మెయిన్ ఫీచర్

ప్రీతికరమైన పండుగ.. సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాపర యుగంలో బలరామ, శ్రీకృష్ణ భగవానులు భరతఖండాన్ని పాడిపంటలతో సుసంపన్నం చేశారు. బలరాముడు హాలికుడై నేల తల్లిని సస్యశ్యామలం చేసి వ్యవసాయాన్ని పండగ చేస్తే, శ్రీకృష్ణుడు గోపాలుడై గోసంతతిని అభివృద్ధిపరచి ఏరువాకకు దోహదపడ్డాడు. అలాగే పాలు, పెరుగు, వెన్న ఉత్పత్తులతోను ప్రోత్సహించాడు. ఆహార ధాన్యాల (అన్నం) ఉత్పత్తితో కీలక పాత్ర పోషిస్తున్న పశువులను ప్రజల జీవితాలతో ఎంతగానో అనుబంధం చేశారు. గోమాతల పూజలు, గోసంతతిని ఆరాధించడాలు చేశారు. ఈ నేపథ్యంలో బలరామ, శ్రీకృష్ణదేవులు వ్యవసాయ పండుగలు చేశారు. ఆ స్ఫూర్తినుంచే వ్యవసాయ ఉత్పత్తుల పండుగగా సంక్రాంతి పండుగ ఆవిర్భవించినట్లు పౌరాణికులు చెబుతున్నారు.
ఆదిశంకరుల పునరుద్ధరణతో
వేదములు, స్మృతులు శ్రీ ఆదిశంకరాచార్య భగవత్ పాదులవారు పునరుద్ధరించడంవల్ల సంక్రాంతి పండుగ జరుపుకునే ఆచారం వచ్చిందని అంటారు. ఈ క్రమంలోనే శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి పండుగలను కూడా తీసుకొచ్చాడని చెబుతారు. ఆకాలంలో నరబలులు, జంతుబలులు విపరీతమై పూజా విధానంలో హింస, రక్తపాతం చోటుచేసుకున్నందున, ఇది దైవ వ్యతిరేక కార్యంగా గుర్తించి శంకరాచార్యులవారు తంత్ర విద్యల్లో నరబలిని, బంతుబలులను మాన్పించడానికి యత్నించాడు.
వ్యవసాయ పండుగ
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ, రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుము పండుగలు జరుపుకుంటారు. పంటలు పండడానికి కారణమై తమకు జీవనాధారమైన పశువులను కనుము పండుగ పేరుతో గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మిరూపంగా పండుగ జరుపుకుంటారు.
సూర్యుడు మకరరాశిలోకి
తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సరకాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒక రాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు ఆంగ్ల సంతవ్సరం జనవరి వచ్చేసరికి ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఇది పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మనకున్న రెండు ఆయనాల్లో సూర్యుడు దక్షిణాయన కాలం ముగించుకొని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే ప్రారంభవౌతుంది. కనుక ఇది ఉత్తరాయం పుణ్యకాలం అని పెద్దలు నిర్ణయించారు. అందుకనే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపైనే ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి తర్వాతనే నిర్యాణం చెంది కైవల్య ప్రాప్తిని పొందాడని చెబుతారు.
పండుగ క్రమం
సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది రంగవల్లుల ముత్యాల ముగ్గులు. హరిదాసుల కృష్ణార్పణం సంకీర్తనలు. సంక్రాంతి పండుగను తెలంగాణలో సంప్రాదయ బద్ధంగా జరుపుకుంటారు. ఆంద్రప్రదేశ్‌లో మాత్రం పల్లె పల్లెనా ఇంటింటా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ పుష్యమాసం (జనవరి)లో వస్తుంది. ఈ సమయంలో రైతుల ఇళ్లకు ధన, ధాన్య రాశులు చేరుతాయి. పాడి పంటలతో, సుఖ శాంతులతో ఉంటారు. ఈ సమయంలో వచ్చే సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటిరోజు ‘కామభోగి’, రెండవ రోజు ‘సంక్రాంతి’, మూడవ రోజు ‘కనుము’ (పశువుల పండుగ), కొందరు నాలుగవ రోజును ముక్కనుము పండుగా జరుపుకుంటారు. ఈ సమయంలో పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
మొదటిరోజు భోగి
గ్రామాల్లో తెల్లవారు జామునే నాలుగు రోడ్ల కూడలిలో భోగిమంటలు వేస్తారు. గ్రామ ఇంటి అరిష్టాలు, రోగ, పీడలు తొలగిపోవడానికి ఆ మంటలను కాస్తారు. అలాగే ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్నపిల్లలకు భోగిపళ్ళు తినిపించడం, దిష్టితీయడం వంటి ఆచారాలు చేస్తారు.
రెండో రోజు సంక్రాంతి
‘గోగులు పూచే గోగులు పూచే ఓలత్తా గుమ్మాడి వంటి జానపద గీతాలు ఆలానపలు, కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగువారి పండుగ సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇంటనున్న ధనరాసులను చూసుకొని రైతులు మురిసిపోతుంటారు. నెల రోజులనుంచే ఈ పండుగ హడావుడి మొదలవుతుంది. దీన్ని నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభం అయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పెట్టిన దగ్గరనుంచి అంటే డిసెంబర్ 14 లేదా 15వ తేదీ దగ్గరనుంచి గ్రామాల్లో, పట్టణాల్లో రంగవల్లుల ముగ్గులు, పండుగ సందడి ఊపందుకుంటుంది. గృహలక్ష్మిలు ఉషోదయానే్న లేచి తమ ఇంటి వాకిళ్ళను శుభ్రంగా ఊడ్చి కళ్ళాపి జిల్లా ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. ఇక హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తపారవశ్యంలోకి తీసుకెళతాయి. అపతి ఇంటిముందు ఆగుతూ వారిచ్చిన భిక్షను స్వీకరిస్తూ కృష్ణార్పణం అంటూ హరిదాసులూ, అలాగే గడసాని, గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ము దాసరులు, జంగమదేవరలు, బుడబుక్కలవారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామన అందిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. ఇక ప్రతి ఇంటిముంగిట రంగవల్లులువేసిన రంగు రంగుల అపురూప ముత్యాల ముగ్గులు అతిథులను ఆహ్వానిస్తుంటాయి. సంక్రాంతికి తమ ఇళ్ళల్లో గృహలక్ష్మిలు చేసిన రుచికరమైన పండివంటకాలు పొంగళ్ళు తింటారు.
గొబ్బెమ్మలు, గౌరమ్మలు
ఆంధ్రాలో గొబ్బెమ్మలు, తెలంగాణలో గౌరమ్మలు అంటారు. ఆవుపేడతో అతి పవిత్రంగా శివలింగాకారంలో తయారుచేసి వాటికి పసుపు, కుంకుమ బొట్లను పెట్టి నవధాన్యాలతో ముగ్గుల నడుమ ఉంచుతారు.
పిండివంటకాలు
ముఖ్యంగా చకినాలు, చకోడీలు, అరిశెలు, నువ్వుల గారెలు, తదితర పిండివంటకాలు (అప్పాలు) చేస్తారు. అలాగే నువ్వుల పులగం (పాయసం) చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెట్టిన అనంతరం ఆరగిస్తారు.
కనుమ పండుగ
కనుము పండుగను మూడో రోజున జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. హిందువుల సనాతన ధర్మంలో గోవులను (గోమాతలను) పొజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఆచారం. కాగా పాడి పంటలు పండడానికి ప్రధాన కారణమైన పశువులను పవిత్రంగా కొలిచే సంస్కృతి సనాతనంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో కనుమ రోజు పశువులు ఉండే పాకలను శ్రద్ధగా ఊడ్చి బాగా శుభ్రం చేస్తారు. అలాగే పశువులను గ్రామంలోని చెరువులో శుభ్రంగా కడుగుతారు. అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి బొట్టు పెట్టి అందమైన పూల మాలలతో అలంకరించి ఆరాధిస్తారు.
పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో
కేరళ: శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సమీంలో వున్న పొన్నంబలమేడు కొండమీద మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామిని మకర జ్యోతి రూపంలో సందర్శించుకొని భక్తులు స్వయంగా అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లుగా దివ్యానుభూతి పొందుతూ తరిస్తారు.
గుజరాత్: గుజరాత్‌లో ‘సిదా మనానా’ పరుతో అలాగే ‘వాసి ఉత్తరాయణం’ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సోదరుడు తన అక్కా, చెల్లెళ్లను పిలిచి కొత్త వస్త్రాలను బహూకరిస్తాడు. ఈ సంప్రదాయాన్ని వాళ్లు ‘సిదా’ అంటారు. పంజాబ్ రాష్ట్రంలో మకర సంక్రాంతిని ‘మాంగి’అని పిలుస్తారు. రాజస్థాన్‌లో ‘్భజ్’ అంటారు. అస్సాంలో ‘మాగ్ బిహు’ లేదా ‘్భగాలిబిహు’ అంటారు. గోవాలోలో మహిళలు హల్ధీ, కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సిమ్లాలో మకర సంక్రాంతిని మాఘసాజీ అంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పండుగను ‘కిచెరి’ అంటారు. ఒడిషాలో ‘మకర్‌చౌలా’, బెంగాల్‌లో ‘పౌష్ సంక్రాంతి’, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ‘సాక్రాత్’ అంటారు.
కత్తి కోడి, పొట్టేళ్ళ పందాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర (బొబ్బిలి సీమ), ఉభయ గోదావరి (కోనసీమ) జిల్లాలు, కోస్తా జిల్లాలు గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలతో కత్తికోడి, పొట్టేళ్ళ పందేలతో ఎంతో సందడిగా, కోలాహలంగా ఉంటాయి. దివిసీమ సాంప్రదాయ పడవల పోటీలు, కనోయింగ్, కాయ్‌కింగ్ తదితర ప్రదర్శనలు, డ్రాగన్ బోట్ రేసులు నిర్వహిస్తారు. కాగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకుంటుడడంతో భారతీయ పండుగల్లో ఇది గొప్ప పండుగగా ఆచరించబడుతుంది.
*

- తాళ్ళపల్లి యాదగిరిగౌడ్ 99497 89939