మెయిన్ ఫీచర్

భోగాలు.. దుఃఖజనకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ప్రాణమునకు ఆశ్రయమైనది ప్రాణమయకోశము. ఈ ప్రాణమయ కోశము ఆత్మ ప్రతిఫలించగా, ఆ శక్తితో సంపూర్ణమై, తద్వారా ఆన్నమయకోశము సమస్త కార్యములందు ప్రవర్తిస్తున్నది.
‘‘తస్మాద్వా ఏతస్మాదన్న రసమయాత్ అన్యో‚న్తర ఆత్మా ప్రాణమయఃతేనైషపూర్ణః స వా ఏష పురుష విధ ఏవ’’ (అన్న రసమయముకంటెను లోపల వేరొకటి ప్రాణమయమైన ఆత్మ ఉన్నది. అది ప్రాణమును అనుసరించి పూర్ణమైనది. అదియూ పురుషాకార విధమైనదే- తై.ఉ.2-2). తేజోమయమైన ఆత్మప్రకాశమే దేహములో సర్వత్ర వ్యాపించి, నఖశిఖ పర్యంతము చేతనత్వమును ప్రసాదిస్తున్నది.
168. నై వాత్మాయం ప్రాణమయో వాయువికారః
గన్తాగన్తా వాయువదన్తర్బహిరేషః
యస్మాత్కించిత్ క్వాపి న వేత్తీష్టమనిష్టం
స్వం వాన్యం వా కించన నిత్యం పరతన్త్రః॥
ప్రాణమయ కోశమూ ఆత్మకానేరదు. ఎందువలనంటే, వాయువుయొక్క కార్యరూపముగా ఇదియూ వికారములకు లోనౌతున్నది. చలన స్వభావము గల వాయువు దేహములో స్థిరముగా ఉండదు. లోపలకు బయటకుపోతూ వస్తూ వ్యవహరిస్తుంది. అంతేకాదు, స్వతంత్ర ప్రతిపత్తి లేనిది. తన ఇష్టానిష్టములకనుగుణంగా ప్రవర్తించలేదు. నిత్యమూ పరాధీనమే. తననూ, అన్యపదార్థములను తెలిసికొని, వాయువు తన కర్తవ్య నిర్వహణ చేయలేదు.
మనోమయ కోశము
169. జ్ఞానేన్ద్రియాణి చ మనశ్చ మనోమయః స్యాత్
కోశో మమాహమితి వస్తువికల్పహేతుః
సంజ్ఞాది భేదకలనాకలితో బలీయాన్
తత్పూర్వకోశ మనుపూర్వ విజృంభతే యః॥
పంచజ్ఞానేంద్రియములు, మనస్సు నిర్వహించే సమస్త కార్యములకు స్థానము మనోమయ కోశము. అందువలన, శబ్దరూప రసాది నానాభేదములను జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించే కార్యకలాపములకు మనోమయకోశము ఆశ్రయ భూతము, మరియు సంకల్పవికల్పాది మనోవికారములు, ఇందే ఉద్భవిస్తున్నవి. సమస్త విషయగ్రహణకు మనోనిశ్చయమే కారణము. సుకర్మలతో ఊర్ధ్వగతి పొందుటకు, దుష్కర్మలతో అధోగతి పొందుటకు మనస్సే కారణవౌతున్నది. అదే విధముగా, బంధమోక్షములకు మనస్సు తప్ప ఇంకొకటి హేతువుకాదు. అందువలన, మనోమయ కోశము చాల బలవత్తరమైనదని చెప్పబడింది. ప్రాణమయ కోశముయొక్క లోపల భాగములో ఉండే మనోమయ కోశము దాని పూర్వమున్నదానిని పూరించి విజృంభిస్తున్నది.
మనస్సుద్వారా జరుగుతున్న కార్యములను తెల్పుతూ, శ్రుతి ఇలా ప్రకటిస్తున్నది. ‘‘మనసా హ్యేవ పశ్యతి మనసా శృణోతి కామః సంకల్పో విచికిత్సా, శ్రద్ధా‚శ్రద్ధా, ధృతిరధృతి., చూడబడుచున్నది, మనస్సుచేతనే వినబడుచున్నది. కామము, సంకల్పము, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, లజ్జ, ప్రజ్ఞ, భయము, ఈ సమస్తము మనస్సే- బృ.ఉ.1-5-3).
170. పంచేద్రియైః పంచభిరేవ హోతృభిః
ప్రచీయమానో విషయాజ్యధారయా
జాజ్వల్యమానో బహువాసనేన్ధనైః
మనోమయో‚ గ్నిర్దహతి ప్రపంచమ్‌॥
చక్షురాది పంచజ్ఞానేంద్రియములను, యజ్ఞకర్మచేసే ఐదుగురు ఋత్విక్కులతోను, మనోమయ కోశమును అగ్నిగుండముగాను, విషయములను సమిధలతోను, విషయ వాసనలను ఆజ్యధారగాను సరిపోలుస్తూ, ఈ యజ్ఞగుండములో మనోమయాగ్ని ప్రజ్వలించి, నిరంతరము మండుతూ ప్రపంచాన్ని దహిస్తున్నదని చెప్పబడినది. సంసార బంధవిముక్తి పొందుటకు కూడా మనోమయాగ్నియే బాధించునని దీని సారాంశము.
171. న హ్యస్త్యవిద్యా మనసో‚ తిరిక్తా
మనో హ్యవిద్యా భవబన్ధహేతుః
తస్మి న్వినష్టే సకలం వినష్టం
విజృమ్భితే‚ స్మిన్ సకలం విజృమ్భతే॥
మనస్సుకు భిన్నమైన ఆశ్రయము అవిద్యకు వేరొకటి లేదు. సకలం సారబంధము మన. ప్రాధాన్యమైనది. మనోజనితములైన కామాదులు మనస్సులో నశించిన, ఇతరత్రా పెరగక అందే నష్టమైపోవును. అదే విధముగా, మనస్సులో ఉద్భవించిన మోక్షేచ్ఛ అందే విజృంభించి శాశ్వత సుఖమును ప్రసాదించును.
ఆత్మ అత్యంత స్వచ్ఛమైనది; ఎట్టి వికారములు లేనిది. అనాదియైన అజ్ఞానముచే ఆవరింపబడినందువలన, మనోజనిత అహంకారాది వికారముల కారణముగా, మనిషి అవివేకిగా జీవించే పరిస్థితి ఏర్పడుతున్నది. కాని, అవిద్యను జ్ఞానార్జనతో తొలగించవచ్చు. దుఃఖప్రాప్తికి మూలమైన భోగములపై ఆసక్తిచూపక, సుదృఢ సంకల్పంతో సమస్త మనోవికారములను అంతమొందించుట సాధ్యమే. సాధన ద్వారా సమ్యక్ జ్ఞానము, బ్రహ్మాత్మ భావనతో సమకూడును. కాని, అన్నింటికీ ప్రధానమైనది స్థిరబుద్ధి. మనోనిగ్రహము లేనిదే సంసారబంధము ఛేదించబడదు.
172. స్వప్నే‚ర్థశూనే్య సృజతి స్వశక్త్యా
భోక్త్రాది విశ్వం మన ఏవ సర్వమ్‌
తథైవ జాగ్రత్యపి నో విశేషః
తత్సర్వమేత న్మనసో విజృంభణమ్‌॥
స్వప్నావస్థలో భోగ్యవస్తువులు వాస్తవముగా లేకపోయిననూ మనస్సు భోక్తృత్వమున్నట్లు భ్రాంతిని కల్పిస్తూ మిథ్యారూపమైన స్వప్నప్రపంచమును సృజిస్తున్నది. అదే విధముగా, జాగ్రదవస్థలోను ప్రపంచముపై మోహమును కల్గిస్తున్నది.
- ఇంకావుంది...