్ అబ్దుల్లా ప్రతిపాదనను గుడ్డిగా అంగీకరించిన నెహ్రూ ఈమేరకు రాజ్యాంగంలో పొందుపరచడానికి కావల్సిన విధంగా రాయించుకోవాలని షేక్‌అబ్దుల్లాను అప్పటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ దగ్గరికి పంపించారు. అప్పట్లో ఆర్టికల్ 370 స్వరూపం ఇలాలేదు. మొదట్లో ఆర్టికల్ 306-ఎ తయారు చేశారు. అందులోంచే వివాదాస్పదమైన ఆర్టికల్ 370 రూపొందింది. నెహ్రూ, షేక్ అబ్దుల్లా ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఇలా అన్నారు- ‘డాక్టర్ అబ్దుల్లా! భారత్ కాశ్మీర్‌ను రక్షించాలని కోరుతున్నారు. కాశ్మీర్ అభివృద్ధి భారత్ దోహదపడాలని కోరుతున్నారు. భారత పౌరులతో సమానమైన హక్కులు కాశ్మీరీలకు ఉండాలని కోరుతున్నారు. కాశ్మీర్‌లో భారత్‌కు కానీ, భారత పౌరులకుకానీ ఎటువంటి హక్కులు ఉండకూడదని వాదిస్తున్నారు. నేను ఈ దేశ న్యాయశాఖ మంత్రిని. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ పనినీ చేయలేను’. (. ఇజూఖ్ఘ్ద, క్యఖ త్ఘీశఆ నిశజూజ్ఘ ఒ్ద్యఖజూ జూళచిళశజూ ర్ఘీఒ్దౄజూ, నిశజూజ్ఘ ఒ్ద్యఖజూ జూళ్పళ్యఔ ఘ్‌ఒ్దౄజూ ఘశజూ ఘ్‌ఒ్దౄజూజఒ ఒ్ద్యఖజూ ద్ఘ్పళ ళజిఖ్ఘ జదఆఒ ఘఒ షజఆజఛీళశఒ యచి నిశజూజ్ఘ, ఇఖఆ క్యఖ జ్యూశ’ఆ త్ఘీశఆ నిశజూజ్ఘ ఘశజూ ఘశక షజఆజచీళశ యచి నిశజూజ్ఘ ఆ్య ద్ఘ్పళ ఘశక జదఆఒ జశ ఘ్‌ఒ్దౄజూ, ని ఘౄ ఆ్దళ జ్ఘతీ జశజఒఆళూ యఛి నిశజూజ్ఘ. ని ష్ఘశశ్యఆ ఇళఆ్ఘక ఆ్దళ జశఆళూళఒఆ యచి ౄక ష్యఖశఆక.’’
తన ప్రతిపాదనను తోసిపుచ్చిన అంబేద్కర్‌ను కాదని నెహ్రూ- ఇదే పనిని గోపాలస్వామి అయ్యంగార్ ద్వారా చేయించుకుని ఆర్టికల్ 306-ఏను రాజ్యాంగంలో పొందుపర్చారు.
జమ్మూ కాశ్మీర్‌లో తాను రగిల్చిన చిచ్చు తొందరగా ఆరకుండా ఉండేందుకు నెహ్రూ పార్లమెంట్‌ను కూడా మోసం చేశారు. 1954లో దొంగచాటుగా ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చొప్పించారు. ఈ ఆర్టికల్ కారణంగా జమ్మూ కాశ్మీర్‌పై భారత ప్రభుత్వం అనేక అధికారాలను కోల్పోయింది. 14-5-1954న రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 35ఏ కారణంగా, ఉపాధి, ఆస్తుల కొనుగోలు, వ్యవహారాల నిర్వహణ, ఉపకార వేతనాలు తదితర అనేక కీలక అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అప్పగించింది. ఇందులో చేసిన ప్రతిపాదనలు, సవరణలు పార్లమెంట్‌కు వివరించలేదు. రాజ్యాంగంలో పొందుపరిచిన ‘సెక్యులర్’ అన్న పదాన్ని జోడించడానికి జమ్మూ కాశ్మీర్ ససేమిరా అంగీకరించలేదు. జమ్మూ కాశ్మీర్ విషయమై నెహ్రూ చేసిన ఘోర తప్పిదాల పాపాన్ని దేశం గత ఏడు దశాబ్దాలుగా మోస్తున్నది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఆశలు మెరుగవుతున్నాయి. ఈ ప్రయత్నాలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం 09899 331113