మెయన్ ఫీచర్

హిందూ జాతీయవాదం ఓ నిశ్శబ్ద ప్రభ ంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏను అడ్డుకునేందుకు విప క్షాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. విద్యార్థులను రెచ్చగొట్టాయి, ముస్లిం మైనారిటీలలో అనవసర భయాందోళనలు ఎగదోశాయి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఆందోళనలను ప్రోత్సహిం చాయి. చివరకు, పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమని, విపక్ష ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. కాంగ్రెస్ పాలిత పంజాబ్, కమ్యూనిస్టు పాలిత కేరళ రాష్ట్రాల శాసన సభలలో సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరుతూ, రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయబోమని ఏకంగా తీర్మానాలే చేశాయి. కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ‘గవర్నర్’తో కయ్యానికి కాలు దువ్వింది. అయినా చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రశే్న లేదని కేంద్ర హోం మంత్రి ఒకటికి పది సార్లు స్పష్టం చేశారు.
అయితే, ఇంకా కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిజంగా, విపక్షాలు ఆరోపిస్తునట్లుగా, ఆందోళన వ్యక్త పరుస్తున్న విధంగా, ఈ చట్ట సవరణ అంత ప్రమాదకరమా? రాజ్యాంగ విరుద్ధమా? ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఈ చట్టం తొలిమెట్టు అవుతుందా? అంటే కానే కాదు. ఇందులో భారతీయ పౌరుల ప్రస్తావనే లేదు. భారతీయ పౌరులకు సంబంధించిన అంశమే కాదు. భారతీయ పౌరులు ఎవరికీ వర్తించదు. కేవలం, మన పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాల్లో మత హింసకు గురవుతున్న అక్కడి హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలకు చెందిన శరణార్థులకు మన దేశ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం, సీఏఏ. అంతేగానీ ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన చట్టం కాదు. అలాగే, ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేసే అంశం, ఆలోచన చట్టంలో ఎక్కడా లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. నిజం.. ఇప్పటికే చట్ట ప్రకారం మన దేశ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ ముస్లింలకు కూడా చట్ట సవరణ వలన వచ్చే ముప్పు ఏమీలేదు, ఉండదు. అలాంటిది, ఈదేశంలో పుట్టి, ఈదేశం లో పెరిగి, ఈదేశంలో మైనారిటీ హక్కులు అనుభవిస్తున్న భారతీయ ముస్లింలకు, ఈ సవరణ వలన ప్రమాదం ముంచుకొస్తుంది, ముస్లిం మైనారిటీల పౌరసత్వమే రద్దయిపోతుందని ఆందోళనలు సృష్టించడం రాజకీయ బేహారుల వికృత విన్యాసమే..
ఇందుకు సంబంధించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు మొదలు అనేకమంది ఇంటింటి తలు పులు తట్టి మరీ వివరణ ఇచ్చారు. అయినా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, మమతాబెనర్జీ వంటి ప్రాతీయ నాయకులు, ప్రాంతీయ పార్టీలు, ఈ అందరినీ మించి మీడియా ముసుగులో దేశంలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న శక్తులు మాత్రం సీఏఏలో లేని భూతాన్ని చూస్తున్నారు. మైనారిటీలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, విపక్షాల ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. తాజాగా ఒక ప్రముఖ అంగ్ల పత్రిక నిర్వహించిన సర్వేలో అత్యధిక శాతం మంది సీఏఏని స్వాగతించారు. ఎన్నార్సీ, ఎన్పీఎలకు స్వాగతం పలికారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఏఏని వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినాయకత్వం తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆశించారు.అందుకు వేదికగా విపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ ఆహ్వానాలు పంపారు. 2004లో చేసిన ప్రయోగం మళ్ళీ చేయాలని, లౌకికవాదం ముసుగులో అందరినీ ఏకం చేసి, యూపీఏ తరహ కూటమిని ఏర్పాటు చేయాలని చాలా గట్టి ప్రయత్నమే చేశారు. అయినా, ఆమె ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మమతా బెనర్జీ, ‘మా ఉద్యమాలు మేము చేసుకుంటాము మీతో జట్టు కట్టేది లేద’ని ముఖం మీదనే తలుపులు వేశారు. అలాగే, బీఎస్పీ, ఎస్పీ, ఆప్, కాంగ్రెస్ మిత్రపక్షాలు డీఎంకే, శివసేన కూడా సమావేశానికి హాజరు కాలేదు. అలాగే, జాతీయ స్థాయిలో వేదిక పంచుకున్న కాంగీ, కమీలు కేరళలో ఎవరి దారిలో వారు వెళుతున్నారు. ఇది, ఏమి తెలియ చేస్తుంది? చిత్తం శివుని పైన... భక్తి చెప్పుల పైన’ అన్నట్లుగా విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దినదిన ప్రవర్థమానంగా దిగజారిపో తున్న ప్రతిష్టను నిలుపుకునేందుకు, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఏలను పావులుగా ఉపయోగించుకోవచ్చని కలలు కంటోంది.
నిజానికి, ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే కాంగ్రెస్ పార్టీ పాక్ శరణా ర్థులకు, ముఖ్యంగా హిందువులు, సిక్కులకు మన దేశం పౌరసత్వం ఇవ్వడాన్ని గతంలో ఎప్పుడూ ఇంతలా వ్యతిరేకించలేదు. ఒక విధంగా, చూస్తే దేశ విభజనకు అంగీకరించిన సందర్భంలో మహత్మా గాంధీ, పాకిస్థాన్‌లో స్థిరపడిన హిందువులు, సిక్కులు ఎప్పుడైనా భారతదేశా నికి తిరిగి రావచ్చునని, అది వారి ‘హక్క’ని పేర్కొన్నారు. అలా వచ్చిన వారికి భారత ప్రభుత్వం పౌరసత్వం కలిపించడంతో పాటుగా, ఉపాధి చూపాలని కూడా మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అయినా అప్పట్లో, గాంధీ ప్రతిపాదన లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఎవరూ చిందులు వేయలేదు. నిజానికి, దేశ విభజనను వ్యతిరేకించి, దేశ విభజన జరిగితే అది తమ శవం మీద నుంచి మాత్రమే జరగాలని ప్రకటిం చిన గాంధీ, చివరకు ఈ షరతు మీదనే దేశ విభజనకు అంగీకరిం చారని, చరిత్రకారులు పేర్కొన్నట్లు కొందరు ఈ సందర్భం గా గుర్తుచేస్తున్నారు. గాంధీ మాత్రమే కాదు, గాంధీ, నెహ్రూల నుంచి మన్మోహన్, చిదంబరం వరకు అందరూ ఆయా సందర్భాలలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఏల స్పూర్తిని అందరూ సమర్థించారు. దేశ విభజన జరిగిన పది రోజులకు, 1947 నవంబర్ 25వ తేదీన జరిగిన, కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశం పాకిస్థాన్ శరణార్ధులకు భారత పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించింది. అదే సమావేశంలో వౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, పాకిస్థాన్‌లో హిందువులు తీవ్ర మతహింస కు గురవుతారని, పెద్ద సంఖ్యలో వలస బాట పడతారని స్పష్టం చేశారు. దేశ విభజన జరిగిన పది రోజుల్లోనే పరిస్థితి ఆ స్థితికి చేరిందంటే, పాకిస్థాన్‌లో మైనారిటీలుగా బతుకుతున్న హిందువులు, ఇతర మతస్తుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఉహించుకోవ చ్చును. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా, పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితి దయనీయంగా మారుతుందని ఉహించే కావచ్చు, జనాభా బదలాయిం పు ప్రతిపాదన చేశారు. ‘‘పాకిస్థాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా’’ అనే గ్రంథంలో ఆయన ఈ అంశాన్ని కూలంకషంగా చర్చించారు. అంతవరకు ఎందుకు నెహ్రూ సైతం, పాకిస్థాన్‌లోని మైనారిటీలు ఎప్పటికీ భారతీయ పౌరులే అని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, ఎక్కడున్నా వారిని భారతీయులుగానే పరిగణిస్తామని, వారు ఎప్పుడొస్తే అప్పుడు వారికి పౌరసత్వమ ఇస్తామని ప్రకటించారు. అయితే, గాంధీ, నెహ్రూల మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. ముస్లిం మైనారిటీల బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గిన గత ప్రభుత్వాలు పొరుగు దేశాలలో మతపరమైన హింసకు గురవుతున్న భారతీయ సంతతికి చెందిన వారికి పౌరసత్వం కలిపించే విషయంలో కనికరం చూపలేకపోయారు. అదేవిధంగా 2003లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు నిబంధనలను సడలించి మన దేశ పౌరసత్వం కలిపించాలని, పార్లమెంట్‌లో ప్రస్తవించారు. చివరకు, 2018లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ఆ దేశాల మైనారిటీలకు మన దేశం పౌరసత్వం కలిపించే అంశాన్ని ప్రస్తావించారు. ఇంకా చిత్రం ఏమంటే, ఇప్పుడు సీఏఏ, ఎనార్సీ, చివరకు ఎన్సీపీలను వ్యతిరేకిస్తున్న చిదంబరం, 2008లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ఆనాటి మాటలు, చేసిన వ్యాఖ్యానాలు గమనిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలు ప్రదర్శిస్తున్న వ్యతిరేకత కేవలం రాజకీయమే తప్ప మరోటి కాదని వేరే చెప్పనక్కరలేదు.
అయితే, కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం తో, విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెల్ల మెల్లగా పక్కదారులు చూసుకుంటున్నారు. ఒక వంక కలిసి వస్తాయనుకున్న ప్రతిపక్ష, మిత్ర పక్షాలు కలిసి రాలేదు. మరోవంక, పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ చట్టాన్ని అమలు చేయమని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీర్మానాలు చేయాలన్న ప్రతిపాదన విషయంలో కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కపిల్ సిబాల్ వంటి వారు రాష్ట్రాలు ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసి తీరాలని, కాదంటే, అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అంటుంటే, మరికొందరు సీఏఏను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానాలు చేయిస్తా మని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ లో సీఏఏ విషయంలో గందరగోళం నెలకొందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఏమి చేయడమో పాలుపోక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు రాహుల గాంధీ ‘చౌకీదార్...’ అంటూ వేసిన చిందులు ఏ విధంగా అయితే, బూమ్రాంగ్ అయ్యాయో ఇప్పుడు లౌకికవాదం ముసుగులో ఆడుతున్న నాటకం కూడా నిశ్శబ్దంగా విస్తరిస్తున్న జాతీయవాద ప్రభంజనానికి ఎదురొడ్డి నిలవడం అయ్యే పని కాదని తేలిపోయింది. ఈ సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచింది.
మరోవంక వాస్తవ పరిస్థితులను గమనించిన జేడీయూ, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలు సీఏఏ, ఎన్నార్సీ, ఎంపీఏల వ్యతిరేకత విషయంలో వెనకడుకు వేస్తున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ పార్లమెంట్‌లో సీఏఏను వ్యతిరేకించింది. ఎన్నికల సమయంలో మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురికారాదని ఆయన సీఏఏ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే, జేడీయూ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా సీఏఏ విషయంలో కేంద్రంతో కయ్యం కోరుకోవడం లేదు. మహారాష్టల్రో నవానిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) నాయకుడు రాజ్ థాకరే, కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివ సేన అధినేత ఉద్దవ్ థాకరేని లక్ష్యంగా చేసుకుని సీఏఏ అస్త్రాలను సంధిస్తున్నారు.
సో, మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు సీఏఏని బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్ననాలు.. హిందూ జాతీయవాదం నిశ్శబ్ద ప్రభజనంలో కొట్టుకుపోయాయి. ఇది ఒక శుభ పరిణామం. ఒక విధంగా జాతీయ వాద వ్యతిరేక శక్తులకు ఒక గుణ పాఠం.

- రాజనాల బాలకృష్ణ, 9985229722