మెయిన్ ఫీచర్

గుణాలు మూఢబుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ఇందులో ఎట్టి భేదములేదు. మనస్సు విజృంభణ తప్ప, ప్రాపంచిక వ్యామోహమునకు ఇంకొకటి కారణము కాదు. మనోజనితము కావున మనస్సే తత్ఫలితమును సహితము అనుభవిస్తున్నది. అంతఃకరణ భాగమైన మనస్సుతో కలిసి ఉండే సూక్ష్మశరీరము, మోక్షము ప్రాప్తించేవరకు స్థిరముగా కొనసాగును. కర్మఫల ఉపభోగమునకు సూక్ష్మశరీరమే కారణవౌతున్నదని ముందు కూడ స్పష్టము చేయబడినది (చూ.శో.99).
173. సుషుప్తికాలే మనసి ప్రలీనే
నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధేః
అతో మనఃకల్పిత ఏవ పుంసః
సంసార ఏతస్య న వస్తుతో‚స్తి॥
సుషుప్త్యవస్థలో మనస్సు కారణ స్వరూపమైన పరమాత్మతో విలీనమగుటచే ఎట్టి వికారములు ఉండవు, ఇంద్రియములు శాంతమగును. సుషుప్తిలోనున్న వ్యక్తికి బాహ్యప్రపంచము లేదు. తనకు దగ్గరలో కాని దూరములో కాని జరుగుతున్న విషయమును ఆ పురుషుడు తెలిసికొనలేడు. స్వప్నజాగ్రదవస్థలలో మనస్సు పనిచేస్తున్నందువలన ప్రపంచమునకు వాస్తవికత ఉన్నదనే భావన కల్గుతున్నది. మనోబుద్ధుల కార్యకలాపము లేని సుషుప్త్యవస్థలో ప్రపంచముయొక్క అనుభవము ఇసుమంతయు ఉండదు. అందువలన, సంసార బంధమునకు కారణము మనోవ్యాపారమే.
మనఃసంకల్పముతో, ఆత్మలో కార్యప్రపంచాన్ని విలీనముచేయగా సంసారబంధము అంతవౌను. మనోనిగ్రహమున్న వ్యక్తి మాత్రమే స్థిరబుద్ధితో మోక్షప్రాప్తికి ప్రయత్నము చేయగలడు. భవబంధ విముక్తికి కైవల్యము తప్ప ఇంకొక మార్గమేదీ లేదు.
174. వాయునా నీయతే మేః పునస్తేనైవ లీయతే
మనసా కల్ప్యతే బన్ధః మోక్ష స్తేనైవ కల్ప్యతే॥
మేఘములు వాయువు కారణంగా సమకూడుతున్నవి. అదే వాయువు మేఘములను విచ్ఛిన్నము చేస్తున్నది. మనస్సు ప్రేరేపించిన విషయాసక్తియే సంసారబంధమునకు మూల హేతువు. బంధనాశనమునకూ మనస్సు కల్పించిన బ్రహ్మాత్మబుద్ధియే కారణవౌతున్నది.
175. దేహాది సర్వవిషయే పరికల్ప్యరాగం
బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన
వైరస్యమత్ర విషవత్సు విధాయ పశ్చా
దేనం విమోచయతి తన్మన ఏవ బన్ధాత్‌॥
నానావిధములైన విషయవాంఛలను, భార్యాపుత్రులందు మోహమును, దేహాత్మభావనను కల్పించి మనస్సు, పశువును త్రాడుతో బంధించినట్లు సంసారిని బంధించివేస్తున్నది. ఆ మనస్సే, విషయాసక్తిపై జుగుప్సను కల్గించి, సమూలంగా అహంకారమును, మమకారమును అంతమొందించును, మనఃప్రేరితమైన వైరాగ్యభావన పెరుగుటవలన, బ్రహ్మాత్మభావనతో సత్యానే్వషణకు ఉపక్రమించిన పురుషుడు సంసారబంధమునుండి విముక్తిని పొందుట నిశ్చయము.
176. తస్మాన్మనః కారణ మస్య జన్తో
ర్బన్ధస్య మోక్షస్య చ వా విధానే
బన్ధస్య హేతు ర్మలినం రజోగుణై
ర్మోక్షస్య హేతు ర్విరజస్తమస్కమ్‌॥
బంధమోక్షములు రెండింటికీ మనస్సు కారణవౌతున్నదని మరల వక్కాణించబడుతున్నది. రజోగుణ ప్రవృత్తి రాగద్వేషములకు కోపమునకు మూలకారణము. దాని ఫలితముగా దుఃఖమును అనుభవించుట అనివార్యము. తామసగుణము, అలసత్వమునకు, మూఢబుద్ధికి హేతువు. రజస్తమోగుణములు రెండింటినీ అణచుకొని సత్త్వగుణమును వృద్ధిపరచుకొనిన వ్యక్తి, శాంతమనస్కుడై బంధవిముక్తి పొందుటకు సమర్థుడౌను. ఈ విధముగా మనస్సు మృత్యుపాశములో పడే దుర్గతికి, మృత్యువునధిగమించి మోక్షమును పొందే సద్గతికి, ఉభయవిధములుగా ఏకైక కారణవౌతున్నది.
177. వివేక వైరాగ్య గుణాతిరేకా
చ్ఛుద్ధత్వ మాసాద్య మనోవిముకె్తై్య
భవత్యతో బుద్ధిమతో ముముక్షో
స్త్భ్యాం దృఢాభ్యం భవితవ్య మగ్రే॥
మోక్షేచ్ఛగల బుద్ధిమంతుడు, వివేకము, వైరాగ్యము అనే రెండు గుణములను సుదృఢ సంకల్పముతో పెంపొందించుకొనే ఆసక్తిని మొదటినుండి కనబరచవలెను. వివేక వైరాగ్యములే మనస్సును మలిన రహితము చేయును. ప్రశాంతమైన మనస్సు మోక్షసాధనకు అనివార్యము.
- ఇంకావుంది...