మెయిన్ ఫీచర్

సర్వవ్యాపి సర్వేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ఇవికాక ‘‘అంగుష్టమాత్రః పురుషోమధ్య ఆత్మని తిష్ఠతి’’ (బొటనవ్రేలంత ప్రమాణంలో ఉండే ఈ పురుషుడు శరీర మధ్య భాగంలోనే ఆత్మరూపంలో ఉన్నాడని కఠోపనిషత్తులోను (క.ఉ.2-1-12), ‘‘ఏష హి ద్రష్టా, స్ప్రష్టా, శ్రోతా, ఘ్రాతా, రసయితా, మంతా, బోద్ధా, కర్తా, విజ్ఞానాత్మా పురుషః స పరే‚ క్షర ఆత్మని సంప్రతిష్ఠతే’’ (ఆత్మయే చూచేది, స్పర్శించేది, వినేది, వాసన, రుచులను గ్రహించేది, మననము చేసేది, సమస్తము తెలిసికొనేది, మరియూ చేసేదీ. ఈ అక్షర పరబ్రహ్మమే ఆత్మలో స్థిరముగా ప్రతిష్ఠింపబడినది’’అని జీవేశ్వరుల అభిన్నతి ప్రశ్నోపనిషత్తులోను వినిపిస్తున్నది (ప్ర.ఉ.4-9).
205. తదాత్మానాత్మనోః సమ్యగ్వివేకేనైవ సిధ్యతి
తతో వివేక. కర్తవ్యః ప్రత్యగాత్మా‚ సదాత్మనో.॥
సమ్యగ్ జ్ఞానము, అంతరాళములోనున్న పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మతత్త్వమును, మిథ్యారూపములో ఆత్మగా ప్రకాశవంతవౌతున్న అనాత్మతత్త్వమును, వివేకముతో విచారణచేయగా వాటి పరస్పర విరుద్ధ ధర్మములు తేటతెల్లమగును. పరిపూర్ణ ఆత్మజ్ఞానము పొందుటకు, వివేకవంతుడు ఆత్మానాత్మల భిన్నత్వమును, జీవేశ్వరుల అభిన్నతను పరిశీలించి తెలిసికొనవలెను.
206. జలం పంకవదస్పష్టం పంకాపాయే జలం స్ఫుటమ్‌
యథాభాతి తథాత్మాపి దోషాభావే స్ఫుటప్రభః॥
స్వభావసిద్ధముగా నీరు నిర్మలమైనది. కాని, దానిలో బురదవంటివి చేరిన, నీరు స్వచ్ఛతనుకోల్పోయి ప్రకాశించదు. అట్లే, ఆత్మ పరిశుద్ధమైనది. అనాత్మ రూపకమగు దోషములను ఉపాధినుండి తొలగించిన, ఆత్మ తేజోమయముగా ప్రకాశించును.
207. అసన్నివృత్తౌతు సదాత్మనః స్ఫుట
ప్రతీతిరేతస్య భవేత్ప్రతీచః
తతో నిరాసః కరణీయ ఏవాసదాత్మనః
సాధ్వహమాది వస్తునః॥
అత్యంత అంతర్భాగములో ఉన్న సద్రూపమైన పరమాత్మ జ్ఞాన స్వరూపము. ఇంద్రియగ్రాహ్యముకాని దానిని పొందుటకు, ఇది బ్రహ్మముకాదు, ఇది బ్రహ్మముకాదు (‘నేతి నేతి’)అనే వివేచనముతో, అనాత్మవస్తువులైన అన్నమయాది కోశములను, అహంకారాదులకు స్థానమైన ఇంద్రియముల నిరాకరణ (తిరస్కృతి) అనివార్యము. సమ్యగ్ జ్ఞానమును పొందుటకు సుదీర్ఘ ఆత్మవిచారణ (పరిశీలన) తప్ప వేరొక ఉపాయము లేదు.
208. అతో నాయం పరాత్మా స్యాద్విజ్ఞానమయశబ్ద్భాక్‌
వికారిత్వా జ్జడత్వాచ్ఛ పరిచ్ఛిన్నత్వ హేతుతః
దృశ్యత్వాద్వ్యభిచారిత్వాన్నా‚ నిత్యో నిత్య ఇష్యతే॥
విజ్ఞానమయ కోశము వికార గుణములున్న జడ పదార్థాము. అంతేకాక, అది వ్యభిచరించే ప్రవర్తన, పరిచ్ఛేదము అనగా వ్యాప్తిలో కొంత పరిమితిగలది, మరియు దృశ్యవౌతున్నది. అందువలన, శరీరాంగమైన ఈ కోశము పరమాత్మకాజాలదు. పరమాత్మ సుసూక్ష్మము, అగోచరము, పరిధులు లేని సర్వవ్యాప్తి మరియు ఎన్నడూ నశించనిది. అనిత్యమైన విజ్ఞ్ఞానమయ కోశము ఆత్మగా అంగీకరించబడదు.
ఆనందమయ కోశము
209. ఆనన్ద ప్రతిబిమ్బచుంబితతనుః వృత్తి స్తమోజృంభితా
స్యాదానన్దమయః ప్రియాదిగుణకః స్వేష్టార్థలాభోదయః
పుణ్యస్యానుభవే విభాతి కృతినా మానన్దరూపః స్వయం
భూత్వా నన్దతి యత్ర సాధుతనుభృన్మాత్రః ప్రయత్నం వినా॥
విజ్ఞామయ కోశ అంతర్భాగములో ఉండేది ఆనందమయ కోశము. ఇది కోశములన్నింటిలోకి చిన్నది. హృదయాంతరాళములో ఉన్న ఆత్మయొక్క పరమానంద స్వరూపమునకు ప్రతిబింబమే ఆనందమయ కోశము. అయితే, మిగతా కోశములవలె ఈ కోశము కూడ అవిద్యా పరిణామ రూపమైనదే. ఆనందమయ కోశములో తమోగుణ విజృంభణవలన సుఖానుభవముపై ఆసక్తి పెరుగును.

- ఇంకావుంది...